ఒక పాట ఒక అనునయమై, ఒక అనుకంపై, ఒక అనుయాయియై నాతోపాటు నాతోడుగా సాగుతున్న బతుకుపాట గడ్డకట్టిన కన్నీళ్ళను కరిగించి గుండెలయల అలలను పొదిగి కట్టుకున్న కలల పిట్టగూళ్ళపడవలకెక్కించిన ఒకపాట గుండెపగిలి నెర్రెలుబారిన బతుకునేలలోకి మొగులన్ని ఇష్టాలను వానధారలుగా పితికి మొక్కలుచేసి ఆత్మీయంగా పచ్చటిరాగాలు పంచే పాట ముట్టుకుంటే తడి, పల్లవిని పట్టుకుంటే అమ్మఒడి ఆ పాదాలు ఆమె మోహనమంజీరాల శింజానాల పాట ఆంతర్యశిఖరాలనుండి, ఆపాతమధురంగా లోలోపల దూకుతున్న అనంతభావాల, చిరంతన నేస్తాల జలపాతాలపాట మేఘాల పున్నాగచెట్లు కురిసిన అనురాగపుష్పాల రజనీగంధగీతం సముద్రపు కెరటాలను పరిచి రాసి పంపిన ప్రేమకవితలపాట నీలిమాచ్ఛన్నగిరిశిఖరాలపై ప్రసరిస్తున్న కిరణశ్రుతుల ఆలాపన పెదవుల తలపుల తలుపులు తెరుచుకుని ఎగిరివచ్చే కాలహంసపాట నా బహిరంతరాలలో పునర్యోగమై నన్ను గానధ్యానంలోకి పిలిచేపాట ఒకపాట తనపాట
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nU4Nld
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nU4Nld
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి