..../ విశ్వాంతరాళ స్వగతం /..... (Soliloquy of the universe) నేను విశ్వాన్ని ! దూరదర్శనికి అందని దూరాన్ని అంచులు లేని అనంత గోళాన్ని. శూన్యం నుండి శూన్యానికి నా ప్రయాణం బిందువు నుండి బిందువుకు నా పరివర్తనం . నిన్న- అంటే: పద్నాలుగు బిలియన్ ఏళ్ల నాటి నా శైశవ ప్రాయంలో ఓ బిలియన్ వంతే ఉండేది నా దేహం ఈనాడు వంద కాంతివత్సరాల ఊబ కాయం ! ఆనాడు ఆ పరమాణు చిరుగర్భకోశం లో ఎలా ఒదిగానో? ఈనాడు బృహత్తర బ్రహ్మాండ పరీణాహంగా ఎలా ఎదిగానో? ఊహాతీతం ! నా అనుజకోటి 'సమాంతర విశ్వగోళాల' నా అనుంగు అనంత పాలపుంతల సంఖ్య అంతుచిక్కని ఒక అగణిత ఖగోళగణాంకం ! ఈ వైరుధ్య గురుత్వాకర్షణల సంగ్రామం అంతుపట్టని ఓ కాలాకాశ దేవరహస్యం ! అంతంలేని నా అనివార్య అంతిమ విస్పోటనం ఒక కుదింపో? ఓ తెగింపో? అనాది సంకోచ వ్యాకోచాల కొనసాగింపో?! నేను విశ్వాన్ని! అమేయ గోళాన్ని! దర్శించరాని దూరాన్ని! విశ్వాత్ముని మహత్తులో వికసించిన ఓ చిన్ని వైచిత్ర్య క్షణిక వర్తమానాన్ని!
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elioOy
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elioOy
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి