సదా స్మరామీ... బుద్దం శరణం గచ్చామీ అన్న అంబేద్కర్ సదాస్మరామీ భారత రాజ్యాంగ రూపం దారి చూపు జ్ఞాన దీపం //బుద్దం// బడి మెట్లను ఎక్కొద్దనీ గుడి మెట్లను తాకొద్దనీ అంటు రోగ కులం కత్తి గుండెకు గాయం చేస్తే ఆగ్రహ ఆవేశాలను ఆలోచనగా మలచి అన్యాయపు డొక్క చీల్చె న్యాయ శాస్త్ర విద్య నేర్చి కడజాతుల కన్నీళ్ళను కెరటాలుగ తీర్చిదిద్ది కులం గోడ కూల్చి వేయ వుద్యమ జెండగ ఎగసె. //బుద్దం// అంబేద్కర్ అంటే ఒక దళిత జనుడు కాదు, పీడిత తాడిత నరాన ప్రవహించే జవజీవం ఆత్మ గౌరవాన్ని యెదలొ ఆకళింపు చేసుకొని మునుముందుకు సాగే ఓ మహోన్నత ఆశయం అంతరాల దొరతనాల అంతుజూసె ఆయుధం సామాజిక న్యాయానికి సమరశీల సిద్దాంతం. //బుద్దం// (అంబేద్కర్ మహాశయునికి అక్షర నివాళి) 14.4.14.
by Kanneganti Venkatiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRiX5j
Posted by Katta
by Kanneganti Venkatiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRiX5j
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి