పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

R K Chowdary Jasti కవిత

బుద్ది తనకి చేతులున్నాయ్ కాళ్ళున్నాయ్ రెక్కలున్నాయ్ కానీ తను కదలదు ఎందుకంటే తను తన తల్లిని వదలదు వదలలేదు కూడా తను శాఖోపశాఖలుగా విస్తరించి తన తల్లిని తన నరాలతో హత్తుకున్న ఉన్నత హృదయం నాదే సంకుచతత్వపు హృదయం మెదడు మాత్రమే విస్తరించి హృదయం ముడుచుకుపోయి స్వార్ధమే పరమావధిగా చేసుకుని ప్రేమదోషంతో నా తల్లిని ఏడిపిస్తున్న దోషిని నేను! తను నా దుస్థితిని చూసి నాలోకి తన ప్రేమవాయువుని పంపిస్తుంటే నాలో ఉన్న అమానుషం కరుగుతుంటే మెల్లగా మనిషిగా మారుతూ నేను! నా కౌగిలిలో ఒదిగిపోయిన నా తల్లి తన కన్నీటితో నా గుండెని తడిపేస్తుంటే నేనొక చెట్టునై నేలలో పాతుకుపోతుంటే ఆకాశం నన్ను దీవిస్తుంటే ప్రకృతి పరవశిస్తుంటే సుమధుర మనోగీతాన్ని పాడుకుంటూ మేము! 06జూన్2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nVg84E

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి