శ్రీ మోదుగు కవిత-మరికొన్ని నూకలు
కవులచుట్టూ కొన్నిస్వభావాలు అల్లుకొని ఉంటాయి.వీటన్నిటి ప్రభావంకవిపై ఉంటుంది.అది ప్రాంతం,విద్యార్హతలు.వృత్త ి ప్రవృత్తి ఇవిఏవైనా కావొచ్చు.కవి తీసుకునే వస్తువులే కాదు.నిర్మాణపరికరాలుకూడా ఆయా స్వభావాలనానుకునే ఉంటాయి.రకరకాల వృత్తులలో ఉన్నవారు సాహిత్యంలోకి రావడంవల్ల వస్తువులు,నిర్మాణపరికరాలు మొదలైన వాటి వైశాల్యం పెరుగుతుంది.అనేక కొత్తవిషయాలు చర్చకు వస్తాయి.
శ్రీమోదుగు గారు వైద్య పరిభాషతో,ఆ వాతావరణంలోని అంశాలనేతీసుకుని స్పందిస్తూ "మరికొన్ని నూకలు"రాసారు.గుండెల్లో నెప్పి మొదలై అదిస్థిమిత పడక కొంత ప్రయత్నంతరువాత స్వాంతన చేరడందాక ఈకవిత సాగుతుంది.ఇందులోని అంశాలని మానసికోద్వేగంతో చిత్రించారు.
ఇందులో శ్రీమోదుగు గారు చిత్రించిన పద్దతి,అందుకు ఉపయోగించిన పదాలు,పరిభాష గమనించదగింది.గతంలోనూ సాహిత్యంలో ఇలాంటిశైలి డా.ధేనువకొండ శ్రీరామ్మూర్తి కథలు"మోహతిమిరం"లో,ఈ మధ్య వచ్చిననవల"డా.సుందర్ రావు.ఎం.డి."లలో కనిపిస్తుంది.
ఇందులో వైద్య శాస్త్రానికి సంబంధించికొన్ని పదాలు కనిపిస్తాయి.
"యాస్ప్రిన్ హెపారిన్ లు చేతులెత్తేసి సిగ్గుపడుతున్నాయ్"
"thrombolytics రక్తం తో వీర పోరాటం మొదలెట్టినట్లుంది"
యాస్ప్రిన్,హెపారిన్-ఈ రెండూమెడిసిన్స్ హెపారిన్ రక్తం గడ్దకట్టకుండ ఆపేందుకు ఇస్తారు.ఇది గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది కూడా.యాస్ప్రిన్ బ్లీడింగ్ కాకుండా ఉండడంకోసం ఉపయోగిస్తారు,..thrombo lytics..థ్రాంబస్ రక్తం గడ్దకట్టటం ..lytics కరిగించే ప్రక్రియ.నిజానికి ఇవి సామాన్య పాఠకుడినించి ఎక్కువ ఙ్ఞానాన్ని అపేక్షిస్తాయి.
వీటిని చాలా సమర్థవంతంగాకవితలో ప్రయోగించారు.ఒక నెప్పి కలగడం నుండి మళ్లీ సానుకూల పడేదాకా ప్రతి అంశాన్ని కవిత్వం చేయడంలో దర్శనం,దాని వెనుక ఉన్న ఙ్ఞానం స్ఫుటంగా కనిపిస్తాయి.
"కలుక్కు మంది గుండెలో ఎప్పటిలా నీవేనేమో అని సరిపుచ్చు కున్నా
కాని మంట క్రమ క్రమంగా పెద్దదవుతుంది "
"నిను తలుచుకుంటూ బతుకును సాగాతీస్తుంటే
గుండె ఒక్కొక్క దారిని మూస్తోందని ఇప్పుడే తెలుస్తుంది"
"నెమ్మదిగా నా మనోఫలకం విడివడి కన్నులు తెరిచిన వేళ
జీవితం నాకిచ్చిన బహుమతి మరికొన్ని నూకలు "
హృదయంగల వైద్యులు రోగిని ఎన్ని దశల్లో ,ఎంత మానవీయ దృష్టితో పరిశీలిస్తారో ఇందులో అర్థమవుతుంది.మొదటి వాక్యంలో నెప్పి ప్రారంభాన్ని,రెండవ వాక్యంలో రోగి మానసిక సంఘర్షణని,మూడులో స్వాంతన పడిన స్థితిని చిత్రించారు.అన్నిటికీ మించి ఒక తండ్రి-కూతురు మధ్య ఉండే సంబంధాన్నొకదాన్ని స్పర్శించారు.
"నీళ్ళు కొమ్మరించినట్లు తడిచి ముద్దవుతున్నా నీ జ్ఞాపకాల వర్షంలా
బయట అదే వర్షం అదే చిరుజల్లు"
"నా చిట్టి తల్లి మోముని చూసి 'నేను కూడా ఉండకపోతే నీకు ఎలా తల్లీ అనుకున్న క్షణం '
జీవితం నాకిచ్చిన బహుమతి మరికొన్ని నూకలు ........."
సాధారణంగా వినిపించే "నూకలు చెల్లటం"అనే జాతీయంలోని అంతరార్థాన్ని వాడుకున్నా ఈకవిత ద్వారా సాధించిన నిర్మాణం చాలాగొప్పది.ఇది కేవలం చక్కని కవితేకాదు..చిక్కని కవితకూడా.మంచి కవిత అందించినందుకు శ్రీమోదుగు గారికి అభినందనలు.
______ఎం.నారాయణ శర్మ
కవులచుట్టూ కొన్నిస్వభావాలు అల్లుకొని ఉంటాయి.వీటన్నిటి ప్రభావంకవిపై ఉంటుంది.అది ప్రాంతం,విద్యార్హతలు.వృత్త

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి