పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Krishna Mani కవిత

బర్రె తోడు ********** కాలువవతల నేను నా బర్లు వానలకు మొలిశింది లేత గడ్డి తలకాయల్లేపని మూగమనసులు చిగురు కొయ్య చింత చెట్టు కొమ్మల్లో నేను ! కూరకు శల్లల మూటగట్టి కడుపు నింపితి తీపి పులుపుల సంగమం ఒగరు నిండిన నోరు అంతలనే యదకొచ్చిన బర్రె అరుపు పరుగుబెట్టె దున్నపోతు కోసం ! అర్ధం కాని పెండకడోన్ని దమ్మువట్టి ఎంటవడితి పత్త దెల్వక పరిషానైతి అయ్య యాదికొచ్చి కండ్లు కారవట్టే దెంకబోయిన బర్రె తోడ ఇంటికి రాకపోతే ఈప్బలుగుతదని ! ఏమిజేతు ఎట్లజేతూ అని గుండుమీద ఎడువవాడితి బాలి తాత నవ్వవట్టే నన్ను జూసి ఏమిరా పిల్లగా నీ బర్రె జోరుమీదుందని ఎక్కిల్లనాపి ఎడుందని అడిగితె జెప్పె పక్కూరి మందల తోడుగడుతుందని ! కృష్ణ మణి I 25-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwJ5KN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి