Si Ra// కమ్మ్యునిస్టు కవిత // 6-6-14 నువ్వు ఈ కవితను చదువుతున్నాను అనుకోవటం,నీ భ్రమ. ఈ కవితే నిన్ను చదువుతొంది. ఈ తెల్లటి పేజీపై తేలుతున్న ఈ కవిత, కవిత కాకముందు ముందు చాలా జీవితాలు గడిపింది, బిచ్చగాని బొచ్చెలో ఎగిరిగంతేసే చిల్లరగా హంతకుడి కత్తిలా, విప్లవకారుడి గాయంలా, అస్తికలుగా, తిరస్కరించిన ప్రేమలేఖగా ఎన్నో జన్మలతరువాత ఇప్పుడు కవిత అయ్యింది. ఈ కవిత, అమాయకురాలు, ప్రపంచం మారుతుందని ఇంకా నమ్మకం తో ఉంది, కోపిష్టి, ఎవరినీ లెక్కచేయదు, నిన్ను కుడా, ఎన్ని సార్లు చచ్చినా దాని బూడిద లోంచి తిరిగిలేస్తుంది, ఎడారిలో ఒయాసిస్ లాంటిది, వెసవికాలంలో వొచిన తుఫాను ఈ కవిత కమ్మునిస్టు మనిఫెస్టొ చదివీ చదివీ పిచ్చిదయ్యిపొయింది, కార్ల్ మార్క్స్ కి తన ప్రేమ విశయం చెప్పాలని జీవితాంతం కలలు కనే ఒక కార్మికురాలు- ఈ కవిత. ఎందుకైనా మంచిది, ఈ కవితతో కొంచం జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇది నిన్ను తడిపేస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, నీతో వాదిస్తుంది, చివరికి నిన్ను మార్చేస్తుంది, నిన్నూ ఒక కమ్మ్యునిస్టు కవితను చేస్తుంది.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i80rze
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i80rze
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి