పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఏప్రిల్ 2014, సోమవారం

బ్రెయిన్ డెడ్ కవిత

Nisheedhi | Illogical| తర్కం కి అందని మనసుపొరలని గర్హిస్తూ నిజాలను గ్రహిస్తూ ఒక్కొ పొర వదిలేస్తు నగ్నంగా నమ్మకాలకి దూరంగా ఆస్వాదించాలంటే ఆలోచనల దిగంబరత్వమే అశరీరంగా అనంతంగా ఎల్లలు లేని అనుభుతిగా కళ్ళు తెరిచి చూడలేని మూసిన గుప్పిట్లో రహస్యాలన్ని మనసు విప్పుతూ ఒకటే యాతన ప్రసవభారం తీరి అర చేతుల్లో పాపయిలా నవ్వేవరకు . అలోచనలన్నీ బాస్టర్డ్ చైల్డ్సే విత్తుల గుర్తులు తెలియకుండా కన్నందుకు అమ్మలకి తప్పని అభిశపం లా మనసుని వదలకుండా అడ్డ దిడ్డంగా మహావేగం గా పెరిగిపోతూ జనోద్దారణ కోసమో స్వీయ దహనం కి ఆత్రమో . ఎందుకో మరి ? నిశీ!! 14-04-14 .

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNLAKU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి