బాల సుధాకర మౌళి ||Dictator|| Posted on: Mon 14 Apr 00:06:29.629135 2014 దేన్నీ కాదనం వస్తువులను పొందిగ్గా మన అలమరాల్లో అమర్చుకుంటాం ముద్దుగా ఉందని పింగాణి చెవులపిల్లిని టేబుల్ మీద పెట్టుకుంటాం రబ్బరు కుక్కపిల్లని టీపారు మీద కూర్చోనిస్తాం గోడల మీద ఫెలికాన్ సీతాకోకలనూ టీవీల మీద ప్లాస్టిక్ పూలనూ ఎగరేస్తాం ముచ్చటపడతాం హొయలు పోతాం మూతి మూడు వంకర్లు చేసి తిప్పుతాం పసిలోకాలన్నింటినీ మార్కెట్ నుంచే దిగుమతి చేసుకుంటాం పసిహృదయాలనూ ఆటబొమ్మల్లోనే వెతుక్కుంటాం Break out మనుషులను Dictate చేస్తున్న కాలం మనుషులను వస్తువులుగా వస్తువులను మనుషులుగా ణతీaఎa్‌ఱష చేస్తున్న కాలం సింహం జూలుకాలం నాగుపాము కాలం గదుల్నిండా, అలమరాల్నిండా పేరుకుపోయి దుమ్ముపట్టిన జెర్రిగొడ్డుకాలం మనుషులపై వస్తువులు దండయాత్ర చేసే తేలుకొండెకాలం వస్తువులే సర్వస్వం మనుషులు శూన్యం - మనుషులే శూన్యం నియంతలు ఎక్కడో లేరు మన చుట్టూ మన ఆలోచనల్లోనూ సకల విస్ఫోటన సామగ్రితో సర్వబంధనాల్తో వ్యాపిస్తున్న పుట్ట పగిలిన కాలమే కాలమొక పెద్ద నియంత కాలం చేతిలో తోలుబొమ్మ ఆలోచనొక నియంత నియంతలు కూలాలి నియంతల పీఠాలూ కూలాలి నియంతల్ని తయారుచేస్తున్న పెద్దపులి కుట్రలూ కూలాలి Press the trigger 'భ్రమల్నీ, భ్రమల గోడల్నీ, కుళ్లిన మస్తిస్కాలనూ Shut down! ---------------------------- - బాలసుధాకర్ మౌళి 9676493680 ------------------------------ http://ift.tt/1lYQ0kO
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lYQ0kO
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lYQ0kO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి