----కనుమరుగైపోయార లేక కనబడకుండా ఉండి పోయార.------ "ఎక్కడ వారెక్కడ" 'పుట్టిన రోజు నేను లేవగానే'... అర్ధం లేని అర్ధ రాత్రే దయ్యాల తో జరుపకుండ, అమ్మ సుప్రభాత శ్లోకాల మధ్య నా అంతట నేను నిద్ర లేచే దాక వేచి ఉండి, లేచాక నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే నా అనుకున్న నా వాళ్ళు... పది వేలు ఇచ్చి పది మందికి భోజనశాలలో స్నేహితులకి దావత్ ఇవ్వమనకుండా, పదింటికల్లా ఇంటికి రమ్మను , రాత్రి పదింటికి ఆనందం తో తిరిగి ఇంటికి పంపిద్దాం అనే అమ్మా, నానా... ప్రతి వారము వెళ్లి తినే అదే భోజనశాల కి వెళ్లి అదే షెఫ్ చేతి వంట కాకుండ, మా అమ్మ చేతి రుచి చూస్తాం అని అడుగుతూ అలా కనిపించే వారేరి ఎక్కడ వారెక్కడ. 'ప్రతి రోజు నేను లేవగానే'......... నా చుటూ వందలాది మంది సంచరిస్తున్నా , అందులో, నాకు నిద్ర పటిందో లేదో అని ఆరా తీసే అమ్మ, రాత్రి లేటుగ ఎందుకు వచ్చి నిద్ర పోయావు అని అడిగే నాన్న, ఆప్యాయతతో శుభోదయం అని పలకరించే సోదరి, సోదరుడు, నేను చేసిన ఆలస్యానికి ఇంటి గేటి ముందు కోపం తో ఎదురు చూసే మిత్రుడు, పరిచయస్తుడు, ఆ వందలాది మందిలో అలా కనిపించే వారేరి ఎక్కడ వారెక్కడ. 'పండుగ రోజు నేను లేవగానే'........ పూల రాసులు, పాపిడి బిల్ల తగిలించిన కురులతో, అర్ధరూపాయి వెడల్పాటి రవి వర్ణపు బొట్టుతో, మెరిసే దిద్దులతో, గొలుసు, గంధం తో నిండిన గొంతుతో, గల గల గాజులతో, అందమైన చీర కట్టుతో, నడుముకు వడ్డానం తగిలించి, వెండి అలంకరణ, బంగారు వర్ణపు పాదాలతో అలా కనిపించే వారేరి ఎక్కడ వారెక్కడ.
by Jagadish Bjp
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ok7OJx
Posted by Katta
by Jagadish Bjp
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ok7OJx
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి