పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Krishna Veni కవిత

కృష్ణవేణి || ఆమెందుకో ఓడిపోతుంది .............................................. ఆమెందుకో ఓడిపోతుంది, మళ్ళీ మళ్ళీ తన అసమర్థతని, అందరికీ తెలిసేలా గొంతెత్తి నినదిస్తూ! అలోచనల్ని కట్టిపడేసి, కన్నీటిలో తడిసిపోయే స్వేచ్చకి, తలారబెట్టేదెప్పుడు! గడపదాటని ప్రశ్నల్ని, నడిబజార్లో నిలిపేదెప్పుడు! అప్పుడిప్పుడంటూ... సమాధానాన్ని దాటవేసే, మది కునికి పాట్లు వింటూ ఉంటే, యుగ యుగాలుగా ఒక్కో తరాన్ని, అవలీలలా గట్టు దాటిచ్చేస్తూనే ఉంది! ఏం చేద్దాం ఆమెకేకాదు ఆమె దైర్యానికీ, గాజులు తొడిగిన సమాజం కదా ఇది! ప్రతి ఇంటా ఓ ప్రశ్నే, ఏడుస్తూనో... ఏడ్పిస్తూనో..., ఆవిరౌతూనో... ఆహుతౌతూనో..., ఓట్టిపోతూనో... ఓడిపోతూనో..., అలసిపోతూనో... అస్తమిస్తూనో..., అంతటా ప్రశ్నలే, తప్పదిక... తప్పక సాధించాలి.. తప్పుడు ఆలోచనల్లోంచి, తప్పించుకోవాలని చూసే సమాధానాన్ని! 25.4.14

by Krishna Veni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fwS3Id

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి