Gazal |John hyde Kanumuri| అలా అలా దాగిన జలతారు పరదాలచాటు గుర్తుందిలే గల గలా సాగిన నవ్వులతీరు మరల మరల గుర్తుందిలే నీకై నిరీక్షించి నిరీక్షించిన ఆ సాయంకాలం కనులెదుటే మెరుపులా వచ్చిపోయిన జాడ గుర్తుందిలే! పరాకుగా విదిల్చిన మాటకు నొచ్చుకున్నావో లేదో ప్రక్కకు తిరిగి గిర్రున రాల్చిన ముత్యపుబొట్టు గుర్తుందిలే ! చిగురుతొడిగిన మొగ్గ సిగ్గులొలికిన నా బుగ్గ అందానికే అందమని చదివిన ఆనాటి కవిత గుర్తుందిలే! గుబులుపెట్టిన ఆ నీలిమేఘం భళ్ళున రాలితే చెట్టునీడలో ఒదిగి ఒదిగి తడిన ఆ వాన గుర్తుందిలే! బాటసారినై అలసి నీ గుమ్మాన దాహమడిగితే చిరునవ్వుల కూజాను ఒంపితడిపిన తీరు గుర్తుందిలే ! **********25.4.2014
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1il7mtf
Posted by Katta
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1il7mtf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి