//అందుకే నువ్వు అమ్మవైనావ్//భీమ్// నా కష్టాల్లో కన్నీళ్ళై.., నా సంతోషం వెనుక కారణం అయ్యావ్ అలిగినపుడు తరగని కూటి కుండ.., ఫోన్ చేయనప్పుడు నిద్రపోని రాత్రులు హాస్టల్ నుంచి ఇంటికి వొచ్చిన ప్రతిసారీ దీర్ఘంగా నన్నే చూసే ఆ కళ్ళకు..., ఏం ఇచ్చి ఋణం తీర్చుకోను...! ఋణం సంగతి దేవుడికి ఎరుక.., నువ్వు పదికాలాలు చల్లగా బ్రతుకు బిడ్డ అంటావ్ అందుకే రాజేశ్వరి నువ్వు 'అమ్మ'వైనావ్ మొగుడు తాగొచ్చి కొడుతుంటే.., ఉయ్యాలలో నిద్రపోయే బిడ్డ భవిష్యత్తు అంచనా వేస్తూ తన్నుకొచ్చే ఏడుపుని కడుపులో దాచిపెట్టి కన్నీళ్ళనే ఆకలిగా తీర్చుకున్నావ్ పట్నంలో చదివే కొడుకు ఇంటి నుంచి తిరిగి వెళ్తుంటే ఒక్కసారైనా చూడకపోడానీ వాడి చూపుకోసం రోడ్డు మలుపు దాక ఎదురుచూసే ఓ చిన్ని ఆశవైనావ్ ఒకటేమిటి "అమ్మ" చెప్పుకుంటూ పోతే ఎన్నో...! ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబితే స్వార్ధం అంటావ్ అదే స్వార్ధంతో నేనే అందరికన్నా మిన్నగా బ్రతకాలని ఆ దేవుడినేకోరుకుంటావ్ ...! నీ ప్రేమకు నేను ఏం చేయగలను అమ్మ ఇలా పిచ్చి వ్రాతలు వ్రాయటం తప్ప...!
by Harish Babu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NK0jND
Posted by Katta
by Harish Babu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NK0jND
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి