మీ శ్రేయోభిలాషి ------------------------ రావెల పురుషోత్తమ రావు ఎన్నో కలలను సృజించే ఎన్నికల ఋతువు వచ్చేసింది వసంతంతో పాటు వాకిట్లో అడుగు పెట్టింది ఎన్నాళ్ళనుంచో పూయడం మానిన పసుపు మందారాలు కొత్త కొత్త పరిమళాలతో రెండుకళ్ళ వెలుగుతో హంగుగా విచ్చేసింది చీడపట్టి బంక తెగులుతో కృశిస్తూన్న అవినీతి అసమర్ధపు జాజిమల్లె చెట్టుకూడా మరోసారి గుబాళించాలని గుప్పెట్లో వాగ్దానాల వసంతాన్ని చల్లుకుంటూ కొంగ్రొత్త నవ్వును పులుముకుని హడావిడి విచ్చేసింది. పదేళ్ళ పాటూ పదవీ యోగంలేక మల మలా మాడిన కమలం గూడా కర్నాటకంలో తగిలించుకున్న బురదనూ గోధ్రాలో పులుముకున్న రక్త చరిత్రనూ లో దుస్తుల్లో కనబడకుండా దాచేసుకుని, లోపాయకారీ ఒప్పందాలజోరుతొ ఇదిగిదిగో రామమందిరమంటూ పాత పల్లవినే కొత్త రాగంలో వినిపిస్తూ హుషారుగా దేశ భవిష్యత్తును మార్చేస్తానంటూ బీరాలు పలుకుతూ ఒచ్చేస్తున్నది. అసలు పాలనంటే తెలియకుండా అర్ధ శతదినోత్సవమన్నా కాకుoడానే ఆకాశానికి నిచ్చెనలను వేసుకుంటూ ఆం ఆద్మీలను ఆకశానికి కెక్కిస్తామంటూ కొత్త కొత్త లతో గుబాళిస్తమని మరీ మరీ అభ్యర్ధిస్తూ వెంటపడి వేధిస్తున్నది. పంచాంగ శ్రవణంలో యే పార్టీకి ఆ కందాయఫలాలను అనుకూలంగ అభివర్ణిస్తూ జనానికి అవహేళనకలిగిస్తూ అందరూ అసహ్యమిచుకునేలా తయారయి వస్తున్నవి నీ భవిష్యత్తూ నీ ఊరి భవిష్యత్తూ నీ చేతుల్లో దాగుందని హెచ్చరిస్తూ పవిత్రమైన నీవోటును అపవిత్రమవకుండా అసలు వోటేయడం మానకండని హెచ్చరిస్తూ చిత్తగించే మీ శ్రేయోభిలాషి 10-4-14
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbHw8I
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbHw8I
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి