మళ్ళీ మళ్ళీ ఇంత నిశ్శబ్ద౦లోనూ ఎక్కడి నుండో పూల పుప్పొడి రాలి పలకరిస్తున్న చిరు అలికిడి. ఎన్ని వెన్నెల చుక్కలు తాగి౦దో కాని రాత్రి పూలతోటల మధ్య తీగల్లేని మాటలమీద చకోరమై నర్తిస్తూ ఊహ. వెచ్చని తలపులు కప్పుకున్న శిశిరపు శీతల పవనం నిలువెల్లా మునివేళ్ళతో తడిమి ఊసుల మధుర గానాలు వినిపి౦చే వేళ మాటల పూరెక్కల మెత్తని వానలో తడిసి తడిసి పచ్చని గరిక మరకతాల్లా మొలకెత్తుతాను ఉల్కలుగా వెలుగు ద్వీపాల్లా ఉండు౦డి రాలిపడే నవ్వులన్నీ ఏరుకు మాలలల్లుకు౦టాను మౌనం నా చుట్టూ దట్టంగా మంచువానై కురిసినప్పుడు లో లోపలి పొరల్లో దాచుకున్న పాటల పొదిలో౦చి ఒక్కొక్క పుష్పకాన్నీ బయటకు లాగి గతాన్ని పొదిగిన వెచ్చని కిరణాల రెక్కలమీద పరచుకు పరిమళ భరిత వనసీమలను చుట్టి వస్తాను పేరుకు పోయిన మంచు పొరల కింద ముణగదీసుకు బిక్కు బిక్కు మంటూ ఎదురు చూసే బక్కచిక్కిన వసంతం కళ్ళకొసల్లో నిలుపుకున్న ప్రాణాలు వెండి మబ్బులు దాటుకు ఓదార్చే వెలుగు కిరణాల స్పర్సతో సస్య శ్యామలమైనట్టు పెదవికొసల నుంచి జారిన తొలిపొద్దు పిలుపుకే ఒళ్ళు విరుచుకున్న వసంతాన్నవుతాను నాలో నేను హరిత వనాన్ని ప్రవహిస్తాను సుతి మెత్తని పాదాలను అరచేతుల్లో మోసే నీ ఉనికి ప్రతిరోజూ నాకో పునర్జన్మే .
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nUnm96
Posted by Katta
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nUnm96
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి