పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Ravela Purushothama Rao కవిత

దిదృక్ష రావెలపురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ కవిత్వమంటే కవితలూ కవులేకాదు ఒకానొక రకంగా ఒక సమాజపు వాస్తవిక జీవిత చిత్రం. మున్ముందుకు జనావళిని న్యాయమార్గంలో నడిపించేలా సారధ్యం వహించగల సమ్మోహన గీతం. పదికాలపాటు జాతిని ప్రబోధింపజేయగల జీవనదీ ప్రవాహపు వారసత్వం కవిత్వం గుండె గొంతుకలోంచి కదలాడే కవోష్ణ రుధిర ధారామృతం కవిత్వం. కేవలం అక్షర సేద్యమే కాదు నిరక్షర కుక్షులను సైతం నిత్యనూతనంగా స్పందించేలా చేసే ఒక మందస్మితమౌ చివురుజొంపాల తలలనాడింపజేయగల పైరగాలికాదా కవిత్వం. హాయినివ్వడమే కవిత్వ హేతువకాదు ఆనందోపదేశాలు రెండూ జమిళిగా పరుగెత్తించగల జవనాశ్వం సుమా! కవిత్వం. పేదవాడి పూరిగుడిసెలో సైతం నవ్వుల దీపం వెలిగించే సత్తా గలిగిన చిరుజ్యోతి కవిత్వం. బీదవారి సౌఖ్యాన్ని భవిష్యత్తును జలగలా పీల్చేసే ధనస్యామ్యానికి ఎదురునిలబడే సమరసిoహం. అశ్లీల భావస్ఫోరకమైన చూపులు విసిరే మృగాలకు తన జూలు విదిల్చి బోనులోకి నెట్టించగల రక్షణ సైన్యం కవిత్వం. కవిత్వపు ప్రయోజనాన్ని అవహేళన గావించకు!! అగ్నిని జల్లినా మంచుజడులను పంచినా ఆనందం ఆరోగ్యకరమైన సమాజం దాని హేతువవి విశ్వసించి ముందుకు సాగు. మరోజన్మలోనయినా కవిగా పుట్టి ఈజాతికి సజావుగా సకాలంలో రుణం తీర్చుకోవాలని కాక్షించు. ఆ ఆమృత ఘడియలకోసం అనునిత్యం ఆకాక్షించు *******************************************************

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kTNTSc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి