పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

యాకయ్య వైట్ల కవిత

ll నా కాదిలి కొలువు ll పలికే పర్వం ప్రాయపు గుస గుస ఒలికే సొగసు ఒంట్లో నిశ మిశ కనులకి కెంపు నా కాదిలి ముంపు మదికె మొహం మౌనం... మౌనం ... మగతలో మొలకై మదిలో మెలికై హృదిలో చినుకై తడిపెను కునుకై సరసన చిలుకై తేనెలూరు పలుకై కుసుమపు కులుకై కరిగే నాలో... నాలో... నింగి నేల... నువ్వు నేను నిండు మబ్బుల 'నీలిమి' శశి గాలి తొలిమి కిరణాల కలిమి చినుకుల చెలిమి ఉరుముల బలిమి మెరుపుల కొలిమి బిగికౌగిళ్లో పుష్యమి పులిమి ఆవిరికాగ.. ఈ 'ధర' లోఛలో.. ఛలో.. రాగం.. రాతిరి కురిసే వైరం తానం.. తమకపు లయలో గమకం పల్లవి.. ఇరు యదలోఎగిసే ప్రణవం చరణం.. నమక చమకపు లాస్యం సాకీ.. సారం.. సంసారం "మా" స రి గ మ ప ధ ని సం'గీతం' నవరసభరిత శృగారం. ఇది సాగరమథనం మిథునం.. మిథునం.. యాకయ్య. వైట్ల !!! 23/04/2014

by యాకయ్య వైట్ల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RRI3US

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి