కత్తిమండ ప్రతాప్|| క్రతువు || =================== రుతువులెన్నిమారిన క్రతువులెన్ని చేసిన కాలగర్భంలో కలిసి పోతున్న కన్నీటి గాధ లెన్నున్నా నా చేతలన్ని ట్రిగ్గర్ చిరు సవ్వడి కోసమే! తరిమే కాలం తరలిపోతున్నా జ్ఞాపకాల నీడలు తరుముకొస్తున్నా వెంటాడే గురుతులెన్నున్నా నా పాదాల చప్పుడు నీ గుండెల మీద లయ కోసమే! అలజడి రేపిన గాయాలెన్నున్నా ఆరని ఆలోచనల కుంపటి లెన్నున్నా మారని కుల పిలుపులెన్నున్నా మలుపుల్లో మాటేసేది నీ నాలుకపై కుట్లు కోసమే! రాతలెన్ని రాసిన గీత లెన్ని గీసిన గిరిగీసిన నీ సామ్రాజ్య దోపిడీకి గుండు గీసేందు కోసమే నీ తల రాత మార్చేందుకే ! ఇదే నా క్రతువు నిత్య రణ ఋతువు =========== 14-04-2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOCXoX
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOCXoX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి