తిలక్/కాసిని కొన్ని సార్లు ఓడిపోవలనిపిస్తుంది గెలుపు కంటే ఓటమి రుచి మరింత తీయగా తలపిస్తుంది నీరు పల్లనికి ప్రహిస్తే ఓటమి కౌగిట్లో గెలిచినట్టే గతాల మీద జ్ఞాపకాల పొరలు కొత్త పొరల్లా పరిచయమైనప్పుడు గతానికి ప్రస్తుతానికి మళ్ళా పొరపొచ్చలు నీ మనస్సు పెదాలు బిగ్గరగా పెగలనప్పుడు పదాల్లో నిన్ను వెతుక్కుంటూ కూర్చుంటావు కళ్ళలో కొన్ని లాంతర్లు వెలుగుతూ ఆరిపోతూ గెలుస్తూ ఓడుతూ అటక మీద మసిగుర్తులు పొద్దూకులా కొత్తగా ఓటములు పాతబడ్డ గెలుపులు తిలక్ బొమ్మరాజు 14.04.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsBwoX
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gsBwoX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి