పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

Ravela Purushothama Rao కవిత

ఈ సమరం ఇక ఆగదు ==============************ రావెల పురుషోత్తమ రావు ఈ యుద్ధం ఇక ఆగదు ఇలానో అలానో ఎలాగోలా ఇక సాగుతూనే వుంటుంది ఇవి ఇవ్వాల్టికివ్వాళ యేర్పడిన పొరపొచ్చాలు కానేకావు శతాబ్దాలుగా యేర్పడిన తారతమ్యాలివి యిదే తంతు ఇలా నిరాటంకంగా సాగుతూనేవున్నది శ్రీ నివాసుల జాబితాలో శిఖరారోహణ మొదలయిననాడే ఈపోరు ప్రారంభమయింది అప్పటినుండీ అనుస్యూతంగా ఈ వ్యత్యాసం పాటింపబడుతూనే వుంది పదునైన యెత్తుగడలతో ప్రవాహ ధృతిలో కడలిలా కదలి పోతున్నది నేతలవాగ్దానాల మాటలు నీటిమూటలై జనజీవనశ్రేణిలో కలతలు సృజిస్తూనేవున్నవి నిత్యావసరాలధరలు నిలువెత్తునా మండిపోతూ ఆకాశమార్గాన దిగిరాను దిగిరాను భువికంటూ పైపైకి ఎగసిపడుతూ దీర్ఘకాలంగా మనుషులను క్షోభ పెడుతూనేవున్నవి . అడుగడుగునా ఆకాశ హర్మ్యాలు అసంఖ్యాకంగా పెరుగుతూ ఆదాయపు పన్ను శాఖల అసమర్ధతను వేనోళ్ళా , నల్దిశలా ,చాటుతూనేవున్నది కుప్పతొట్లదగ్గర విసిరేయబడిన విస్తరాకులపైకి పేదరికం కుక్కలతోపాటుఎగబడుతున్నంతకాలం, ఈ సమరం యిలా సాగుతూనే వుంటుంది. కులాల మధ్య సంఘర్షణలు మతాలపేరిట మారణ హోమాలు అగ్రసనాధిపత్యం పేరిట అనాదిగా బడుగు దేశాలపై జరుపుతున్న పాశవిక దాడులు అన్ని కలగలసి ఇలా కదనరంగానికి సిద్ధం చేయడానికి,నేపధ్యంగా వ్యూహాలు రచిస్తున్నవి శిశిరరుతువులే జీవితకాల పర్యంతం శిరస్సు నధిరోహిస్తానంటే యెలా? వసంత రుతు సోయగాలకు దూరంగానేఉండాలని కొందరిజీవితాలను శాసిస్తే యెలా కుదురుతుంది? ఈసు, అసూయలు యిలా మానవజాతిని మలినపరుస్తూ పోతుంటే అస్తవ్యస్తమైన జీవన విధానాలు అవనిని అతలాకుతలం చేస్తున్నంతకాలం ఈ రణప్రస్థానం ఇలాసాగుతూనేవుంటుంది ఈపగలూ ద్వేషాలూ ,దట్టంగా పొగలు విరజి మ్ముతున్నంతకాలం ఈసమరం ఆపే ప్రసక్తే లేదనేలాగుంది అనంతంగా ఈసమరం యిలా నిరాటంకంగా సాగుతూనే వుంటుంది బహుపరాక్ ***************************************06-6-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pY6KtT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి