జ్వలిత/డేటింగ్ 1)డేటిచ్చింది గుందె రాయి చెసుకొని రమ్మన్నది వీక్షించినది కాంక్షించకుండా ఆకాంక్షలను తమ ఆంక్షల్లో వుంచి లెగ్గు పెగ్గుతో నిగ్రహం సమకూర్చుకొని రమ్మన్నది డేటిచ్చింది సహౄదయంతో ఆస్వాదించేందుకు పిలిచింది "డాన్సర్" 2)డేటిచ్చింది సిద్దపడి రమ్మన్నది అంటుకొనేవాటికి అంటిచ్చేవాటికి పొందబోయే వాటికి పోగొట్టుకొనే వాటికి సర్వాంగాల సిద్దపడి రమ్మన్నది డేటిచ్చింది విలువల వలువలతొ రమ్మన్నది "శౄంగార సేవకురాలు" 3)డేటిచ్చింది తయారయి రమ్మన్నది భాషణం భూషణం సకల విధాల రొక్కం పారితోషికం పరవాచకం మేకప్ ప్యాకప్ సర్దుకొని తయారయి రమ్మన్నది నటనకు సిద్దపడి డేటిచ్చింది ఆహార్య ఐంగికాలతో సిద్దమయి రమ్మన్నది "యాక్టర్" 4)డేటిచ్చింది అన్నీ సర్దుకొని రమ్మన్నది పూసేవి రాసేవి కొసేవి అతికించేవి తోడుకు వేడుకకు బిడ్డకు తల్లికి బిల్లుకు విల్లుకు వడ్డించిన విస్తరిలా డేటిచ్చింది అన్నీ సర్దుకొని రమ్మన్నది "హస్పిటల్" 5)డేటిచ్చింది అన్నీ సమకూర్చుకొని రమ్మన్నది వోడినా గెలిచినా మిగిలేది శూన్యమే అని గెలిచి ఓడినా ఓడిగెలిచినా దుఖమే లభ్యమని వూరుకు వాడకు వున్నవారికి తరువాత వారికి అన్నీ చెప్పి డేటిచ్చింది సమకూర్చి రమ్మన్నది "కోర్టు" 6)డేటిచ్చింది పదిమందిని వెంటేసుకొని రమ్మన్నది చప్పట్లు కొట్టేందుకు దుప్పట్లు కప్పేందుకు ఓట్ల లెక్క తేల్చేందుకు జనబలం చూపేందుకు పదవుల పంచపాళి పంచుకొనేందుకు డేటిచ్చింది నాటో దెబ్బ తట్టుకొనేందుకు రమ్మన్నది"రాజకీయం" 7)డేటిచ్చింది పదుగుర్ని ఎనకేసుకొని రమ్మన్నది హక్కులకు పోరాడేందుకు బాధ్యతలకు నిలబడేందుకు విజయమో వీరస్వర్గమో తేల్చేందుకు త్యాగమో భోగమో తెలుసుకొనేందుకు డేటిచింది పదిమందిని కలుపుకొని రమ్మన్నది"ఉద్యమం" 8)డేటిచ్చింది పలువురితో పంచుకోను రమ్మన్నది రాసినది చదువుకొని వినసొంపుగా చదివేందుకు ప్రశంసల పూజల్లులను విమర్శల వడగళ్ళను సమంగా స్వేకరించేందుకు అక్షరమై నిలిచెందుకు డేటిచ్చింది రాసింది చదువుకొని రమ్మన్నది "సాహిత్యం" 9)డేటిచ్చింది అనుభవించరమ్మన్నది జయాపజయాలను సుఖదుఖాలను ఎత్తుపల్లాలను ద్రోహాల దాహాలను వెన్నుపోట్లను వెలుగు నీడలను సునాయసంగా వెన్నెల మడుగుల్లా ఆస్వాదించేందుకు డేటిచ్చింది ఆహ్వానించ రమ్మన్నది "జీవితం" 10)డేటిచ్చింది అన్నీ వదులుకొని రమ్మన్నది సొంతవి అరువుయి మనవి మనవనుకొన్నవి పొందినవి పోగొట్టుకొన్నవి అహాలు ఇహాలు వదులుకొని ఈకలు రాల్చుకున్న పక్షిలా రమ్మన్నది డేటిచ్చింది ఆకురాల్చిన చెట్టులా రమ్మన్నది "మరణం' ........................ జ్వలిత /10-04-2014, 6.10
by Jwalitha Denchanala Jwalitha
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gctp2X
Posted by Katta
by Jwalitha Denchanala Jwalitha
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gctp2X
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి