కుళ్ళిన పళ్ళతోట-1 ______________ఆర్క్యూబ్ వేలితో రుద్దితి..వేలి గోటితో తట్టితి పంటితో పన్ను తాకిస్తి ఏదో ఒకటి కొరికితి బుగ్గలు పూరిస్తి..పళ్ళికిలిస్తి నాలికతో అద్దితి నారాయణా అంటి అబ్బో..పంటినొప్పి అది చిన్నది కాదు ముళ్ళ పందిని పుక్కిట బట్టినట్టే అంటే తిన్నా తాగినా దంగని గుంజుడు ధ్యానం జేసినా సలుపుడూ సలుపుడే మంటల మంటని భాం పూస్తిమా అప్పుడది పామైద్ది లేని పుండు మోపైద్ది జెట్టక్క వేళ్ళమీదే బొమ్మ నొప్పి పగటి మీదే పోసినంతసేపే - అ గీ ర్త గోకినంతసేపే సొరియాసిస్ కని పంటినొప్పో.. అది-దేహ దేశమ్మీద పరాయి పాలన చంపది గాని చంపుకతింటది పగోనికి సుతం రావద్దు * * * * *
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHHC9I
Posted by Katta
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHHC9I
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి