ఆమె | విష్వక్సేనుడు వినోద్ ఆమె రోజూ నాముందు నగ్నంగా నిలబడుతుంది. తన హృదయాన్ని పెనవేసుకున్న ప్రేమలతని నాకే బహిర్గతం చేస్తూ మనసు పొరలు విప్పి మరింత నగ్నంగా, అప్పుడే పుట్టిన కాంతి పుంజ్యం లా నా ముందు నిలబడి తధేకంగా చూస్తుంది. నగ్నత్వం తన దేహంలోలేదు, తర్కించే నా మనసులో ఉందంటుంది. కోర్కెలు కాలానికి అతీతం కాదంటూనే కోరి మరీ కళ్ళెం వేస్తానంటుంది. కైపెక్కించే కళ్ళతో నన్ను కవ్విస్తూ కాల్చేసి, మరుక్షణమే తన స్పర్శతో బ్రతికించుకుంటుంది. నా జీవిత దస్త్రంలో మిగిలిపోయిన కాగితాన్ని తీస్కొని మరువలేని జ్ఞాపకాలతో నింపేస్తుంది. నింపేసిన కాగితాన్నీ వెళ్ళిపోతూ వెంటపెట్టుకుని పోతుంది. మనసులో అందంగా ముద్రపడ్డ అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని అమాయకంగా అతికించి ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను. ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి ఊపిరిగా మారిపోతాను. 10-04-2014
by విష్వక్సేనుడు వినోద్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2g11S
Posted by Katta
by విష్వక్సేనుడు వినోద్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2g11S
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి