పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

Srinivasu Gaddapati కవిత

కలం మౌనం వహిస్తే //శ్రీనివాసుగద్దపాటి// ---------------------------------------------------- కలం మౌనం వహిస్తే కాలమేం ఆగిపోదు... మౌనాన్నంతా మూటగట్టుకొని మీ కడుపులోనే దాచుకోండి రాసులు రాసులుగా రాసుకున్న కవిత్వాన్నంతా ఇనుపబీరువాల్లో కుక్కేయండి పనికిరాని మీ కలాల పాళీలన్నీ విరగొట్టండి చెదలుపట్టిన కాగితాలన్ని చెత్తకుప్పలో పారేయండి బూజుపట్టిన మీ మెదళ్ళను గాజుసీసాల్లో భద్రపరచుకోండి మీ అవార్డులకు ఉరిబిగించి గోడకు వ్రేళాడదీయండి తెలంగాణమంతా అగ్నిగుండమై నేలతల్లి గర్భశోకాన్ననుభవిస్తుంటే. మాటమాత్రమైనా పలకరించలేదే...! కండ్లుండి చూడలేని కబోదిలా.. ఎంతకాలం దాక్కుంటావ్..? నీ ఇజాల పరదాలమాటున (తెలంగాణ వచ్చినంకగూడ ఒక్క వాక్యమైనా రాయని కవి మిత్రులందరికి సాదరంగా)

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1peJurL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి