పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Kanneganti Venkatiah కవిత

My poem" Sanaganune Silpam " Translated by Battina,Raamanadham.z.p.ss mudigonda khammam.} ------Groundnut Oil Art---------------- Snake guardss of sentences Bottle guards of compound words Angular guards of connections Tomotoes of phrases Coriender and curry leaves of rhetorics Potherbs of Idioms are cleansed in Inttellegence liquid solution Chop into tiny pieces at present Thought is not over also onions of similies pope seeds of semblance are fried in the adept of groundnut oil added sufficient chilly powder of honesty too sprinkled a cup of caution of turmoric added a cupful wit Now in the poetry of SRI SRI In the dressing food{concation} of KUNDURTI writings Unite the essence of livelyhood flavour prepared to gather the humanity on the ideas of electronic stove cooking the poetry of dictum.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kshEFS

Posted by Katta

Sriramoju Haragopal కవిత

లీడర్లు జిందాబాద్ ఇది ప్రభుత్వ స్మశానం దీన్ని అతిక్రమించినవారు శిక్షార్హులు ఎవరు దాటలేని చావుగోడలు కట్టించారు ఎవరికి సాటిలేని ఖర్మకాండలు రాసిపెట్టారు చచ్చేవరకు ప్రజల్ని బతకనీయరు వాళ్ళచేతనే వాళ్ళ శవాల్ని మోయిస్తారు చావుగంటలు మాత్రం రాజ్యాంగబద్ధంగా మ్రోగిస్తారు రాబోయే ఎన్నికలకు కొత్త ఎన్నికల సవరణలు ప్రజలంతా జీవితకాలానికి ఒక్కసారే ఓటేస్తే చాలని పార్లమెంటు నుండి అసెంబ్లీలదాకా సభ్యుల నుండి మంత్రులదాకా చట్టాల నుండి శాసనాలదాకా ఎన్నికైనా వారంతా అమరులేనని ఒక్కసారి ఓటేసి చచ్చినవారికి ఉచితం స్మశానప్రవేశం కావాలంటే ఓటర్లని వాళ్ళే పుట్టించుకుంటారట పనులు,జీతాలు,తిండి,ధరలు,సబ్సిడీలు సమానత్వం చట్టుబండలు, మానవత్వం మట్టిగడ్డలు దేశమంటే ప్రజలు కానేకారు దేశమంటే నాయకులోయ్ ప్రజలు కొత్త పుల్బాటిలు ఓటరులై మీరు బతికివున్నదాక ప్రజలుత్త వెధవాయిలు ఓదార్పులు మీరంతా చచ్చినాక రండి, రండి ఓటేసి చచ్చిన పర్మిషన్లున్నపుడే మీ మీ బొందలు మీకు రిజర్వుడ్ 01.02.2014

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abBXXb

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

(http://ift.tt/1abyasW ) ....తరణోపాయాలు.... ఇవి తెరిపినీయక కురిసే ఆర్ద్ర క్షణాలు తడవక తప్పదు! అనాదిది ఈ నిరంతర కాల జీవన ధార తరించక తప్పదు! నేను రోజూ పొద్దున్నే నా పెరటి లోని పొదరింటి పందిరికి పూసిన పూల తడిని కోసుకునేందుకు వెళ్తుంటాను అప్పుడు, తొలి తెలి కిరణశరం తుహిన కణాన్ని ఛేదిస్తుంటుంది రాలి పడుతున్న క్షతగాత్ర వర్ణాలను దోసిళ్ళలో పట్టుకొని నేను ఏడు రంగుల సీతాకోక చిలుకలను ఎగిరేస్తుంటాను! నా ఆకలి కళ్ళు అరుణ రాగాల కోసం గులాబి గుండెను గుచ్చి గుచ్చి చూస్తుంటాయి నా ముని వేళ్ళు చిందిన రక్త బిందువులను చూచుకుంటూ రోజా మొక్క మొగ్గ తొడిగిందని మురిసిపోతుంటాను! రాత్రంతా ఆనందభాష్పాలు వర్షించి ఉంటాయని తొలి మసకలోనే ఇంటి లోగిలినంతా వెదుకుతుంటాను రేయి కార్చిన నీలి అశ్రువులతో నేల తడిసి ఉంటుంది నేను నా అరుగులను అలికి అందగించుకుంటాను! నా వాకిళ్ళలో వరువాత చల్లిన తెలి ముగ్గులు పొరుగిళ్ళ ముంగిళ్ళ లోకి ప్రవహించి ఉంటాయని కన్వేగు వేళలో కదలి పోతుంటాను అక్కడ, ముగ్గుబుట్ట విరిగిపడి ఉంటుంది నేను చెదిరిన ముత్యాలను ఏరుకుంటాను! సుప్రభాతాలు పాడే తరు శాఖలకు కువకువ శ్లోకాలు కాసి ఉంటాయని వేకువ చెట్ల గుండా నడచి వెళ్తుంటాను కాకి ఈక ఒకటి నా నెత్తిన రాలి పడుతుంది నేను హంస తూలికా మృదు స్పర్శలను భావిస్తుంటాను! కాసిన్ని క్షణాల దూరంలో ఏటి నీటి మీద నా పూల నావ తేలుతుంటుంది తెడ్డు కనిపించదు, తెరచాప ఎగురదు నేను పడవలో చిట్లిన పుపొళ్లు ప్రోగు చేస్తుంటాను! ఓ వటపత్రశాయీ! చేతిలో ఎన్ని మఱ్ఱాకులుంటే అంత మంచిది; ఆకులు చిరు తరగ తాకిడికే చిరిగిపోతుంటాయి! 01.02.2014(వాకిలి లో ప్రచురితము )

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyasW

Posted by Katta

Oddula Ravisekhar కవిత

ఇదే కదా మరణం ఇచ్చే సందేశం! సర్వ బంధాలనుండి విముక్తి సమస్త బాధలనుండి స్వేచ్చ కలగన్నవి, పెంచుకున్నవి, పంచుకున్నవి అన్నింటిని తుంచివేసే సంపూర్ణ స్వేచ్చ మృత్యువు జీవితానికి చివరి అంచు కాదు ప్రతి క్షణం మరణ స్ప్రుహ తో జీవించడం మనిషి పోగుచేసుకున్నవన్నీ విసర్జించడం అదే కదా మృత్యువు యొక్క ఆంతర్యం జీవించడమంటే మరణించడమే ప్రతిరోజు పెంచుకున్న బంధాల్ని ఒక్కొక్కటిగా తుంచుకోవడమే జీవించి ఉండగానే బంధాలన్నీ వదలగలిగితే మృత్యువు తర్వాత అదే కదా జరిగేది జీవిస్తూనే మృత్యువును అనుభూతించడం అదే సిసలైన ధ్యానం మరణించడమంటే ప్రేమతో జీవించడం ప్రేమించగలిగే హృదయం కలిగి ఉండటం ప్రతి క్షణం మనతో ఉండే నేస్తం మృత్యువు ప్రతి క్షణం మరణించాలి మన జ్ఞాపకాలకు మరు క్షణం జననం ప్రేమిం చటానికి క్షణక్షణం జనన మరణ స్పృహ ఇదే జీవనం సజీవ జీవనం ఇదే కదా మరణం ఇచ్చే సందేశం (జిడ్డు కృష్ణమూర్తి తత్వ సారం మరియు మరణాన్ని దగ్గరగా చూసిన అనుభవం తో )

by Oddula Ravisekhar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyaci

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-16 విత్తనం మట్టిని,గాలిని, వెలుతురుని,నీటిని ఉపయోగించుకుంటూనే తన అస్తిత్వాన్ని తెలిపే ఒక మొక్కలా ఎలా వికసిస్తుందో... మనిషి తన తప్పులతో,ఒప్పులతో ఉద్వేగాలతో,పశ్చాతాపాలతో ఒకటేమి సమస్త అనుభవాలతో పరిణామం చెందుతూ గమ్యం తెలియని యాత్రలో ఒక ముసాఫిర్ లా ముందుకుపోతుంటాడు...! ----------------------------- 1-2-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dgYIDQ

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిత్వం ఎందుకు చదవాలి? కవిత్వం వలన ఏమిటీ ప్రయోజనం ? కవిత్వం వైపుకు అందర్నీ ఆకర్షించాల్సిన అవసరం ఎందుకు అవసరం ? రోజెర్ హడ్సన్ రాసిన ఈ మాటల్ని ఒకసారి చదవండి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icfmcx

Posted by Katta

Rasoolkhan Poet కవిత

॥నీడల జాడలు॥ ముఖచిత్రం నచ్చలేదని మహాకావ్యాన్ని కాదంటావా. వెలుగు నీదాకా రాలేదని వెన్నెలను నిందిస్తావా. చిరుదెబ్బలకు ఓర్వలేక ఒంటరి శిలవవుతావా. నీవె నిజం అనుకుని అబద్ధంగా మిగులుతావా. నీవు నిరాకరించినా ఆకాశం నీకు నీడనిస్తుంది భూమి నిన్ను భరిస్తుంది. మహా శిఖరమైన ఓర్పుకే తలవంచుతుంది. ఒక్కక్షణం ఆలోచన ఓటమిని జయిస్తుంది. ఆలస్యంగానే అద్బుతం వరిస్తుంది. పి రసూల్ ఖాన్ 3-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aVk7Zc

Posted by Katta

Santosh Kumar K కవిత

||ప్రేమ నాణెం|| ప్రేమ.. ప్రేమలో ఉన్న ప్రేమికులను ప్రేమిస్తే... హాయి రాగాలతో సాగే మౌన గీతాల సంగీతమై వినిపిస్తుంది..!! చూపుల పలకరింపులతో కనుసైగలు చెప్పే కబుర్ల కాలక్షేపమవుతుంది..!! అందమైన అలకలతో కవ్వించే కోరికల వినోదాన్ని పంచుతుంది..!! ఊహల ఊసులతో మరుపురాని తలపులు చేసే ప్రమాణమవుతుంది..!! చిలిపి చిరాకులతో పలకరించే పరాకుల సరసమవుతుంది..!! కస్సుబుస్సుల కసురులతో తేనె కోపాలు వ్రాసే కమ్మని కావ్యమవుతుంది..!! ఇలా ఆనంద చిరునామాల బంధాన్ని చేరువ చేస్తూ చిరునవ్వుని చిందించే సంబంధాన్ని చూపిస్తూ తనలో ఒకవైపును పరిచయం చెస్తుంది ఈ ప్రేమ నాణెం !! ఫ్రేమికులు ఏది మరిచినా పర్వాలేదు కానీ ఆ ప్రేమనే మరిస్తే... వీచే గాలి సైతం విరహ వేదనతో నిండుకోగ వియోగ రాగంలో శ్రుతిలేని సంగీతాన్ని మ్రోగిస్తుంది!! చూపుల దారుల్లో చెరిగిపొని స్మృతులన్నీ చేరగా కన్నీటి చుక్క ఒంటరిని అయ్యానని కన్నీటి పర్యంతమవుతుంది!! కోపంలో అలిగిన కాలం అంధకారం మిగల్చగా అనాథగా మిగిలిన స్నేహం తోడు కిరణాల నీడ కోసం వెతుకుతుంది!! ఊపిరి అందక ఊహలన్నీ కొట్టుమిట్టాడగా మరుగునపడ్డ తలపులన్నీ మరణమంచున మిణుకుమిణుకుమంటున్నవి!! చిరాకులో చిరిగిన ఆశ ఆఖరి శ్వాసలో ఉండగా పంతంతో ప్రాణం కోల్పోతున్న ప్రేమ బ్రతకాలని ఆరాట పడుతుంది!! కన్నెర్రజేసిన కోప తాపాలు తీరని వైరాన్ని కోరుకోగా విరిగి ముక్కలైన మనసు విషాద సాహిత్యాన్ని రచిస్తుంది!! ఇలా విచార గుండంలో చిక్కుకుని ఒడ్డుకి చేరటంలో విఫలమైన ఓడలా చెదిరిన చెలిమి చిగురించదనే చేదు నిజం దిగమింగుతూ తనలో రెండోవైపుకి తెర తీసి ఏడిపిస్తుంది ఈ ప్రేమ నాణెం !! జ్ణాపకాల పాఠశాలలో అనుభవాలు నేర్పించిన పాఠం.. వలపు మలుపుల్లో మది వ్యధను వ్యక్తపరచలేక విస్మయం.. సుఖ-దుఃఖాల మైత్రిలో ఏది మిగులునో తెలియని అయోమయం.. జంట భావనల ఒంటరి నిలయం.. ఎన్నో జీవితాలను శాసించే ఈ ప్రేమ నాణెం!! 03.02.2014 #సంతోషహేలి

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icfokE

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

ప్రేమ పూజారి ప్రేమ‌కి పూజ చెయ్యాలంటే క‌న్నీళ్ల చెట్లెక్కి కాంతిపూలు కోసుకు రావాలి ఎందుకు న‌వ్వుతున్నామో ఎందుకు ఏడుస్తున్నామో తెలియ‌నంత వెర్రితో వాటిని క‌నిపించిన ప్ర‌తివారి నెత్తిన పోసి మ‌ళ్లీ ఏరుకుని మ‌ళ్లీ మ‌ళ్లీ న‌వ్వుకోవాలి మునివేళ్ల‌మీది మంట‌ల‌తో జీవ‌న సౌంద‌ర్యానికి హార‌తివ్వాలి వియెగం చ‌లిగాలిలో నివురు దుప్ప‌టీ క‌ప్పుకుని వ‌ణికుతూన్న‌క‌ల‌ల్నితీసుకెళ్లి నీలాకాశం ఒళ్లో పోసెయ్యాలి అక్క‌డే ప‌క్క‌స‌ద్దు కోడానికి కూడా తోచ‌నంత అశాంతితో న‌డువాల్చి కాస్త ప్ర‌శాంత‌త‌కోసం క‌ళ్లుమూసుకోవాలి గుండెఆవిరితో స్వెట్ట‌ర‌ల్లి స‌ముద్రాన్ని తొడుక్కోమంటూ బ‌తిమ‌లాడాలి వాన‌చినుల రంగుల రాట్నం ఎక్కి గిర‌గిరా బాల్యంలో తిరిగి రావాలి ------------------వ‌సీరా 1985లో ఓ శీతాకాలం రాసిన క‌విత , తేదీ గుర్తు లేదు ఇది నారాయ‌ణ వేణు మాస్టారికి ఇష్ట‌మైన క‌విత‌. వారికోసం మ‌ళ్లీ పెడుతున్నా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAigvC

Posted by Katta

Rasoolkhan Poet కవిత

$ఆల్ ద బెస్ట్$ ఎన్నో పరక్షలను పుట్టుకతోనే గెలిచావు. పసితనంలో ప్రపంచాన్ని చదివావు. ఒకరి నీడవవక నీవే దీపమై వెలుగురేఖలను పంచు. జగాన జయభేరి మ్రోగించు. పి రసూల్ ఖాన్ 1-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MJrfwQ

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

- చిరాశ // ఎడారి బతుకులు // ********************************************* ఉగాదులే రాని యుగాలెన్నో?... వస౦తమే రాని వనాలెన్నో?..... దరహాసమే రాని పెదాలెన్నో?.... కలలు అసలే రాని కన్నులెన్నో?.... అమవసలే అన్నీ.. దివిటీతో వెదికినా దీపావళి కనరాదే వారి చీకటి జీవితాల్లో.... ఎ౦డమావులే అన్నీ.. ఎటుచూసినా ఒయాసిస్సులే కనరావే వారి ఎడారి జీవితాల్లో.... *********************************************** - {01/02/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nA7HbU

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్ /అంతర్లీనం ------------------------ నిన్న జ్వలించిన ఆలోచనలు నేడు పుడుతున్నాయి మళ్ళీ కొత్తగా ఇక్కడే నా దేహంలో ఎప్పుడో ఎండురెప్పల వెనుక ఇంకిపోయిన నాలుగు ఊహా చిత్రాలేవొ రంగులద్దుకుంటున్నాయి­ బహిర్గతమయ్యేట్టు విరమించిన శకలాలన్ని కడుపులోనే అంతమవుతూ నన్ను నాకు గుర్తుతుకు తెస్తుంటాయి అప్పుడప్పుడూ ఇంకెన్ని సార్లు మరణించాలో కొత్తగా పుట్టడానికి ఎప్పటికప్పుడు నడిచొచ్చిన నేల గుర్తులను చెరుపుకుంటూ రహదారిని చిలకరించినట్టు నిడివిలేని అంతర్లీనం మనసున ఎన్ని కోరికల కూటములో లెక్కే లేవు కంటున్న ప్రతిసారి కాంక్షిస్తూనే ఉంటుంది. తిలక్ బొమ్మరాజు 01.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ijp4KT

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటికవిత-68 _____________________________ రమేష్ పమ్మి ||నాకెప్పటికీ సమాధే|| తెలుగులో కథాత్మకవిత్వం-కావ్యాలు రావాలని..అందునా వచన కవిత్వం దానికి ఊతంగా నిలవాలని కుందుర్తి ఆశించారు.అందుకోసం సంస్థలు ఆవిర్భవించాయి..తరువాతి కాలంలో కవిత్వం రకరకాల సంప్రదాయాలు,ఉద్యమాలలొ పడ్దాక ఈ అంశంపై తెలుగు వచన కవిత పెద్దగా దృష్టిపెట్టలేదు.శ్రీ శీలావిర్రాజు దీనికో సం కొంత కృషిచేసినవారిలో ఉన్నారు. మంచి అభివ్యక్తితో,కథనుకూడా చేరుస్తూ కవిత్వం చెప్పడానికి వచనకవితకుండే నిడివి సరిపోదు.ఆ స్ఫూర్తిని కలిగించడానికి కొంత అవకాశం ఉంది..రమేశ్ పమ్మి రాసిన కవిత అలాంటిదే.ఒక మాతృస్మృతిలో రాసినట్టు కనిపించే ఈ కవిత సాంద్రమైన మానవీయభావనని పెనవేసుకుంది.ఆ క్రమంలోనే నగరాలు విస్తరిస్తున్నప్పుడు కలిగే పరిణామాలని కూడా స్పర్శించింది. తల్లికి దూరమైన ఓ కొడుకు గొంతుతో ఈ కవిత ప్రారంభమవుతుంది...చిన్నతనం లో ఏ మయిందంటే కాకెత్తుకెల్లిందని అనేవాళ్లు..అలాంటి పిల్లలలో ఉండే సహజ అధ్భుత రసాన్ని అనుభవించే వాక్యాలున్నాయి. "ఒకప్పుడు అల్లంత దూరాన అందంగా అగుపించేటిది మా అమ్మ ఆమే అమ్మన్న విషయం.. మా రావక్క సెప్పేదాకా నాకూ తెనీదు ఆయమ్మ నను కంటే.. కాకమ్మ ఈడ పడేసినాదట నాకంటే పెద్దది కనుక రావక్కకు ఇదంతా తెలుసు అక్క సెప్పగానే... అమ్మా అని పిలుద్దామనుకున్నా.. కానీ ఏడ్వాలిసొచ్చింది అయ్యాలే మా అమ్మను సంపేశారు.. గండ్ర గొడ్డలతో, రంపపు కోతలతో పాశవికంగా నరికి సంపేశారు.. కొన్నాళ్లకు ఆడో.. పెద్ద సమాధి కూడా కడుతుంటే.. అమ్మకు పూజలు సేత్తారనుకున్నా ఏం సిత్రమో కానీ ఆ సమాధిపైనే చానామంది కాపురమెట్టారు." ఈ వాక్యలలో భాషాసంబంధంగా మంచి మాండలికం కూదా ఉంది..కవిత్వానికి కేవలం ఆఖ్యానం (Neretion)సరిపోదు..దానికి కవిదైన ముద్రనందించే వ్యాఖ్యానం(Comment)కావాలి.ఆ వాక్యాలు చివరన కనిఉపిస్తాయి. "గుబురుగున్న చెట్ల మీద దెయ్యాలుంటాయని అక్క సెప్పేటిది ఆ మాను సమాధి మీద కూడా దెయ్యాలుంటాయని అయ్యాలే నాకర్థమైంది ఆ దెయ్యాలకది నివాసమేమో.. నాకెప్పటికీ సమాధే వాళ్లేమో కాలనీలంటారు నేను శ్మశానం అంటాను" మంచి కథనాత్మకత కల కవిత ఇది.ఒక దృశ్యాన్ని అనుభవించేందుకు దగ్గరగా తీసుకెళుతుంది.. తాత్వికంగా,కళాత్మకంగా రమేశ్ పమ్మి కవిత ఇంకా వృద్దిచెందాల్సి ఉంది.అంశం కొత్తది.చెప్పిన పద్దతి కూడా వైవిధ్యమైంది.కొత్త ఊహలు చేయటం..కొత్త దృశ్యాలని చెక్కటం సాధన చేస్తే ఈ కవి కవిత మరింత బలంగా తనగొంతును నింపుకుంటుంది.మంచికవితను అందించి నందుకు రమెశ్ పమ్మి గారికి అభినందనలు

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH9Hiz

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి ||జన్మరుణం|| కోటి కలలు కని జన్మనిచ్చినారు అమ్మ కడుపులో, నాన్న బుజాలపై నన్ను మోసిమోసి, నా బోసినవ్వులకే మీ జన్మను అర్పించేసిన నా అమ్మా –నాన్న !! ఈ దేహి, దేహం ... మీరిచ్చిన బహుమానం ...!!! ఎన్నిజన్మల పుణ్యమో మీకు జన్మించటం !! ఆజ్ఞాపించండి .... మీరిచ్చినఈ శరీరం, ప్రాణం మీరుణం తీర్చట౦లో అమరమైనా అన౦దమే... !! -------1/2/2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1krAwEY

Posted by Katta

సిరి వడ్డే కవిత

ll నా వల్లకాదంటూ ll అంబరం నీలాన్ని వలదంటే హరివిల్లు వర్ణాలను వద్దంటే తారలు ప్రకాశాన్ని వదిలేస్తే జాబిలమ్మకు చల్లదనమే పడదంటే కూనలమ్మ స్వరాలనే వినిపించనంటే చిలుకమ్మ పలుకులను విడనాడితే మయూరం నర్తనాలను మరిచానంటే కలహంస నడకలలో వయ్యారం వద్దంటే "సిరి"మువ్వ రవళించలేనంటే మురళి ..వేణుగానమే నిలిపేస్తే వీణియకు నాదమే పడదంటే మృదంగం మౌనాలనే ఆశ్రయిస్తే రవి ప్రకాశమే నిలిపేస్తే శశి వెలుగుల జిలుగులనే వదిలేస్తే మబ్బులు జల్లులనే ఆపేస్తే పవనుడు వాయు దిగ్భంధనమే కావిస్తే కుసుమాలు వికాసమే తమ వల్ల కాదంటే విత్తుకు మొలకంటేనే విసుగంటే వృక్షం ఎదగడమే దండగనుకుంటే వసంతమే పూలపరిమళాన్ని నిరాదరిస్తే లతలకు అల్లికలే అలుపు తెప్పిస్తే వాగులు ప్రయాణమే ఆపేస్తామంటే పసి గువ్వల రెక్కలే అలిగితే ధరణి విరామమే కోరుకుంటే సాలీడు అల్లికల నేర్పునొదిలేస్తే గోమాత క్షీరధారలనే నిలిపేస్తే హృదయ స్పందనలు విరామమే కోరుకుంటే అమ్మ శ్రమకు, సహనానికి రాజీనామా చేసేస్తే..... మానవ జాతికి మనుగడే లేదుగా ? జీవనానికి ప్రమాణమే జారిపోదా ? జీవితానికి ప్రయాణమే ఆగిపోదా ? మనిషి జన్మకు అర్ధమే మారిపోదా ? అందుకే .... ఉత్సాహంగా బ్రతుకునే సాగనివ్వు , సంతోషాల వడిలో వాలనివ్వు , తొలకరి జల్లై దిగి రానివ్వు , వాగుల నేస్తమై నను పయనించనివ్వు .. నా ఉనికినే నువ్వు మరిస్తే, నే శ్వాసనే విడుస్తా .. నా ఊహలకే నీవు ప్రాణం పోస్తే , అనుక్షణం నీ ఛాయనై నడుస్తా ... ll సిరి వడ్డే ll 03/02/2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bTXgro

Posted by Katta

Rvss Srinivas కవిత

|| అస్తిత్వం || నీలో ఉన్నది నేనైతే నీతోడుంటానంటూ నీతోడంటూ నా తోడైనది నీవే ప్రతి నిమిషం నిన్ను నీడలా వెంబడించేది నేనైతే, నా నీడై నాకు తెలియకుండానే నన్ను అనుక్షణం అనుసరించేది నీవే నిన్ను ప్రేమిస్తున్నది నేనైతే నా ప్రేమగా మారిపోయింది నీవే. నీవు ప్రాణప్రదమన్నది నీవైనా నాలో ప్రాణదీపమై అఖండ కాతులు వెదజల్లేది నీవే. నీ మదిలో చిత్రించుకున్నది నా రూపమైనా చిత్రంగా మదినే నీ చిత్రంగా మార్చేసుకున్నది మాత్రం నీవే...నీ ప్రణయమే. "నీవు సగం నేను సగం" అనే అర్ధనారీశ్వర ఆరాధనం నీదైతే... నీవే నేను... నేనే నీవు ఒకరు లేకుంటే వేరొకరికి అస్తిత్వం లేదనే రాధామాధవీయతత్వాన్ని నిత్యం స్మరించేది నేను...@శ్రీ 03/02/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH6IXx

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| మచ్చ || ఒంటరి గది, చిన్న కిటికి రెండో మనిషికి నిలబడె చోటులేని ఇరుగు గది... ఆ గదిలో దాదాపు ఐదేళ్ళు బందీని! అదీ పెళ్ళయ్యే వరకు! తలచుకుంటేనే భయం! భయం! రజస్వలైన 12 ఏటనుండి తిండికి స్నానానికి తప్ప - బయటిలోకం తెలియకుండా నిర్బంధానికి గురిచేసిన - సంప్రదాయపు సంకెళ్ళు! మరువలేని కరాళ నృత్ర్యం! కళ్ళల్లో శూలాల్లా గుచ్చుకుంటూ కంటి నిండా నిద్రలేని రోజులెన్నో కన్నీటి చారికలతో చెంపలు - బిగిసిన విషాదపు ఘాతాలెన్నొ! చదువు చంకనాకి - గుణింతాలు మరిచిపోయే మైమరుపు ఆవహించినట్లు - అక్షరాలు తడుముకుంటూ పనికిరాని కాగితాలపై - కాటుకలో ముంచిన చీపురుపుల్లతో రాసుకున్న పిచ్చి భావనాగీతాలెన్నో! *** ముక్కు మొహం యెరుగని కొత్త వ్యక్తితో ముడిపడేవరకు లభించని విముక్తి అది స్వేచ్చ మాత్రం కాదు మరో బందిఖానాకు బదిలీ మాత్రమే అక్కడా ఎన్నో నిబంధనలు, నియమాలు కట్టుబాట్లు .... చదువుకు మాత్రం పుల్‌స్టాప్‌ పెట్టిన వైనం! కోరిక కొంత కాలనాళికలో స్థాపితం కాబడిన కొత్త కారాగారం అత్తవారిల్లు! *** ఒక రోజు పెద్ద ఉరుము మీద పడ్డట్టు మా వారి గొంతు ఎవరో చెప్పితే, విని ముక్కోపంతో రాక్షసుడిలా ఘర్జన... '' చదువురాదను కుంటే కవితలు, కథలు కూడానా....అదీ పురుషాహంకారాన్ని సవాలు చేసేలానా? '' అంటూ తన నడుము బెల్టుతో విశ్వరూపం నా వీపుమీద! కళ్యాణమైన తదుపరి సుఖపడింది లేదు పైపెచ్చు ఆంక్షలు! పాబందీలు! పెళ్ళికాకముందు చిత్తుకాగితాలపై రాసిన భావనలు మా తమ్ముడు జాగ్రతగా వివిధ పత్రికలు పంపినట్టున్నాడు నా కర్మకాలి అచ్చవటం - మా యముడి దృష్టికి రావడం! ఈ రసాభాసకు ఆజ్యం అయింది! మళ్ళీ నాలుగేళ్ళు మౌనం! మా యమునిలో మార్పు వస్తుందేమోనని అదీ ఒక కొడుకుపుట్టిన తరువాతనైనా అడియాసే మిగిలింది..... ఆంక్షలు యథాస్థితే కొనసాగింది! రెండో సంతానం ఆడపిల్ల కలగగానే నాలో పట్టుదల ఎక్కువైంది! నాలా నా బిడ్డ నిర్బంధాలకు గురికాకూడదనుకున్నా! గట్టి నిర్ణయం తీసుకున్నా యముడ్ని సమధానపరచాలని చూశా! - ఊహూఁ . ససేమిరా అన్నాడు! నా అత్త మామలు అదే దారి తీవ్ర సంఘర్షణానంతరం విడాకుల వరకువెళ్ళింది! కొంత కాలానిలి మా ఆమ్మ, నాన్న గతించారు, ఇక నాకు పెద్ద దిక్కుగా ఒకే ఒక వితంతు సోదరి, తను మాత్రం నా భావాలకు విలువిచ్చి ప్రోత్సహించింది కాబట్టి మీ ముందు ఓ రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్టుగా ఒక తల్లిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా ...నిలబడ్డాను.! అందుకు నా లాగే మచ్చలనుభవించిన మా అక్క నన్ను ఇంత దానిని చేసింది....ఆమెకు ఎల్లపుడూ ఋణపడివుంటా నేనెల్లపుడూ..... నా బిడ్డ, నాకొడుకు ఇద్దరు చదువుకుంటున్నందుకు ఆనందం, సంతోషం, నేపుట్టిన 33 సంవత్సరాలనంతరం నాలో కొత్త సమరోత్సాహం ! వంటి మీద మచ్చలుగా మిగిలినా, మనసుమీది మచ్చను తొలగించాలని మచ్చరాలిక రాకుండా నిలువరించాలని! ***..... ఒకానొక దృశ్యం దీనికి ప్రేరణ ..... 1.2.2014 సాయంత్రం 4.10

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jW02EC

Posted by Katta

Pusyami Sagar కవిత

!!ప్రవాహం!! _________పుష్యమి సాగర్ మాటలన్నీ కూడబలుక్కొని తరిమి కొట్టాయి దూరంగా ... రెక్కలు విప్పిన నా ఆలోచన ని ...!!!! పొద్దు లేచింది మొదలు సూరీడు ని భుజాన మోస్తూ పడి లేస్తూ పరిగెడుతున్నా కూడా మస్తిష్కం చుట్టూ సృజన మిణుగురులు ఎక్కడో ఆరిపోయిన భావుకత కి వెలుగు అవుదామని !!!! నా దాహం తీరనిది ఎన్ని ఒయాసిస్సుల వెంట నడిచినా కూనలమ్మ పాదాల కోసం వెతకడమే !! సంఘటన లు వెల్లువెత్తి వాన లా కురిసినపుడు ఇంకు చుక్కలు బుక్కులో రాతలువుతున్నయి ...రక్త సిక్తం గా నో ...విషాదకరం గానో ....!!! ప్రపంచం లో ఏ మూలన ఏది జరిగిన అక్షరం రివ్వున ఎగిరే పక్షి అవుతుంది . మాట వాహకమై బుల్లి పెట్టెల్లో మధ్యమము గా మారి అర చేతుల్లో రెప రెప లాడుతూ వుంటుంది .. అంతు లేని అనంత ..భావ ప్రవాహం ..!!! పిబ్రవరి 1, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bLChaf

Posted by Katta

Jagaddhatri Dhaathri Jagathi కవిత

2) జగద్ధాత్రి ||వందే మా“తరం” || అమ్మ అన్నది ఒక కమ్మని మాట అన్నాడో కవి అమ్మా నాన్న రెండు కమనీయ పదాలు అస్తిత్వం ఇచ్చిన బీజ క్షేత్రాలు మమకారం వారికే కాదు మొక్కకీ ఉంటుంది కాసుల కోసం కన్నవారిని వీడి దూరాలు పోయిన నిస్సహాయత మహాలక్ష్మి లా వెలిగిన అమ్మను విష్ణుమూర్తి లాంటి నాన్నను వారి స్వంత యింటి వికుంఠపురినుండి విడదీసి .... గాజు బొమ్మలను షో కేస్ లో పెట్టినట్టు ఆశ్రమాల్లో వారికి ఏ శ్రమా లేకుండా చూడాలని మొగ్గై చిగిర్చి , పూలు పూసి కాయలు కాసి , నీడ నిచ్చే చెట్లుగా తాము ఎదిగినా ఆ చెట్ల కింద సేద తీరేందుకు అవకాశం లేని అమ్మ నాన్నలెందరో అమ్మ తినిపించిన గోరు ముద్ద రుణం తీరేది కాని దైనా తమ చేత్తో ఒక ముద్ద పెట్టాలని ఆశ పడే ఎందరో బిడ్డలు నాన్న కొని పెట్టిన సైకిలు తొక్కుతూనే ఎదిగిన కౌమారం ఇప్పుడు నాన్నను కారులో తిప్పాలని ఉన్నా అదృష్టం లేని అసహాయత దేశం వీడి రాని వారి మమత వచ్చినా వారి తో కాసేపు గడపలేని కాల హీనత చుట్టాల్లా ఓ పలకరింపు ఎప్పుడో కాస్త ఊరడింపు మా అబ్బాయి సాఫ్ట్ వేర్ అని గర్వంగా పలికే అమ్మ నాన్న హృదయాలలో సాఫ్ట్ వేర్ చిక్కు ప్రోగ్రాముల్లాంటి హార్డ్ వేర్ ని మోస్తూ లక్షలే లక్ష్యంగా మరల్లా అమరి పోయిన మెరుపు లాంటి జీవితాలు ఇటు కన్న వారితోనూ అటు తాము కన్న వారి కోసమూ ఒక్క నిమిషాన్ని కూడా వెచ్చించలేని వెతల జీవనాలు తమ బాల్యం నుండి తీపిని కనీసం రుచి కూడా పిల్లలకు చూపలేని అశక్తత సమస్య తరాల అంతరానిది కాదు ఆత్మీయత కొరవడిన ఆత్మలదీ కాదు మర మెరుపుల్లో చిక్కుకున్న సాలీడు బతుకులు ఎక్కడమే తప్ప దిగడానికి మెట్లు లేని నిచ్చెనలు నిచ్చెనలను పగల కొట్టి పారేసి మళ్ళీ అమ్మ ఒడి లాంటి అమ్మ దేశానికి వచ్చేద్దామన్నా అలవాటు పడ్డ ప్రాణాలకు అలవికాక వదల లేక అటు కన్నవారి కోసం కాకున్నా తాము కన్న బిడ్డల కోసమైనా తప్పని సంపాదన కళ్ళల్లో పెట్టుకు పెంచింది కొడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు అనే నిందలు ఒక చెవిన అలకిస్తూనే ఒక్క రోజు అలసించినా దక్కని ఉద్యోగాల కోసం పరుగులాట దేహానికి మెదడు తప్ప మరేదీ లేనట్టు నిరంతర ప్రయాస ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా అంతులేని ఎత్తులకు ఆప్యాయత చెమ్మ నెరుగని అందమైన గాజు మేళ్ళల్లో బంధింపబడిన బంధాలు ఇంకిన చెలమల్లా పొడి పొడి గా నవ్వుతూ ప్రతి క్షణం దిన గండం నూరేళ్ళాయుషు లా గడుపుతోన్న రోజులు నువ్వు పంపిన డబ్బుతో గాజులు చేయించుకున్నా నాన్నా అని అమ్మ చూపిస్తే వెబ్ కాముల్లో చూడటమే తప్ప ఆప్యాయంగా అమ్మ చేతిని స్పృశించలేని తనం సంధి యుగం లో అటు సంప్రదాయనికీ ఇటు ఆధునికతకూ మధ్య ఎటూ కానితనం ఏమీ చేయలేని తనం ఇవన్నీ ఎంత బాధిస్తున్నాయో ఎరుగనిదీ ప్రపంచం సమస్య ఉన్న చోటే పరిష్కారమూ ఉంటుంది మరి ఈ సమస్యకి ఏది పరిష్కారం ? ఇంకా యోచిస్తూనే ఉంది మా తరం దీనికి హార్డ్ వేరుల్లోనూ సాఫ్ట్ వేరుల్లోనూ ఎక్కడా సోల్యూషన్స్ లేవు కంప్యూటర్లతోనే కాపురాలు చేయాల్సి రావడం అదృష్టమా ? దురదృష్టమా ? అనాలోచితంగా మాట విసిరేసే వారి ముందు అసహాయంగా తల దించుకోవాల్సి రావడం ఇన్ని ఒత్తిళ్ళ మధ్య బతుకుతోన్న తరం మాది పరిష్కారమేదైనా సూచించగలరా ? మీరు.... మీరు ....మీరు.... మీలో ఎవరైనా !!! ఉంటే వెంటనే చెప్పండి మాకూ విశ్రాంతి కావాలనే ఉంది మాకూ సేద తీరాలనే ఉంది సాఫ్ట్ వేరుల్లోనూ హార్డ్ వేరుల్లోనూ చిక్కుకుని మా వేరులని మరిచి చరించాలని మాకూ లేదు మేమూ కన్న బిడ్డలమే మేమూ తల్లి తండ్రులమే గా మరి బొమ్మలు వాళ్లైతే బోరుసులం మేము కామా!!! ....................................................ప్రేమతో జగతి 3.31పి.ఏం 1/2/2014 శనివారం

by Jagaddhatri Dhaathri Jagathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXvUbM

Posted by Katta

Sudarshan Punna కవిత

హైకూలు / పున్న సుదర్శన్ చెట్టుమనసు కొమ్మపై విరిసింది పరిమళంగా.. కళ్లు కరిగి పిల్లాడి బుగ్గమీద తల్లి ప్రేమకై..

by Sudarshan Punna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nGYpLa

Posted by Katta