కోడూరి విజయ్ కుమార్ కవిత:ఒక సంభాషణ కోసం
చాలా కాలం క్రితం ఓ మిత్రుడు"ఫలానా కవిత-మానవీయత"అనే అంశం మీద రీసెర్చ్ చేస్తున్నానన్నాడు.వెంటనే ఇంకో మిత్రుడు"కవితలో మానవీయతని ప్రత్యేకంగా వెదకాలా?అది లేకపోతే కవిఎలా అవుతాడు?"అన్నాడు.రామాయణంలో ని"మానిషాద"శ్లోకం నించి ఇప్పటివరకు ఈధార ఇలా సాగాల్సిందే.
వచ్చిన ఏవాదకవిత్వపు కొత్తదనాన్ని గురించో అధ్యయనం చేస్తుంటాం గాని.దాని సారాంశాన్ని పట్టించుకోం.గత పదేళ్లుగా పోరాడుతున్నప్పుడు(ఆరుపదులై నప్పటికీ)రెండు వైపులా భావోద్వేగాలు(ప్రజల్లో)ఎక్క ువైనపుడు సంభాషణలు సాంత్వన నిస్తాయి.తెలంగాణా ఉద్యమం ఇలాంటి జీవనాస్తిత్వాలను సారవంతం చేసింది.వేనేపల్లి పాండురంగా రావు "కావడి కుండలు"తీసుకు వచ్చారు.ఆమధ్య తెరవేకవిసమ్మేళనం ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి.
కోడూరి విజయ్ కుమార్ గారి కవిత"ఒక సంభాషణ కోసం" ఇలాంటిపనికే పూనుకుంది.తానుగా చెప్పుకున్నట్టు (నాకు అర్థమయినంతలో కూడా)ఆయన లో బయటి కల్లోలమే ఎక్కువ.ఈ కల్లోలాన్నించే వర్తమాన పరిస్తితులనుంచి ఓ సారవంత మైన స్నేహాన్ని అన్వేషిస్తున్నారు.
"ఒక సందేహమేదో ఇంకా తొలిచి వేస్తోంది
నీ వేదననీ కాస్త అక్కున చేర్చుకోవాలని వుంది"
"ఇప్పుడు కూడా నా నేల కన్న కలని ఒక
మాంత్రికుడు పన్నిన వలగానే చూస్తున్నావు'
కోడూరి కవితకు తానే మార్గంలో నడవాలోతెలుసు.ఓ ప్రాంతీయ కవితకుండాల్సిన ధారుడ్యం ఆతాలూకు స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది.తెలంగాణా అడుగడుగునా తనను కోల్పోయిన అంశాన్ని చెబుతారు.ఇందులో కనిపించే వచనం సారవంతమైన సంఘర్షణని వ్యక్తం చేస్తుంది.
"మా మాతృభాష ఒక అనాధ"
"అది వెండితెర హాస్యపు సరుకైనపుడే
ఎర్రబడిన మా ముఖాలని చూడవలసింది'
"ఈ నేల మరొక పోరాటానికి సిద్ధమయ్యాక కూడా
ఇదొక సాధ్యం కాని స్వప్నం అనే నిర్దారించావు "
విజయ్ సమాజపులోతుల్ని,దానికుండే చరిత్రని తెలిసిన కవి.గతంలోనూ ఒకటి రెండు కవితలు రాసారు."అనంతరం"లో ఉన్న 'కొంత కాలంతరువాత కొన్ని ప్రశ్నలు" కవిత ఇలాంటి దృష్టినే ప్రసారం చేస్తుంది.పల్లెలు నగరాల్లో కలసిపోయిన ఉదంతాన్ని కూడా చాలాకవితలు ఉదహరించాయి.గతంలో ప్రత్యెకంగా పల్లెల గురించి రాయకున్నా"గ్లోబల్ సాంగ్"(అక్వేరియంలో బంగారుచేప)లాంటి కవిత రాసిన విజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించటం కొత్తగాదు.
"పల్లెల రక్తమాంసాలు పీల్చి వెలసిన నగరం
సకల ఐశ్వర్యాలు కొలువైన రాజభోగం
ఈ నగరానికి ఇప్పుడు వెల కట్టవలసిందే గానీ
అప్పుడే మా రక్త మాంసాలకు కూడా
ఒక వెల కట్టి వుంటే బాగుండేది !"
కాలపు గమనాన్ని పట్టుకుని ఈచరిత్రనంతా ఒక సంభాషణ లో తెచ్చారు.ఈ కాలానికి కవలసిన కవితని అందించారు విజయ్
_____ఎం.నారాయణ శర్మ
చాలా కాలం క్రితం ఓ మిత్రుడు"ఫలానా కవిత-మానవీయత"అనే అంశం మీద రీసెర్చ్ చేస్తున్నానన్నాడు.వెంటనే ఇంకో మిత్రుడు"కవితలో మానవీయతని ప్రత్యేకంగా వెదకాలా?అది లేకపోతే కవిఎలా అవుతాడు?"అన్నాడు.రామాయణంలో
వచ్చిన ఏవాదకవిత్వపు కొత్తదనాన్ని గురించో అధ్యయనం చేస్తుంటాం గాని.దాని సారాంశాన్ని పట్టించుకోం.గత పదేళ్లుగా పోరాడుతున్నప్పుడు(ఆరుపదులై
కోడూరి విజయ్ కుమార్ గారి కవిత"ఒక సంభాషణ కోసం" ఇలాంటిపనికే పూనుకుంది.తానుగా చెప్పుకున్నట్టు (నాకు అర్థమయినంతలో కూడా)ఆయన లో బయటి కల్లోలమే ఎక్కువ.ఈ కల్లోలాన్నించే వర్తమాన పరిస్తితులనుంచి ఓ సారవంత మైన స్నేహాన్ని అన్వేషిస్తున్నారు.
"ఒక సందేహమేదో ఇంకా తొలిచి వేస్తోంది
నీ వేదననీ కాస్త అక్కున చేర్చుకోవాలని వుంది"
"ఇప్పుడు కూడా నా నేల కన్న కలని ఒక
మాంత్రికుడు పన్నిన వలగానే చూస్తున్నావు'
కోడూరి కవితకు తానే మార్గంలో నడవాలోతెలుసు.ఓ ప్రాంతీయ కవితకుండాల్సిన ధారుడ్యం ఆతాలూకు స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది.తెలంగాణా అడుగడుగునా తనను కోల్పోయిన అంశాన్ని చెబుతారు.ఇందులో కనిపించే వచనం సారవంతమైన సంఘర్షణని వ్యక్తం చేస్తుంది.
"మా మాతృభాష ఒక అనాధ"
"అది వెండితెర హాస్యపు సరుకైనపుడే
ఎర్రబడిన మా ముఖాలని చూడవలసింది'
"ఈ నేల మరొక పోరాటానికి సిద్ధమయ్యాక కూడా
ఇదొక సాధ్యం కాని స్వప్నం అనే నిర్దారించావు "
విజయ్ సమాజపులోతుల్ని,దానికుండే చరిత్రని తెలిసిన కవి.గతంలోనూ ఒకటి రెండు కవితలు రాసారు."అనంతరం"లో ఉన్న 'కొంత కాలంతరువాత కొన్ని ప్రశ్నలు" కవిత ఇలాంటి దృష్టినే ప్రసారం చేస్తుంది.పల్లెలు నగరాల్లో కలసిపోయిన ఉదంతాన్ని కూడా చాలాకవితలు ఉదహరించాయి.గతంలో ప్రత్యెకంగా పల్లెల గురించి రాయకున్నా"గ్లోబల్ సాంగ్"(అక్వేరియంలో బంగారుచేప)లాంటి కవిత రాసిన విజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించటం కొత్తగాదు.
"పల్లెల రక్తమాంసాలు పీల్చి వెలసిన నగరం
సకల ఐశ్వర్యాలు కొలువైన రాజభోగం
ఈ నగరానికి ఇప్పుడు వెల కట్టవలసిందే గానీ
అప్పుడే మా రక్త మాంసాలకు కూడా
ఒక వెల కట్టి వుంటే బాగుండేది !"
కాలపు గమనాన్ని పట్టుకుని ఈచరిత్రనంతా ఒక సంభాషణ లో తెచ్చారు.ఈ కాలానికి కవలసిన కవితని అందించారు విజయ్
_____ఎం.నారాయణ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి