సురెక || తెలుగు గజల్-11 .. నిరుపేదను చేరదీస్తే సానుభూతి వున్నట్టే ఆపదలో ఆదుకుంటే ధర్మనిరతి వున్నట్టే. .. సెగలురేపు కనులకింత సైగల తోడుంటే చినదాని మనసులోన అభిరతి వున్నట్టే. .. నెచ్చెలిచేసే అల్లరంత మురిపెంగా భావిస్తే ఎదగదిలో మాలిమికి అనుస్మృతి వున్నట్టే. .. ముసిరిన చలిలోన ఒంటిపాటు వెక్కిరిస్తే చెలివొడిలో చేరాలని అనుమితి వున్నట్టే. .. గతప్రేయసి బంధాలు నాగులై ఊగినా దేవేరిని గెలుస్తుంటే అవగతి వున్నట్టే. .. కలతల దారిలోన సుధలధార నింపితే వార్ధక్యపు బతుకులోన అవరతి వున్నట్టే. .. (తెలుగు గజల్ -06/06/2014)
by Yessaar Katta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1upArXk
Posted by Katta
by Yessaar Katta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1upArXk
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి