2) జగద్ధాత్రి ||వందే మా“తరం” || అమ్మ అన్నది ఒక కమ్మని మాట అన్నాడో కవి అమ్మా నాన్న రెండు కమనీయ పదాలు అస్తిత్వం ఇచ్చిన బీజ క్షేత్రాలు మమకారం వారికే కాదు మొక్కకీ ఉంటుంది కాసుల కోసం కన్నవారిని వీడి దూరాలు పోయిన నిస్సహాయత మహాలక్ష్మి లా వెలిగిన అమ్మను విష్ణుమూర్తి లాంటి నాన్నను వారి స్వంత యింటి వికుంఠపురినుండి విడదీసి .... గాజు బొమ్మలను షో కేస్ లో పెట్టినట్టు ఆశ్రమాల్లో వారికి ఏ శ్రమా లేకుండా చూడాలని మొగ్గై చిగిర్చి , పూలు పూసి కాయలు కాసి , నీడ నిచ్చే చెట్లుగా తాము ఎదిగినా ఆ చెట్ల కింద సేద తీరేందుకు అవకాశం లేని అమ్మ నాన్నలెందరో అమ్మ తినిపించిన గోరు ముద్ద రుణం తీరేది కాని దైనా తమ చేత్తో ఒక ముద్ద పెట్టాలని ఆశ పడే ఎందరో బిడ్డలు నాన్న కొని పెట్టిన సైకిలు తొక్కుతూనే ఎదిగిన కౌమారం ఇప్పుడు నాన్నను కారులో తిప్పాలని ఉన్నా అదృష్టం లేని అసహాయత దేశం వీడి రాని వారి మమత వచ్చినా వారి తో కాసేపు గడపలేని కాల హీనత చుట్టాల్లా ఓ పలకరింపు ఎప్పుడో కాస్త ఊరడింపు మా అబ్బాయి సాఫ్ట్ వేర్ అని గర్వంగా పలికే అమ్మ నాన్న హృదయాలలో సాఫ్ట్ వేర్ చిక్కు ప్రోగ్రాముల్లాంటి హార్డ్ వేర్ ని మోస్తూ లక్షలే లక్ష్యంగా మరల్లా అమరి పోయిన మెరుపు లాంటి జీవితాలు ఇటు కన్న వారితోనూ అటు తాము కన్న వారి కోసమూ ఒక్క నిమిషాన్ని కూడా వెచ్చించలేని వెతల జీవనాలు తమ బాల్యం నుండి తీపిని కనీసం రుచి కూడా పిల్లలకు చూపలేని అశక్తత సమస్య తరాల అంతరానిది కాదు ఆత్మీయత కొరవడిన ఆత్మలదీ కాదు మర మెరుపుల్లో చిక్కుకున్న సాలీడు బతుకులు ఎక్కడమే తప్ప దిగడానికి మెట్లు లేని నిచ్చెనలు నిచ్చెనలను పగల కొట్టి పారేసి మళ్ళీ అమ్మ ఒడి లాంటి అమ్మ దేశానికి వచ్చేద్దామన్నా అలవాటు పడ్డ ప్రాణాలకు అలవికాక వదల లేక అటు కన్నవారి కోసం కాకున్నా తాము కన్న బిడ్డల కోసమైనా తప్పని సంపాదన కళ్ళల్లో పెట్టుకు పెంచింది కొడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు అనే నిందలు ఒక చెవిన అలకిస్తూనే ఒక్క రోజు అలసించినా దక్కని ఉద్యోగాల కోసం పరుగులాట దేహానికి మెదడు తప్ప మరేదీ లేనట్టు నిరంతర ప్రయాస ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా అంతులేని ఎత్తులకు ఆప్యాయత చెమ్మ నెరుగని అందమైన గాజు మేళ్ళల్లో బంధింపబడిన బంధాలు ఇంకిన చెలమల్లా పొడి పొడి గా నవ్వుతూ ప్రతి క్షణం దిన గండం నూరేళ్ళాయుషు లా గడుపుతోన్న రోజులు నువ్వు పంపిన డబ్బుతో గాజులు చేయించుకున్నా నాన్నా అని అమ్మ చూపిస్తే వెబ్ కాముల్లో చూడటమే తప్ప ఆప్యాయంగా అమ్మ చేతిని స్పృశించలేని తనం సంధి యుగం లో అటు సంప్రదాయనికీ ఇటు ఆధునికతకూ మధ్య ఎటూ కానితనం ఏమీ చేయలేని తనం ఇవన్నీ ఎంత బాధిస్తున్నాయో ఎరుగనిదీ ప్రపంచం సమస్య ఉన్న చోటే పరిష్కారమూ ఉంటుంది మరి ఈ సమస్యకి ఏది పరిష్కారం ? ఇంకా యోచిస్తూనే ఉంది మా తరం దీనికి హార్డ్ వేరుల్లోనూ సాఫ్ట్ వేరుల్లోనూ ఎక్కడా సోల్యూషన్స్ లేవు కంప్యూటర్లతోనే కాపురాలు చేయాల్సి రావడం అదృష్టమా ? దురదృష్టమా ? అనాలోచితంగా మాట విసిరేసే వారి ముందు అసహాయంగా తల దించుకోవాల్సి రావడం ఇన్ని ఒత్తిళ్ళ మధ్య బతుకుతోన్న తరం మాది పరిష్కారమేదైనా సూచించగలరా ? మీరు.... మీరు ....మీరు.... మీలో ఎవరైనా !!! ఉంటే వెంటనే చెప్పండి మాకూ విశ్రాంతి కావాలనే ఉంది మాకూ సేద తీరాలనే ఉంది సాఫ్ట్ వేరుల్లోనూ హార్డ్ వేరుల్లోనూ చిక్కుకుని మా వేరులని మరిచి చరించాలని మాకూ లేదు మేమూ కన్న బిడ్డలమే మేమూ తల్లి తండ్రులమే గా మరి బొమ్మలు వాళ్లైతే బోరుసులం మేము కామా!!! ....................................................ప్రేమతో జగతి 3.31పి.ఏం 1/2/2014 శనివారం
by Jagaddhatri Dhaathri Jagathi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXvUbM
Posted by Katta
by Jagaddhatri Dhaathri Jagathi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXvUbM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి