ఓటమీ... గెలుపే !! ---------------------- @డా. కలువకుంట రామకృష్ణ కొన్ని సార్లు ఓటమి కూడా గెలుపే ! అయిన వాళ్ళను గెలిపించడం కోసం నువ్వు ఓడిపోవడం ఎంత మధురం ! గెలిచిన వాడు .. మళ్ళీ గెలవక తప్పని స్థితి ఓడిన వాడికో .. ఎంత స్వేచ్చో ఓడినా ,గెలిచినా .. ఆడటమే కదా . కావాల్సింది ! ఓడిన వాడిపై ఎన్ని హృదయాలు కారుణ్య వర్షం కురిపిస్తాయో విజేతవైతే అహంకారపు పొర మెల్లగా ఆక్రమిస్తూ అసూయా వీక్షణాల ,వ్యంగ్య బాణాలకు నెలవవుతుంది ఒక్కో ఓటమి ..... గాయపడ్డం గుండెకలవాటుగ మారుస్తుంది నిజానికి ఓటమికి ఎంత సహనం కావాలి ఓటమికి ఎంత గుండె ధైర్యం కావాలి నాలిముచ్చుల ,నక్కజిత్తుల దొంగ దెబ్బల గెలుపుల కన్నా ధైర్యంగా ,ఎదురెదురుగా నిలిచి ఓ డటమే .. మిన్న గెలుపొక పూర్ణ బిందువైతే .... ఓటమొక విరామ చిహ్నమే ఓడిన వాడికి గెలిచే అనంత శక్తి ఎక్కడో దాక్కుని ఉంది ఓటమికి తెలిసిన కన్నీటి విలువ ఏనాడూ గెలుపు .. అందుకోలేదు ! ఇంట గెలిచినోడు - రచ్చ గెలువక పోవచ్చు రచ్చ గెలిచినోడు- ఇంట గెలువక పోవచ్చు ఇంటా- రచ్చా గెలిచినోడు తనను తాను గెలువక పోవచ్చు ఆయుధమై హింసతో గెలిచే కన్నా అక్షరమై ,ఆత్మీయతతో ... అశ్రువర్షం ధారవోస్తూ ఓడటమే మిన్న ఒక్క వ్యక్తిత్వంలో ఓడకుంటే చాలు ! ఎన్ని ఓటముల్నైనా భరించవచ్చు ఒక ఓటమి అనేక విజయ శిఖరా లకు ..ఆలంబనై నిలుస్తుంది . @డా.కలువకుంట రామకృష్ణ
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p3MFpl
Posted by Katta
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p3MFpl
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి