@ ఎడారి సముద్రాలు @ ఎడారులు ఒకప్పటి సముద్రాలేనేమో ఈనాటి నిరాశలు ఇసుక మేటలైతే ఒకప్పటి కలలన్ని అలలేమో.. నిశ్శబ్దం ఎక్కడ లేదు. ఉప్పొంగే సముద్రంలో అలల ఘోష . నీరసించిన ఎడారిది తుఫాను భాష . సముద్రాలై పొంగిన కనులన్ని నీరింకిన ఎడారిగా మారవా..? ఆ ఎడారి లోని ముళ్ళ పొదలకు ఏ పువ్వో పూయదా.. ఎడారికి తెలిసిందొక్కటే ఇసుక రవ్వలతో ఎగిరెగిరి పడడం. సముద్రం చేసేదోక్కటే ఎగిరిపడే అలల్ని తిరిగి ఒడి చేర్చుకోవడం. ఎడారులు తనలో తడిని ఆవిరి చేసి ఎండమావుల సముద్రాన్ని సృష్టిస్తే , సముద్రం తన గర్బంలో ఒక ఎడారిని నిక్షిప్తం చేసుకుంది. నిజానికి ఇది పరస్పర ఓదార్పు అవును..ఇరువురోక్కటే అనే రహస్యప్రకటన. _ కొత్త అనిల్ కుమార్. 10 / 4 / 2014
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sBBYJY
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sBBYJY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి