భాస్కర్ కొండ్రెడ్డి కవిత-పురాసత్యం
"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి"అని ప్రాచీనుల వేదాంతం..ఎన్నిరకాలుగా,ఎన్ని మార్గాల్లో చెప్పినా సత్యం ఒకటి ఉంటుంది..సినారే"మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"-అన్నారు.గతమెప్పటిక ి కొంత మిగిలేవుంటుంది.నిజానికి సత్యాన్ని గురించి ప్రాచీనుల్లో చాలాచర్చే వుంది.
భాస్కర్ కొండా రెడ్ది కవిత్వాన్ని ఆస్వాదించే అంశాన్ని పురా సత్యం గాచెబుతున్నారు.(నిజానికి ఇది ఏ అంశానికైనా సరిపోతుంది.ఇందులో ఉపయోగించిన అస్పష్టతలాంటి పదాలు కవిత్వమనే స్పష్టం చేస్తున్నాయి)పరిణత దశ అనేది దేనిలో నైనా కనిపిస్తుంది.కొన్ని సార్లు మనం గమనిస్తాం కొన్నిసార్లు గమనించం.
"ఒక్కడుంటాడు/వేసిన ప్రతి అడుగును/
మెత్తని చేతుల్తో పువ్వుల్లో ముంచి/
పైకెత్తి చూపించగలిగే నేర్పుగలిగిన వాడు/
అస్పష్టతలలోని అద్భుతాలను/అర్థవంతంగా విప్పి చెప్పగలిగిన వాడు"-
సాహిత్యంలో ఇలాంటి మహానుభావులు కొంతమంది ఎదురౌతారు..కాలంలో ఏది కవిత్వం అనేదానికి రకరకాలుగా ఆయాకాలాలు నిర్వచిస్తాయి.ఇవి మరో కాలానికి-లేదా ఆకాలంలోనే మరో దృష్టిగల వాళ్లకి నచ్చవు.ఇప్పుడు "ఆదర్శ మూర్తులు"గా మనం కీర్తిస్తున్నవారు ఒకప్పుడు ఇలాంటివి ఎదుర్కున్నవారే.నిజానికి ఏప్రపంచమైనా అనేక పాయలుగా ప్రవహిస్తుంటుంది.
కవికి ఎప్పుడూ ముందుచూపుండాలి(సత్యానికి దూరంగాపోకుండానే)కొత్తదనాన్ని అన్వేషించాలి.మొల్లనించి శ్రీశ్రీ,పటాభి దాక ఇలానే జరిగింది.
"కుబుసాన్ని/బండలకు రుద్దుకుంటూ వదిలించుకోకపోతే/పట్తని పాత చర్మం తాలూకు బాధ/నిన్నెప్పటికీ నిలువనీయలేదు/కొత్తపుంతని ఎలాగు ఆపనూలేదు"
కొత్తదనం ఏదైనా దాన్ని అర్థంచేసుకునేదాక అలవాటుపడి అభినందించం."కొత్తొక వింత పాతొక రోత"కదా.సత్యావిష్కరణకు వాదం చాలదు వాహిక కూడా కావాలి.అలాంటి వాక్యాలున్నాయి."పాత చర్మం లాంటి""కుబుసం" మేఘాల్లా రూపాలు మార్చు కుంటు"ఇలాంటివి అందుకు నిదర్శనం.
సంభాషణలా కనిపించే ఒక గంభీర స్వరం ఇందులో ఉంది.గతంలోనూ భాస్కర్ కొండా రెడ్డి గారి కవిత్వం తో ఉన్న కొద్దిపాటి పరిచయంతో కొన్ని అంశాలని అర్థం చేసుకోవచ్చు.శైలీ సంబంధంగా చూసినా కవిత ప్రాణాల ఉనికి తెలిసిన కవిత్వం..కావలసిన ఉపమానాలని.ప్రతీకలని.వాక్య ,కవితా నిర్మాణాలని పట్టుకున్న కవిత్వం.
15.08.2013
భాస్కర్ కొండ్రెడ్డి కవిత-పురాసత్యం
"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి"అని ప్రాచీనుల వేదాంతం..ఎన్నిరకాలుగా,ఎన్ని మార్గాల్లో చెప్పినా సత్యం ఒకటి ఉంటుంది..సినారే"మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"-అన్నారు.గతమెప్పటిక
భాస్కర్ కొండా రెడ్ది కవిత్వాన్ని ఆస్వాదించే అంశాన్ని పురా సత్యం గాచెబుతున్నారు.(నిజానికి ఇది ఏ అంశానికైనా సరిపోతుంది.ఇందులో ఉపయోగించిన అస్పష్టతలాంటి పదాలు కవిత్వమనే స్పష్టం చేస్తున్నాయి)పరిణత దశ అనేది దేనిలో నైనా కనిపిస్తుంది.కొన్ని సార్లు మనం గమనిస్తాం కొన్నిసార్లు గమనించం.
"ఒక్కడుంటాడు/వేసిన ప్రతి అడుగును/
మెత్తని చేతుల్తో పువ్వుల్లో ముంచి/
పైకెత్తి చూపించగలిగే నేర్పుగలిగిన వాడు/
అస్పష్టతలలోని అద్భుతాలను/అర్థవంతంగా విప్పి చెప్పగలిగిన వాడు"-
సాహిత్యంలో ఇలాంటి మహానుభావులు కొంతమంది ఎదురౌతారు..కాలంలో ఏది కవిత్వం అనేదానికి రకరకాలుగా ఆయాకాలాలు నిర్వచిస్తాయి.ఇవి మరో కాలానికి-లేదా ఆకాలంలోనే మరో దృష్టిగల వాళ్లకి నచ్చవు.ఇప్పుడు "ఆదర్శ మూర్తులు"గా మనం కీర్తిస్తున్నవారు ఒకప్పుడు ఇలాంటివి ఎదుర్కున్నవారే.నిజానికి ఏప్రపంచమైనా అనేక పాయలుగా ప్రవహిస్తుంటుంది.
కవికి ఎప్పుడూ ముందుచూపుండాలి(సత్యానికి దూరంగాపోకుండానే)కొత్తదనాన్ని అన్వేషించాలి.మొల్లనించి శ్రీశ్రీ,పటాభి దాక ఇలానే జరిగింది.
"కుబుసాన్ని/బండలకు రుద్దుకుంటూ వదిలించుకోకపోతే/పట్తని పాత చర్మం తాలూకు బాధ/నిన్నెప్పటికీ నిలువనీయలేదు/కొత్తపుంతని ఎలాగు ఆపనూలేదు"
కొత్తదనం ఏదైనా దాన్ని అర్థంచేసుకునేదాక అలవాటుపడి అభినందించం."కొత్తొక వింత పాతొక రోత"కదా.సత్యావిష్కరణకు వాదం చాలదు వాహిక కూడా కావాలి.అలాంటి వాక్యాలున్నాయి."పాత చర్మం లాంటి""కుబుసం" మేఘాల్లా రూపాలు మార్చు కుంటు"ఇలాంటివి అందుకు నిదర్శనం.
సంభాషణలా కనిపించే ఒక గంభీర స్వరం ఇందులో ఉంది.గతంలోనూ భాస్కర్ కొండా రెడ్డి గారి కవిత్వం తో ఉన్న కొద్దిపాటి పరిచయంతో కొన్ని అంశాలని అర్థం చేసుకోవచ్చు.శైలీ సంబంధంగా చూసినా కవిత ప్రాణాల ఉనికి తెలిసిన కవిత్వం..కావలసిన ఉపమానాలని.ప్రతీకలని.వాక్య ,కవితా నిర్మాణాలని పట్టుకున్న కవిత్వం.
15.08.2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి