*ఓటేయడం* ఓటేయడమంటే సీటెక్కి మాట మరచిన చిలుక పలుకుల నాయకులపై తెలివిగా వేటేయడం స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పోగేసి దేశం పొట్ట మాడ్చినోళ్ళను మెరిగెల్లా ఏరేయడం ఓటేయడమంటే నీ తలరాతను మార్చుకోవడానికి నువ్వే బంగారి అక్షరాలతో చేవ్రాలు చేయడం ఐదేళ్ళ ఒక పసిపాపలాంటి ఓటుయంత్రం బుగ్గను సుతారంగా నొక్కి ప్రజాస్వామ్యాన్ని మల్లెపువ్వులా పరిమళింప జేయడం చేసిన తన ప్రమాణాన్ని మంత్రంగా తలదాల్చి రేపటి నీ కలల ఉదయానికి భరోసానిచ్చే ఒక సూర్యుణ్ణి ఎన్నుకోవడం 03.04.2014
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzh5Lb
Posted by Katta
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzh5Lb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి