కూరాకుల వెంకట చలపతి బాబు || ప్రశ్నలు || షష్ఠి పూర్తి దాటి శతకానికై పరుగులు పెడుతున్న స్వాతంత్రమా నీవెక్కడ? ఇహపరాలను మరిపించి మనిషికి మనసును దగ్గరచేసే స్వేచ్ఛా నీ ఉనికెక్కడ? మూడువేల ఏళ్ళచరిత్ర నాదంటూ భీరాలు పలుకుతున్న పదహారణాల తెలుగుదనమా నీ ఊరెక్కడ? ఎంత తాగినా రక్తదాహమే తీరని హింసా నువ్వు కనిపించని చోటెక్కడ? ఆకాశంలో సగానివంటూ నిన్ను పాతాళానికి తొక్కారే మగువా నీకు మనుగడెక్కడ? రొమ్ము విరుచుకుని జబ్బలు చరుచుకునే మగతనమా నువ్వు పుట్టిందెక్కడ? #14-04-2014
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyaV0i
Posted by Katta
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyaV0i
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి