ఫణీంద్ర//ప్రేమంటే?//09.04.2014 అక్కున చేర్చుకొని,గిండెలకత్తుకొని, ముద్దులతో,మురిపాలతో.. అనుక్షణం,నన్ను చూసుకొని,పొంగిపోయే.. అమ్మ,నాన్నల,ప్రేమే ప్రేమంటే అనుకొనే.. చిన్ననాటి రోజుల్లో... ఒక్క ఐస్క్రీం కొనుక్కొని మరొక్కటి సీత కోసం కొనుక్కెళ్లితే బావుణ్ణు.. అనిపించే ఆ చిన్న హృదయంలో మెరిసే మెరుపే, ప్రేమని అప్పుడు తనకు తెలియదు! నిక్కర్ల నుంచి ఫాంటులకి మారిన రోజుల్లో, గౌనులనుంచి లంగా ఓణీలకి మారిన సీతతో, ఎంత సమయం కబుర్లతోగడిపినా.. ఇట్టే గడిచిపోయినట్లనిపించడం, నిద్ర లేవడమే,పక్కింటి పెరట్లో.. పువ్వులు కోసుకొనే సీత కోసం వెంపర్లాడటం, చూసిన క్షణం నుంచీ, చెప్పలేనంత ..హాయి! అదే..ప్రేమని యౌవ్వనంలో అప్పుడే అడుగుపెట్టిన తనకి తలియదు! కాలేజీ చదువులకి పట్టణ ప్రయాణం.. సితను చూడకుండా వుండలేనేమో అనే, చిత్రమైన భావన..మదిలో ఆరాటం.. ఏదో పోగొట్టుకుంటున్నట్లనిపించే వెలితి, పైకి చెప్పలేని మూగ వేదన.. అదే ప్రేమంటే..అనికూడా ఆరోజు అర్ధం కాలేదు! కొత్త ఊరు..కొత్త పరిచయాలు.. కాలేజీ మెట్లెక్కాం అన్న ఒకింత గొప్ప భావన! ఎందుకో సుందరి నన్నే చూసి నవ్వుతోంది! నవ్విన ప్రతి నవ్వుకీ హృదయం దూది పింజవుతోంది! సుందరితో మాట్ల్లాడలని వెళ్లటం..మాట్లాడలేకపోవటం! మాటలురాక, మూగవాడయిపోవడం, గలగలా మాట్లాడే సుందరి అందాలని నెమరువేసుకుంటూ, తీయని ఊహల్లో తేలిపోవడం.. ప్రేమటే..ఇదేనేమో మరి! కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపిస్తోంది! తీయని కలలతో దొర్లిపోయిన కాలేజీ రోజులు! పెద్ద డాక్టరయిపోవాలనే అమ్మ,నాన్నల ఆశలను, నిజంచేసి..నిరూపించిన ఆత్మ సంతృప్తి! సుచిత్రాడాక్టర్ సమయందొరికిన ప్రతి క్షణం.. తనరూంకివచ్చి కబుర్లు చెబుతోంది! వింటున్నంతసేపూ ఏదోతెలియని తన్మయత్వం! వారాంతాలలో..బీచ్ షికార్లకి ఆహ్వానం! ఉప్పొంగే హృదయాలతో..సముద్రపు కెరటాలతో పోటీలు, అలసిన గుండెల్లో ఏదో గుబులు!ఎన్నో ఊసులు. సుచిత్ర సమక్షంలో .. పులకించిపోతున్న హృదయంలో గిలిగింతలు మరి ఈ పులకింతే ప్రేమా? ఏమో! "ఏయ్ మొద్దూ ఎమిటాలోచిస్తున్నావ్?" అంత శ్వేచ్చగా,అంత చనువుగా,అంత ప్రేమగా.. సుచిత్ర అలా పిలిచిన పిలుపులోనే దాగుంది ప్రేమని.. అప్పుడేతెలిసింది! నాకుతెలియదనేమో.. ఐ లవ్ యూ రా! గోముగా అనేసి భుజంపై వాలిపోయింది! అప్పుడే పూర్తిగా తెలిసింది ప్రేమంటే అదేనని !! ………..08.04.2014
by Phanindrarao Konakalla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k75djQ
Posted by Katta
by Phanindrarao Konakalla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k75djQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి