చల్లా గౙల్-5/ dated 10-4-2014 కల్లలెరుగని పల్లె ఒడికి చేరుకోవాలనుంది తీపి తలపుల కలల సడికి జారుకోవాలనుంది పట్టు పావడతో చిట్టి చెల్లెలు పరుగున దగ్గరికొస్తే మురిపాలూరే చెలమలో మమతలు తోడుకోవాలనుంది నెమ్మదైన మా అమ్మ ఆశగా ఎదురు చూసే వేళ చెమ్మగిల్లిన కనుల వాకిట వాలిపోవాలనుంది బాల్యమిత్రుల ఆట పాటల తలపే మదిలోకొస్తే గుడి వెనకాల బిళ్ళంగోడు ఆడుకోవాలనుంది పచ్చని చేలను పచ్చిక గట్లను దాటుకు పోయే వేళ పల్లవించిన పల్లె పాటలు పాడుకొవాలనుంది డాలరు జాలరినైనా "చల్లా" ఆఖరి పిలుపే వస్తే పుట్టినచోటనే కట్టెగ మట్టిలో కలిసిపోవాలనుంది
by Rambabu Challa
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5f0pT
Posted by Katta
by Rambabu Challa
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5f0pT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి