ప్రేమ జబ్బు....కమల్ లక్ష్మణ్ ప్రతి రోజూ నువ్వు,నీ జ్ఞాపకాలే ప్రతి పనిలో నీ ఆలోచనలే అనుక్షణం నీ నామస్మరణే ఆణువణువూ నీ పులకింతలే కళ్ళు తెరిచినా నువ్వే కళ్ళు మూసినా నువ్వే నువ్వే నా ఊపిరి,నా సర్వస్వం నువ్వు లేని నేను లేను ఏంటో..ఇది ప్రేమో..జబ్బో.. అంతుబట్టక చస్తున్నా.. అర్ధం కాక ఏడుస్తున్నా ప్రేమంటే మధుర స్వప్నమని తీయని భావాల తేనె అని గొప్పగా చెప్పారు ఎందరో కధలుగా చెప్పారు కొందరు మరిదేంటి..! నేనెందుకిలా అయ్యాను ఎవరికి ఏమని చెప్పను ఎవరిని ఏమని అడగను ఎలా ఉండేవాడిని....? అయ్యో .....నా ఖర్మ... ఏ హాస్పిటల్ కెళ్ళాలో ఎంత ఖర్చవుతుందో ఎప్పుడు నయమవుతుందో ఏమీ అర్ధం కావట్లేదు సరదాగా మీ కమల్ 10.04.2014
by Kamal Lakshman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qtQWho
Posted by Katta
by Kamal Lakshman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qtQWho
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి