పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఏప్రిల్ 2014, గురువారం

Bhaskar Kondreddy కవిత

kb||రాహిత్యం|| 1 అలా వదులుకుంటూ పోతున్నావ్, ఒక్కోక్కరిని. మునిగిపోతున్నప్పుడు, చేయందించేవారు దొరకరేమో మరి నీకు మిత్రమా! అంటూ హెచ్చరించాడో ఆప్తుడు. కాస్తంత విరక్తితో కూడిన చిరునవ్వుని వదులుకుంటూ, కూడదీసుకున్న పదాలను వదిలేస్తు పెదాల చివరలనుండి, ఇలా అంటానిక. ఇంకాస్త కూరుకొని పోలేక పట్టుకున్న బరువులతో ఇంకా లోతుల్లోకి వెళ్లలేక కట్టుకున్న బంధాలతో ఒక్కోక్కటి వదిలేసుకుంటున్నాను, తండ్రీ ఇక పైకి తేలే మార్గాలు వెతుక్కుంటూ. భవసాగర జలాల పై పయనించాలంటే నేనుగా, తృణప్రాయంగా వదులుకోల్సిందే కదా, అన్నింటిని. ఇంకేమీ దాచుకోకుండా, లోపలి లోగిల్లలోన. 2 తేలికపడితే కాని తేలలేం కదా మరి. ------------------------------------------10/4/2014 ఈనెల వాకిలిలో ప్రచురితం, పంపినది 6/3/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R4ckj1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి