ఏదైనా జరిగినప్పుడు దీనికి నేనే కారణం అనిభావించడం.ఓ సందర్భాన్ని పరోక్షంగా అలా చిత్రించడం.ఓ వ్యక్తిత్వాన్ని అలా పరిశీలించడం కనిపిస్తుంది.నిజానికి మనోవైఙ్ఞానికవేత్తలు మనలోనిరెండురకాల దర్శనాలు దీనికి కారణమని అన్నారు.ఒక సందర్భాన్ని Possitive,Negitive మార్గాలనించి చూడ్డం వల్ల ఇలాంటివి జరుగుతాయని అన్నారు.సాధరణంగా ఇవి సత్యాన్ని వెదికేప్పుడో,ప్రస్తావిస్తున్న వ్యక్తి,ప్రాంతం మొదలైన వాటిమీద ప్రేమాభిమానాల్ని పెంచుకున్నప్పుడో కలుగుతాయి.
విమర్శలో నియతివాదం(Determinism)ఇది సంఘటనలనుండి కారణాలను అన్వేషిస్తుంది.ఒక్కోరకమైన భావజాలాలు కలిగిన వారు దీన్ని ఆమార్గంలో అర్థం చేసుకుంటారు.దృగ్గోచర అంశాధ్యయనం(Phenomenology)క
జీవితంలో కలిగే సంబంధాలలో ఒక తప్పునుగురించిన వివరణ ఒకటి చాంద్ కవితలో కనిపిస్తుంది.ఇందులో స్త్రీ పాత్రని ఉన్నతీకరించారు.ప్రాచీన సాహిత్యంలో ఇలాంటివి కనిపిస్తాయి.విశాద సారంగ ధర నాటకంలో రాజుపాత్ర ఇలాప్రవర్తిస్తుంది.
ఆమేజీవితాన్ని సమర్పించడం,అతను పొరపాటు చేసాడు.తరువాతి పర్యవసానం,ఆమెను ఉన్నతీకరించడం ఇవి ఇందులోని అంశాలు.
"ఆమె
ఒక తెల్లని కాగితాన్ని చేతికిచ్చి" ఇందులో కాగితం జీవితానికి ప్రతీక తరువాతి వాక్యాల్లో రాయడం జీవితాన్ని తీర్చిదిద్దడం అనే క్రమంలో వాడారు.రెండో వాక్యంలో ఆమె హెచ్చరిక కూడా ఉంటుంది.
"" -కానీ ఒక్కటి గుర్తుంచుకో
నువ్వేమి రాసినా చేరుపలేవు
ఎందుకంటే నీ ప్రతీ రాత
గుండె గదిలో పదిలమైపోతుంది
నీ జ్ఞాపకంగా ...
అని చేతిలో ఒదిగిపోయింది
నిండు జీవితాన్ని అందిస్తూ"
పొరపాటు జీవితాన్ని శాసించిన అంశాన్ని చిత్రించారిందులో..
"గుండె నిండిన కన్నీళ్ళు ఒలికిస్తూ
రాసాను 'నన్ను క్షమించు ' అని"
"కానీ... ఆమె
ఒక కల్మషంలేని నవ్వు
సజీవంగా నాకిచ్చివెళ్ళిపోయింది"
ఈరెండువాక్యాలు ఇందులో జీవత్వాన్ని సంచలింపజేసే వాక్యాలు.నిర్మాణానికి సంబంధించి వాక్యాలపై ఇంక డ్ర్ష్టి పెట్తాల్సింది...మొదటినించి
చాలామందికూడా గమనించ వలసింది వాక్యాల్లోని పదాల మధ్యసంబంధాన్ని(Link).యూనిట
_____ఎం.నారాయణ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి