పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

Krishna Mani కవిత

నా ఏడుపు ____________________________కృష్ణ మణి ఆకాశం అట్లనే ఉంది మొన్న జూసినట్లు చుక్కలు మెరుస్తునే ఉన్నాయి తెప్పలు తిరుగుతునే ఉన్నాయి కాని పచ్చని పంట పొలాల నా ఊరు ఇప్పుడు పట్నమై ఏడుస్తుంది ! నాగరికత నా చెట్లను మింగింది నా నేలను మింగింది నా గాలిని గలీజ్జేసింది కంపనీల మన్నువడ నీళ్ళను మింగి ఇషం ఇడుస్తుంది రుపాయిబెట్టి నీళ్ళు తాగితే పానమంత కలకల ! అడుగున గుంత కొట్టి ఆకాశానికి మెట్లుగట్టినట్లుంది ఆకరికి పక్షుల జాగలనుగిట కబ్జా చేసిన్రు ఇప్పుడు నా ఊరిల అడుగు పెడతలేను మీద పరిశిన సిమెంటు రోడ్డు మీదే మిషీను ఉందని సంకలుగొడుతున్రు కరెంటు కనుమరుగైతెగాని కండ్లు తెరువరీ పిచ్చికాకులు ! బర్లను తోలుకుదిరిగిన రోజులకేమాఎనో మ్యాకలు గొర్లు గోడ దుంకి ఏండ్లు గడుస్తున్నయి సుద్దమంటే జూపార్క్ పోవలెనేమో భూములకు రెక్కలొచ్చి జీవుల డొక్కలు దేలినయి ఇప్పుడు కప్పలు కూడా కండ్లవడుతలేవు ఎడ్లబండి కనిపిస్తే వింతగ సూస్తున్రు మా పిల్లలు ! నీళ్ళు లేక బోర్ల పోక్కలెండేకాడికి వచ్చింది లోకం ఆప్పట్ల ఏడ సూడు బొందలల్ల అద్దం ఉంటుండే వాగోస్తే పర్కపిల్లల వేట ఉంటుండే సలోస్తే చిత్తలకాయల కాల్చుడు ఉంటుండే ఎండొస్తే తాటిముంజల ఆకలున్టుండే ! నడూర్ల కూసోని మంచి చెడ్డ మాట్లాడుతుండే ఇప్పుడు ఎవడన్న కూసుంటే ఎక్కిరిస్తున్నరు కాముని కాల్చేకాడ కరువైన జనాలు గణేశులకాడ భజనలు చేసి చాన దినాలైతుంది పాడుదమంటే పక్క పాడేటోడు గతిలేడు ! గతిలేని గావరాలా మరి బలిషిన బలుపా ఊర్ల మనషుల్ని కలువాలంటే బోనాలకో లేక బతుకమ్మకో అదిగూడ ఇంకెన్ని రోజులో సూడాలే ! కృష్ణ మణి I 06-06-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pXiWLz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి