పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

Krishna Mani కవిత

తెలుగు కాంతి ************* తెలుగు వెలుగుల శుభోదయం ఆది కవి నన్నయ పద విన్యాసంలో సిరిమువ్వల గల గలలు రాయలవారి అష్టదిగ్గజ పద్మాల రెక్కల సౌరభాలు ఘనకీర్తికి తెలుగునాడ వెలుగు జాడలు ! వేమన సుద్దులు పోతన్న పలుకులు అన్నమయ్య కిలకిలలు గోపన్న జిలుగులు గురజాడ వాగుతో కలిసిన మరెన్నో పాయలు తెలుగున మెరిసిన కొత్త కాంతులు ! పాలకుల కుటిల నీతిలో తెలుగుకు చెదలు ఆంగ్లమున అచ్చుతో లోకంతో పరుగులు మతిచెదిరి మనలేక దాటలేక మునకలు అసలు మరచి కొసరు తోడ మిడి జ్ఞానపు గొప్పలు ! మాతృభాషే అస్తిత్వం అదే కదా ఆధారం అమ్మపలుకుల పాండిత్యం అదే కదా తోలి పాఠం ! కృష్ణ మణి I 14-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDB9Nj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి