|| అం త రం గ పు అ ల లు || మహేశ్వరి గోల్డి ఓ నిఘూడ సముద్ర గర్భం మనతోనే పుట్టినా ఎవరికీ చెప్పుకోలేని అబిప్రాయపు గులకరాళ్ళు జీవితకాలమంతా ఆ గర్భంలో నానుతునే వుంటాయి....... లక్షలకొద్దీ మెదళ్ళను తవ్వితీసిన సిద్దాంతాలూ..విశ్లేషణల మట్టి సాగే కాలంతో కలిసి మెలగకపోయినా....... అలలు అలలుగా వచ్చి చేరుతున్న కెరటాలతో పాటు ఆ సముద్రంలో పొరలు పొరలుగా..ఘనీభవించి పోతూనే ఉంటాయి సంప్రదాయపు చలికి గడ్డకట్టుకుపోయిన ఆలోచనా శీతల హిమానీ నదాలు.. నులి వెచ్చని నూతన పోకడల ప్రవాహపు ఒరవడులూ.... చేతనకు అచేతనకు మధ్య అనునిత్యం సంఘర్షణే ... పేరుకుపోయిన రాతి ఫలకల్ని చీల్చుకుని రగులుతున్న ఉద్వేగం లావా అయి ఉబికివస్తే తప్ప మురికి వాసనలు లేని కొత్త ఆలోచనా తరంగాల సుందర ద్వీపాలు అవనిపై ఉద్భవించవేమో కదా ఓ అంతరంగ విహంగమా....!? 06/06/2013
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYD3sE
Posted by Katta
by Maheswari Goldy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYD3sE
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి