పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ


ఫణీంద్ర కవిత: అమ్మ పలుకులు "


"మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అనిభారతీయవేదాంతులు చెప్పినా మనస్సుకు సంబంధించిన మనవారి ఆలోచనలు,విష్లేషణలు ఆధ్యాత్మికత,వేదాంతం అటునుంచి తత్వం వైపు వెళ్ళాయని అభిప్రాయాలున్నాయి.ఈ మనస్తత్వ చర్చను"ధ్యానం" పేరుతొచేసిన హేతు బద్ధ మైన చర్చ బౌద్ధంలో ప్రాకృత,సంస్కృతసాహిత్యం లో కనిపిస్తుంది.పాశ్చాత్య దేశాలలో ఫ్రాయిడ్ అతని అనుయాయులు యాడ్లర్,యూంగ్,హాల్ మొదలైనవారు కారణాలను అన్వేషించి శాస్త్రీయతను ఆపాదించారు.యూంగ్ సాహిత్యానికి మనస్తత్వము,సాహితీ తత్వము రెండూ ఉంటాయని అభిప్రాయ పడ్డాడు.మనోవైఙ్ఞానిక శాస్త్రాన్ని సాహిత్యప్రమాణంగా ఉపయోగించడం ఐ.ఏ.రిచర్డ్స్ (i.a.rechards)తో మొదలైంది.దీనికి సంబంధించి ఓ విమర్శాపద్దతి మనో విశ్లేషణాత్మకవిమర్శ(psycho-analytical criticism) ఒకటి వేళ్లూనుకొంది.అచేతన,లైంగికత,అహం,సహజాతం ందలైన అంశాలనుండి మనస్తత్వ సంబంధంగా సాగే విమర్శ.
ఈ క్రమంలో అచేతన రెండు రకాలుగాఉంది.1.వైయక్తిక అచేతన(personal unconciousness)వ్యక్తిగత ఉద్వేగలు,అనుభవాలు,కారణాలతో ఏర్పడేది.2.సమిష్టి అచేతన(collective un conciousness)సామూహిక ఉద్వేగాలు,అనుభవాలతో ఏర్పడేది.ఫణీంద్రగారి కవితలో కనిపించేది ఈరెండవ అచేతనే. ఈశతాబ్ది ఉత్తరార్థంలో వచ్చిన అస్తిత్వోద్యమాల్లో స్తీవాదన్ ఒకటి.ఈ మర్గంలోనూ స్త్రీవాద విమర్శ(feminist criticism)ఒకటి వచ్చింది.తెలుగులో శిలాలోలిత-'కవయిత్రుల కవిత్వంలో స్తీలమనో భావాలు 'రాసారు.
ఫణీంద్రరావుగారు "అమ్మ పలుకులు"లో ఒక స్త్రీ గొంతుక ఉంది.చివరి వాక్యం వల్ల దీనికి స్తీవాద తాత్వికత ఒకటి చేరింది.
"బుగ్గచుక్కతో ఎంత అందంగా ఉన్నావురా కన్నా../ఇక ఈ కుందనపు బొమ్మ చేతిలో నిన్ను పెడుతున్నా/మరి ఆమెలో ఈ అమ్మని చూసుకోగలవా కన్నా"
ఈ వాక్యం వల్ల-అమ్మనికొల్పొకపొవటం,ఆమెలో అమ్మనుచూడటం అనే రెండు అర్థాలు సార్థకాలు.ఈ కవితలో నిర్మాణపరంగా కూడా గమనించాల్సిన అంశం ఒకటుంది.అది అంశాత్మక పరిశీలన(case study)ఒక అంశాన్ని ,వ్యక్తిని వివిధ దశలలో పరిశీలించి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకొని రాయటం. ఈకవితలో ఫణీంద్రగారు శైశవాన్ని ఒకసారి,బాల్యాన్ని మూడు దశల్లోనూ(కాళ్లతో తన్నే చిరుదశ,కథలు చెప్పమనే దశ,బడికెళ్లేటప్పుడు మరాం చేసే దశ)యవ్వనం దశ అక్కడనుందే పైన చెప్పిన వాక్యం నుండి కవిత ఉపదేశాత్మకమైన స్పూర్తినిచ్చింది.వ్యక్తి వయసులోని నిర్దిష్టత జెండర్ వ్యత్యాసాన్ని ఎలాచూపుతుందో ఈ కవిత చూపుతుంది.ఇందులోనూ ఒక సయోగాత్మక వ్యాఖ్యానం (positive neretion)ఒకటి ఉంది
"మధుర సంగీతంలా వినిపించడం"
"అలసతంతా మటుమాయమవ్వటం"
ఇలాంతివి సుమారు ఆరూన్శాలు కనిపిస్తాయి.ఇవన్ని మనోవైఙ్ఞానిక భూమీ కలిగినవి.హృదయం"హిమాలయమంత" అంటంలో ఓ సిద్ధ ప్రతీక(proved symbol)కనిపిస్తుంది. జయహో ఫణీంద్ర రావుగారు
                                                                                             

                                                                                                         _____ఎం.నారాయణ శర్మ
                                                                                                                         26.07.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి