యాదిమరుపు నన్ను వాకిట్లో నిలబెట్టి దూగుట్ల దీపాన్ని చేసి కాళ్ళనీళ్ళకు చెంబును చేసి పందిరి గుంజను చేసి దర్వాజకు శేరెడును చేసి వేసిపెట్టిన పెద్దపీటను చేసి దాచిపెట్టిన జున్నును చేసి నువ్వెందుకు రావు పిలుపులేదు పలుకులేదు అడుగుల చప్పుడులేదు నవ్వులసడిలేదు ఇంట్ల మొగురం లెక్క బట్టకట్టుకున్న కడియాలలెక్క దారం చుట్టుకున్న గాజులలెక్క దుక్కమాపుకుని నేను చీకట్ల ఎన్నీల మబ్బులెనక కన్నీళ్ళు రెప్పలెనుక నువ్వెందుకు రావు ... ... ... 12మెట్ల కిన్నెర మీద మొగులుపాటలు పాయె కండ్లు కాయలు కాసినయి నీ నిషానీలే మిగిలినయి ఎందుకు రంధి నీ మీదనే ఎందుకు మనసు నీ సోపతికి ఎక్కడ నన్న వుండు ఇష్టంగుండు ఎట్లనన్న బతుకు చల్లంగుండు నీ మీది యాది మల్లిందని గాదు మరిసిందే లేదు పానంగుంజినపుడు పాలకుతికి బిడ్డలెక్క నువ్వే వొస్తవు ... ... ... ... పానసరం పడుతున్ననని గోసపెట్టుకునేది కాదు లోకమంత అంతే పానంబెట్టుకున్నందుకె దేవులాడుకునే దిగులు తీగెలు పారుడు నిన్ను చూసుకుంటే పువ్వులపట్టెడ కట్టుడు
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6Z1Za
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6Z1Za
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి