పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Bharathi Katragadda కవిత

వీరవనిత అసలైన వీరవనితవి నీవేనమ్మా! అందుకే నీకు వేల వేల వందనాలమ్మా! వీధుల్లోని చెత్తాచెదారాన్ని ఊడ్చేస్తూ శుభ్రంగా వుంచే నీవే కదమ్మా అసలైన వీర వనితవి. అర్ధరాత్రి సైతం వీధుల్ని శుభ్రం చేసే నిన్ను చూస్తుంటే నీ ధైర్యాన్ని అభినందించాలో నీ వృత్తిధర్మాన్ని మెచ్చుకోవాలో నాకర్ధం కావడం లేదమ్మా! తోడేళ్ళు,గుంటనక్కలు పొంచి వుండే ఈ అర్ధరాత్రి సమయంలో నిన్ను నీవే రక్షించుకుంటూ సాగిపోయే నీ మనోధైర్యానికి నిజంగా వేల వేల సలాములమ్మా! అయినా నీచుట్టూ వుండే ఈ సమాజానికి నీ కష్టాన్ని గుర్తించే తీరికెక్కడిదమ్మా? ఒకవేళ గుర్తించినా నిన్నేదో అంటరానిదానిలానే చూస్తారే తప్ప నిన్ను నిన్నుగా గుర్తించే హృదయమెక్కడిదమ్మా! మీరే లేకపోతే మీ శ్రమే లేకపోతే ఈ సమాజంతో పాటుగా ఈ పరిసరాలెంత కల్య్షితం అవుతాయో కదా!! ఒక్క క్షణం దుర్ఘంధానికే ముక్కు మూసుకునే వీరికి అదే దుర్ఘంధంలో నీవు అనుక్షణం చెలిమి చేస్తుంటే కరడుకట్టిన వీరి హృద్ఫయాలకి కనీసం చిన్న కదలికైనా లేదే? అణువంత కనికరమైనా లేదే? అర్ధరాత్రీ సైతం మీ ధైర్యం చూస్తుంటే నడిరేయి సైతం మీ వృత్తిధర్మం చూస్తుంటే నిజంగా నీకు వేల వేల సలాములమ్మా!!! (అమీర్పేటలో ఒక వివాహానికి హాజరైన నేను అర్ధరాత్రి అక్కడ రోడ్లు ఊడుస్తున్న స్త్రీలని చూసి మనసు చలించి రాసిన కవిత) 23.JUNE14.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UATfX0

Posted by Katta

Panasakarla Prakash కవిత

క్షమాపణలతో... ఎక్కడికి వెళ్ళిపోయావ్ నువ్వు..? నువ్వు దూరమయ్యే సమయానికి నాకు తోడుగా నేను కూడా లేను ఎవ్వరినడగాలి నీ గురి౦చి..? నువ్వే నన్ను ఒ౦టరిని చేసి వెళ్ళిపోయాకా అర్ధ౦ చేసుకోవడమ౦టే ఇదేనా? అర్దా౦తర౦గా నన్ను విడిచి వెళ్ళిపోవడ౦ నా శ్వాసకు ఇక దిక్కెవ్వరు నా క౦టికి ఇక చూపెవ్వరు...? నా హృదయానికి గుర్తెవ్వరు ఇక నా బాధకు ఓదార్పెవ్వరు..? వెళ్ళే ము౦దైనా నన్ను ఒక్కసారి హత్తుకుని చూడాల్సి౦ది ప్రియా.. నీ గు౦డె చప్పుడు నా గు౦డెల్లో నీకు వినిపి౦చేది. వెళ్ళేటప్పుడైనా నీ చేతిని ఒక్కసారి నాకు అ౦ది౦చాల్సి౦ది కదా.. నా అరచేతిలో మెలి తిరిగిన ప్రేమరేఖలు నీ చేతిలో పెట్టిన నా జీవితాన్ని ముద్దాడేవి సూర్యుడు కూడా లోకానికి చెప్పే వెల్తాడుకదా నా జీవితానికి వెలుగిచ్చిన నువ్వే౦టి నాకు ఒక్క మాటైనా చెప్పకు౦డానే చీకటిలోకి వెళ్ళిపోయావ్..? తెలియక నిన్నేమైనా బాధపెట్టి ఉ౦టే నన్ను క్షమి౦చు ఎ౦దుక౦టే నువ్వు శిక్షి౦చే౦త పెద్దవాడిని కాదు నేను ఎప్పుడూ నీ ప్రేమ ధనాన్ని ఆశి౦చే పేదవాడినే... పనసకర్ల‌ 23/06/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5JHE3

Posted by Katta

Arcube Kavi కవిత

ఎక్కడివో ఆమెకు ఆ చేతులు _________________________ఆర్క్యూబ్ ఆమె ఎట్ల సవరిస్తదో... పబ్బుల మీదికి గునా గునా పాకి పొట్ల తీగ తెల్లగ పూస్తది ఆమే వాటి ఆకులకు పసుపు కుంకుమ పెట్టి దండం బెడ్తది ఈ చెట్టుకు దండం బెట్టే చేతులు ఆమెకెక్కడివి ఏదేమైనా- అనాదిగా ప్రవహించే కానుకలు మనుషులను భలె చిగురింపజేస్తై కదూ !

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T3jILs

Posted by Katta

Jyothirmayi Malla కవిత

మిఠాయిపొట్లం ||జ్యోతిర్మయి మళ్ళ|| బంగారమంటే ఇష్టం నాకు.. పెంకుటింటి పద్మ చెవిలోలాకులు ఉత్తుత్తినే ఊగుతున్నపుడూ మేడింటి మాలక్ష్మి లాకెట్టుగొలుసు మరిమరీ మెరిసిపోతున్నపుడూ ఎక్కడో ఏదో వెలితి.. అలాటివేవీ నాకెందుకు లేవో! అమ్మదగ్గరా నాన్నదగ్గరా ఎన్నోసార్లు బయటపెట్టిన ఆశ ఎన్నాళ్ళయినా నిజమవదెందుకో! పండగపండక్కీ చింతపండేసి తోమితే మెరిసే నా చెవిదిద్దులు ఆలోలాకులూ లాకెట్టుగొలుసూ ఎదురవగానే చిన్నబుచ్చుకుని వన్నెతగ్గుతాయెందుకో! కారణం తెలిసేసరికి నాకు చాలా వయసొచ్చేసింది పద్మ పెంకుటిల్లిపుడు మేడయింది ఆమె చెవుల్తో పాటూ మెడ కూడా మెరుస్తోంది మాలక్ష్మి మేడ ఇపుడు నెత్తిన మరో మూడు మేడల్ని పేర్చుకుంది ఆమె మెడే కాదు వొళ్ళంతా ధగధగలాడుతోంది మా గుడిసె మాత్రం మరికాస్త శిధిలమయింది మా నాన్నలాగే! నా బంగారు ఇష్టం చిటారుకొమ్మన వేళ్ళాడుతోంది ఎప్పటిలాగే!

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E6h2

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మన పాత తరాలకు గుర్తింపు పెద్దలు మన పూర్వికుల జ్ఞాపకాలు పెద్దలు మనం కుడా భవిష్యత్ లో పెద్దలమే మనం తెలియకుండా ఎదిగిపోతాం ఇప్పటికి మన బాల్య జ్ఞాపకాలు మనల్ని అంటి పెట్టుకొనే వుంటాయి అనుభవాలే మనల్ని పెద్దవాళ్ళని చేస్తాయి పెళ్ళికి ముందు అమ్మ నాన్నల ప్రేమ యుక్త వయసులో స్నేహితుల సరదాలు బాంధవ్యం తో కుటుంబ బాధ్యతలు పిల్లలతో హృదయ పూర్వక అనుబంధం పెళ్ళిళ్ళతో కోడళ్ళతో పెద్దరికం ఒంటరి తనం లో పాత జ్ఞాపకాలు ఇప్పుడు ఎవరికీ అవసరం లేని బయట పారేయ్యలేని ఒక బరువు !!పార్ధ !!23/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E60u

Posted by Katta

Krishna Reddy Chundi కవిత

చీకటి రాత్రుల్ని నేలంతా పులిమినా వినీలాకాశంలో మబ్బు తెరల్ని కట్టినా వేకువ వెలుగులు విచ్చుకోక మానునా...! అలాగే జీవితంలో కష్టాల తెరలు కమ్ముకున్నంత మాత్రాన అవి శాస్వతం కాదు.. కష్టాల వెంటే సుఖం బాధ వెంటె నవ్వుల పంట ఎప్పుడు ఉంటుంది...

by Krishna Reddy Chundi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljManW

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

//వాన మాయ// -దాసరాజు రామారావు నన్ను తడిపిన వాన ... కళ్ళ మీద కురిసి ముళ్ళ చూపులు విరిచింది నుదుటి మీద ముసిరి అదృష్ట రేఖలు సవరించింది నాసికాగ్రాన బిందువై జారి తన సువాసన తెలిపింది పెదాల మీద వాలి బతుక్కొక చిరునవ్వును కానుక ఇప్పించింది చెంపల మీద కారి ప్రేమ కెంపుల చెమరింపులు పూయించింది మెడ మీద పారి చక్కదనాల చక్కిలిగింతలు తొణికించింది నన్ను కడిగిన వాన.... ముసురుపట్టిన ఆకాశమంతా నా వదనమై- ప్రకృతంతా నా హృదయంలో ఒదిగిన గువ్వపిట్టై- నన్ను విడువని వాన..... 23-6-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6OBpv

Posted by Katta

Nirmalarani Thota కవిత

శ్రీవారి ముచ్చట్లు..! కొంగుకు కట్టేసుకున్నానని ఆడిపోసుకుంటుంటే అలా మౌనంగా చూస్తావేం..? పచ్చని పందిట్లో కొంగు ముడి వేసింది మీరేగా..అని నిలదీయరాదా..! * * * పెళ్ళాం బెల్లమైందని మూతి విరుస్తుంటే ..బిగుసుకుపోతావేం ? ఇరవయేళ్ళు నువ్వు 'పెంచితే' .. అరవై ఏళ్ళు అది 'పంచాలని' చెప్పలేవా..! * * * సిగరెట్టు పాడు పొగ వద్దని చెవినిల్లు కట్టుకుంటే చిందులేస్తావేం..? పుట్టింటి ఊసెత్తొద్దదని కట్టడి చేయడం గుర్తుచేసుకోలేవా..! * * * మధ్యలో వచ్చిన మందు మానమంటే రాక్షసిని చేసి గింజుకుంటావేం..? పుట్టుకతో వచ్చిన ఇష్టాలన్నీ నీకోసం తుంగలో తొక్కానని తెలుసుకోలేవా ? * * * అలవాట్లు మార్చుకోమని బతిమాలుతుంటే అగచాట్లు పెట్టానని అపనిందలేస్తావేం ? ఇంటి పేరుతో సహా మార్చుకుంది నీ కష్టాలు పంచుకోవాలనేనని అర్ధం చేసుకోలేవా..! * * * ఏడడుగులు నీవెంట నీడలా నడిచి వస్తే ఎగతాళిగ చూస్తావేం? ఏడేడు జన్మల తోడై గుండెల్లో పెట్టుకొని గుట్టుగా చూసుకోలేవా..!

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kWYE

Posted by Katta

Lanka Kanaka Sudhakar కవిత

నెక్స్ట్ ప్లీజ్....... --డా.యల్.కె.సుధాకర్. ఆ అమ్మాయి ఇస్మాయిల్ కవిత్వంలా వుంటుంది అబ్బాయి శ్రీశ్రీ పొయెట్రీలా వుంటాడు జాతకాలు సరిపెట్టి దైవజ్ఞులు ఇద్దరికీ ముహూర్తాలు చూసిమరీ పెళ్ళి నిశ్చయించారు పేలబోయే టైంబాంబులా టేబుల్ మీద లగ్నపత్రిక కాలం మలుపుల్లో ప్రయాణిస్తూ వాళ్ళిద్దరూ... కవిత్వ సంతానసాఫల్య కేంద్రాల ద్వారా పిల్లల్ని కన్నారు... అతడు నానో గా మిగిలిపోయాడు ఆమె హైకూ గా స్థిరపడిపోయింది పెరుగుదల సరిగ్గాలేని పిల్లల్తో ఆ ఇల్లు పీ హెచ్ డీల మయమైపోయింది... ఇరవై యేళ్ళు గడిచాయి..... ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో పెళ్ళిసందడి... పేలబోయే టైంబాంబు లా టేబుల్ మీద లగ్నపత్రిక....

by Lanka Kanaka Sudhakar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kUQl

Posted by Katta

Ramana Yellapragada కవిత

అవిశ్రాంత పయనం ! అందమైన స్వప్న సీమలలో అలుపెరుగక విహరిస్తూ.. అను క్షణం దేనికోసమో అన్వేషిస్తూ అందినవి వదిలేస్తూ అందని వాటికై అర్రులు చాస్తూ… అడ్డదారులలో పరుగేట్టేస్తూ అయిన గాయాల్ని చూసుకుని ఏడ్చేస్తూ అనుభవాల చేదు మాత్రల్ని మింగేస్తూ అను నిత్యం కాలానికి ఎదురీదేస్తూ అన్నికధలకు ముగింపు ఒకటేనని చెప్పేస్తూ…. అలిసిపోతూ,రాలిపోతూ,జ్ఞాపకమై మిగిలిపోతూ అనంత యానం సాగుతోంది, అంతు చిక్కని లోకాలకు మనిషి పయనం సాగుతోంది !! 23.04.14

by Ramana Yellapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kUzS

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Freezing point | ప్రశ్నలన్నీ ఎంగిళ్ళయ్యాక ప్రపంచపు ప్రశ్నపత్రం లో అమాయకపు వర్జిన్ ఐడియాస్ సంఘ నియమాల సిలబస్ లో ఇరుక్కోలేక జీజెస్ తో పాటు శిలువ ఎక్కుతాయన్న బెంగ తప్ప నిలదీయటానికి భయపడింది ఎపుడు ? ఈడెన్ తోట లో జ్ఞాన వృక్షపు నిషిద్ద ఫలం రుచి చూడక వివశత్వంలో వివస్త్రగా సాధారణ వెలుగులు అనుసరించి జీవిత కాలపు లాయల్టి కి లఘువుగా మిగులుతానన్న భయం తప్ప నిషిద్దాలకి తలవంచింది ఎప్పుడు టెలిపతి నియంత్రణలో భావోద్వేగ కేంద్రాలు ద్వేషం తో ఘనీభావించినప్పుడు వ్యక్తిత్వ లోపపు అయోమయాలు పాలరాతి తలుపులు వెనక సమాధి అవుతున్నాయన్న కలవరం తప్ప దయలేని దౌర్జన్యాలని ఎదిరించలేనిది ఎపుడు మృగతృష్ణ లలో మునిగి తేలి జ్ఞానతృష్ణలు తీరకుండానే మరణ కాంక్షకి బలైపోతానన్న బెంగ తప్ప చావంటే భయపడింది అసలెప్పుడు ? నిశీ !! 23/06/14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uXghCv

Posted by Katta

Lanka Kanaka Sudhakar కవిత

నిరర్ధక పుష్పగుచ్ఛం ---డా.యల్.కె.సుధాకర్ పూల గుత్తులు పోగేసాను ప్రేమగుచ్ఛం తయారు చేసాను.. నా ప్రణయగీతాల మాధుర్యాన్ని ఆస్వాదించే వాళ్ళకి కానుకివ్వాలని కోరిక... శిశిరవిషాదాన్ని లేకుండాచేసుకున్నాను ఆకురాలిన కాలపు మూగబోయిన గొంతుల్ని పక్షులు శృతి చేసుకుంటున్నాయి... గాలికిరాలిన పూలు అంతకంతకీ వాడిపోతున్నప్పుడు అపురూప ఋతువులన్నీ గతకాలపు జ్ఞాపకాలే అవుతున్నప్పుడు ప్రేమతో నిన్ను బంధించేదుకు ఎవరూ లేని వేళ పూలగుత్తుల్ని బంధించి ప్రేమగుచ్ఛం తయారు చేయడం...... నిరర్ధకం అని తెల్సుకున్నాను.. (చీనా ప్రేమ గీతాలు)

by Lanka Kanaka Sudhakar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uXghlZ

Posted by Katta

Sharada Sivapurapu కవిత

తస్మాత్ జాగ్రత ///// శారద శివపురపు గోతిలోన పాతినా కొన ఊపిరినుంచుకున్న పసిగుడ్డును నేను కడుపుతీపితొ కన్నతల్లి ప్రాణమొడ్డితె బతికి బట్టకట్టితి నేను కుసుమించె సుమమని మురిసినంతలోనె బలియైతిని నేను నన్ను కోరి కనని నా కన్నతండ్రిచేతనే నలిగి వసివాడితి నేను తండ్రి తప్పినదారి నడిచె తనయుడు సోదరియని చూడని కాముకుడు కామమను ఆకలితో, వావి వరసలెల్ల మరచిన వేటగాళ్ళు వీళ్ళు శీలంతో పోని ప్రాణం పోతోంది నేడు ప్రతిక్షణము ప్రతిదినము చూడు సమాధిలోన శవము నాడు, సమాజమున జీవించు శవమైతి నేడు బడుగువర్గపు మహిళనైతే నేను, శీలమేమిటి నీకని గేలి చేసె రక్షకుడు పెద్దింటి ఆడపడుచు నేనైనా వెరువలేదుగదా కన్నుగీట రిక్షావాడు కష్టించి పనిచేయు మహిళ చక్కదనమేగాని కనపడదె పనితనము రహదారిలో పోతెనొంటరిగ, ప్రేమికులైన బస్సుడ్రైవరు, లారీ క్లేనరు ఆటోడ్రైవరు, కాలేజీ కుర్రకారు, చివరకు చేతకర్ర ఉన్న తాతగారు ఎంతవారలూ కాంతదాసులే నిజము, కొంగుతగిలినంతనే శునకానందము ఆరుగజముల చీరలోన నారి నగ్నసౌందర్యము నెమరువేసెనీ పశువులు ఖద్దరు తోపీల నేతల్లో, నామాల బాబాల్లో దాగిన పౌరాణిక సుయోధనులు ముసుగులోని భీముణ్ణైనా ద్రౌపదియేయని మోహించే ఉన్మత్త కీచకులు తెల్లకోటుల్లో, నల్లకోటుల్లో, ఖాకి బట్టల్లో, ఖాది లాల్చీల్లో, కాషాయం ఒంటిమీదా, నుదుట నామాలతో, కాటువేయ మాటేసిన నాగుబాములు కామమను విషము ఒళ్ళంతా నింపుకున్న నవయుగ దుశ్శాశనులు ఎంతవగచిన రారు నేటి ద్రౌపదులకు చీరలిచ్చి కాపాడే క్రిష్ణపరమాత్మలు నైతిక విలువల వలువలు విడిచిన సిగ్గుశరము లేని నగ్నపురుషులు యుగాలు గడిచినా మారలేదు మగవారు, వారి ఆధిక్యతల ఆంతర్యాలు ఆధ్యాత్మిక ముసుగులో ఆశారాంలు ప్రసాదించే అత్యాచారాల వరాలు స్త్రీలకొసం ప్రత్యేక మోక్ష ద్వారాలు, బిగికౌగిలిలో లఘు దైవదర్శనాలు ఆశ్రయాల గేలంతో ఆశ్రమాల వలల చిక్కిన అభాగినుల భోగించే నారాయణసాయిలు ముసలవ్వైనా మునిమనుమరాలైనా, బలిగొన వెరువని కాముకాసురులు అండగా న్యాయశాశ్త్రం లోపాలను వడగట్టిన తొంభైవసంతాలహ! రాంజేట్మలానీలు చూడబోవ ప్రపంచమంత, పురుషులెల్ల తలచె ఆడది తన తొత్తని లేదు మతము,జాతి,వర్గమను భేదము మదము మగవాని సొత్తు నీవు నేర్పిన బుడి బుడి నడకలే నేడు చెరిపె కన్నెల జీవనరేఖలు నాడు పట్టిన పాలచుక్కలాయె పసిపాపల పాలిట విషపు తునకలు నీవు నేర్పిన ముద్దు మాటలె, మూగచేసెను ముదితల గొంతుకలు ప్రేమగ పెట్టిన దిష్టి చుక్కలు, ఎన్నో కన్నెల మార్చెను దిష్టిబొమ్మలుగ దిక్కెవరు లేరు నాకని, దిక్కుతోచకేడ్వ నీకు దేవుడుకూడ దిక్కవడు పురుషులoదు విషపురుగుల నెరుగుట పసిపాపగనె నేర్వాల్సిన ఓనమాలు నిన్ను పీడించువాడెవడైన మరి సహియించిక నెదిరించు చాలు తస్మాత్ జాగ్రత, జాగ్రత, అబల కాక ముందే సబలవవు నీవు. 23/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1me5bse

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ఫేక్ లోక్ || రహస్య దయా మైదానాల హృదయ మార్గమును అన్వేషించుకోలేక లేదా ఎప్పటికి కనుగొనలేక చెదిరిపోయిన నక్షత్రపు గూడులో చెడిపోయిన కాపురాల తప్పులు లెక్కించుకోలేక లేదా ఎప్పటికీ కనులు తెరవలేక ఇప్పటికిప్పుడింక ఇంకా ఆరని తెగిపడిన కవితా పాదాల రక్తపు చారికల వెగటు వాసనల్లో అదే పనిగా ఈదలేక లేదా వెంటనే మునిగి చావలేక ఒకే ఒక్క ద్వేషాన్ని మాత్రమే కలకాలమూ కమ్మని స్వప్నమైన నిజమని ఒకే ఒక్క లోకాన్ని సృష్టించుకుని నీలో అక్కడే బతకలేక లేదా బయటకు రాలేక ఇలా ఇంకొన్ని లేదా మరికొన్ని కారుణ్యరహిత కారణాలిచ్చోట అనేకం. తెలియదా మిత్రమా మరి నీకు. ------------------------------------------24/6/2014 ( శ్రీకాంత్. k,.నీ ద్వేషం అను తొమ్మిది కా/రణాలు లేదా కవిత కాని గాధ ఒకటి.,. కవితకు ఉపసృజన)

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V54LdL

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

శతాబ్దాలు గడిచాయి, దశాబ్దాలు దాటాయి! ఎన్నో మార్పులు మరెన్నో చేర్పులు ! కొన్ని కలయికలు మరిన్ని చీలికలు! ఆనందాలు అవధులు దాటుతున్నాయి, సంప్రదాయాలు సాకిల పడ్డాయి ! కానీ....... పీడితులు, పీడించేవారు, కార్మికులు, కార్పోరేటువారు, రైతన్నలు, రాజకీయ వాదులు,ఓటర్లు నాటకాల నాయకులూ, ఇంకా ఉన్నారు...... పేదలు, పేరు గడించిన వారు, నిర్భాగ్యులు, నీటు తాగే వారు, దౌర్భాగ్యులు, దౌర్జన్యాలు చేసే వారు, ఈ లోకంలో ఇంకా ఉన్నారు ..... ఆకలి దప్పుల ఆర్త నాదాలు, అన్యాయాల అరణ్య రోదనలు టపాసులై పేలుతున్నాయి, దీపావళి దీపాలు ఆర్పుతున్నాయి! బానిసత్వం బాట విడలేదు, కులం గోల కూత ఆపలేదు, రాక్షసులు రాజ్యం వదలలేదు, మద్యం సీసా మనసు దోచింది, సిగరెట్టు పొగ సిగానేక్కి కూర్చుంది! రాజకీయం రాబందులాగా రక్కసి కోరలు చాచింది ! ఇన్ని భూతల మధ్య అమాయకపు జనం ... ఎన్ని యుగాలు మరీనా ఉదయించని జ్ఞానం! అందుకనే ఈ లోకం.... మండుతోంది మండుతోంది ఆరని ఒక మంటలా! రావణుడి కాష్టం లా ! మండుతోంది మండుతోంది వెలుగులేని దివ్వెలా ! ఎగరలేని గువ్వలా ! మండుతోంది మండుతోంది అలుపు లేని ఆర్తి లా! అణగారిన జాతిలా! మండుతోంది మండుతోంది తీరని ఆకలిలా! ఆరని ఒక మంటలా!

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V54GqC

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అక్షరం ప్రవహించే వేళ ****************************** నాచుట్టూ పరిసరాలు చిమ్మ చీకటిలో చెమ్మగిల్లుతూ పరభాషావ్యామోహపరివర్తనంలో దాసోహమంటూ సాగిలబడుతున్నవి, అంతటా తళుకుబెళుకుల తన్మయత్వాలే మమ్మీ దాడీ అంటూ చిన్నపిల్లల చిలుకపలుకుల కులుకులు, అనురాగ రాహిత్యపుసంబోధనలు తల్లిదండ్రులను తన్మయత్వపు ప్రవాహాల్లో ముంచేసి శైశవాన్నతటినీ చికాకులపాల్జేస్తున్నది. ఉదయాస్తమానాలమధ్య పిల్లవాండ్ర మాతృభాషా సంబోధనలు యజమాన్యాలను కలవరపెడుతూ శిక్షించాలన్న తపన వారిమనసుల్లో దినదినాభివృద్ధి చెందుతున్నది. అభంశుభం తెలియని అమాయక విధ్యార్ధులమెడల్లో నేనిక ఇంగ్లీషునే పలుకుతాను తెలుగస్సలు మట్లాడను అంటూ హెచ్చరికల బోర్దులు వేలాడుతూ వ్యవ స్థను వెక్కిరిస్తూన్నవి. నా ఉనికి మృగ్యమై పోతుందేమోనన్న భాషామతల్లి భయకంపితమౌతున్న దృశ్యం ఇదేంవరస ?ఇదిన్యాయమేనా అంటూ నిలదీసి గద్దించే దిశగా కొందరిహృదయాలైనా ముందడుగు వేయడం నిజంగా గర్వించదగిన అంశం. అభిమానుల అంతరంగాలను ఆందొళనాపధంలోకి పడేస్తుందేమోనని పండితవర్గం వేదనపడుతున్న దాఖలాలు అనేకానేకాలు వ్యయమధికమైనా పరభాషాధ్యయనానికి పోటీ పడుతున్న యువత అంతరంగాన్ని అర్ధం చేసుకోలేక భాషామతల్లి తలపంకించి రోదిస్తున్నది. ఆ గద్గదస్వర వేదనలు కన్నీటి పర్యంతమై కకావికలౌతున్న అమ్మ సరస్వతమ్మ ఆక్రందనల స్వరాల విజృంభణలతో తెగిపడిపోతున్న ఆమె కచ్చపి వీణా తంత్రులను సరిచేసుకుంటూ నినమ్రయై నిలుచున్నది నాలో యెదో నాకే తెలియని కదలిక మరుగునపడిపోతున్న మాతృభాషా సంపదనంతా ఒక చోటికి చేర్చాలన్న భావన నన్ను ఉన్నపళాన జాగృతం చేసి వెన్వెంటనే నానిద్రమత్తును వొదిలించాయి. మరుక్షణంలో నాకళ్ళెదుటే అక్షరాలన్నీ అమృతవాహినులై పరవళ్ళతో ప్రవహిస్తున్నదృశ్యం చేదోడువాదోడుగా మనం సహకకరించగలిగితే ఆమె ఇకపై నిరంతరం అమందానంద కందళిత హృదయారవిందయై విరాజిల్లుతుందని నా ప్రగాఢ విశ్వాసం

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLb0hI

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***ఒక్కోసారి*** ఒక్కోసారి.. నదిపాయలా మొదలైన సాధారణ దుఃఖం సాంద్రత పెరిగేకొద్దీ అవుతుంది సముద్రం..!! ఒక్కోసారి.. సాదాగానే మొదలైన బతుకు నాటకం సమస్యల తోరణంగా మారి జీవితం రణరంగమవుతుంది..!! ఒక్కోసారి... అలలా పడిలేచే జీవితం అనుమానం వలలో పడి అవమానం రాక్షసికి అర్ధాయుష్షుగా సాగిలపడుతుంది..! ! ఒక్కోసారి... అప్పటిదాకా..అలవాటుగా ఒద్దికగా సాగే జీవితం, ఒద్దిక సా...గే జీవితం అనిపిస్తుంది..అకస్మాత్తుగ..!! ఒక్కోసారి... ఫలవంతం కాని కలలు మంచు పలకల్లా కరగిపోతే, మనసులో బడబానలం రగిలి.. భరించలేని దేహం చల్లబడుతుంది..!!..23జున్2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4EvoY

Posted by Katta

Achanta Hymavathy కవిత

ఉత్తమ సాహిత్య౦ చదివి-గ్రహి౦చుకున్నవాళ్ళకి జీవితాన్ని నిర్మి౦చుకునే మానసిక సత్తువ వస్తు౦ది.

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL3BPE

Posted by Katta

Achanta Hymavathy కవిత

సమతాంకురం ----------------- నాటాను చైతన్య బీజం- చల్లాను వాత్సల్య జలం! మొలకెత్తుతుంది సభ్యతా అంకురం. మమతా గాలి తగిలి, మొక్క ఎదిగి- మారాకేసి, వృద్ధి చెందుతుంది! పచ్చని రెమ్మల మధ్య పసిడి మొగ్గై, 'ఎప్పుడు విచ్చుకో గలనా?,- ఆ నిరీక్షణా బాధ్యతాయుతమే! మొగ్గపువ్వై,పువ్వుకాయై...పండై, ఉపకర్త కావాలనే తీవ్ర వాంఛ! అభ్యుదయ భావానుభూతికి, అభ్యున్నత స్నేహానుభూతికి, సర్వ ప్రాణులూ హక్కుదారులే! కుతూహల కదనమే గాని ... క్రూర సమరం అవాంఛనీయం! సమతా సమాజ నిర్మాతల- విరామ మెరుగని క్రాంతి పయనం, సేవా సాఫల్యాన ఉప్పొంగే హృదయం- స్వాత్మానుభవ శాతి వలయం. స్వచ్చా మానసం-ఆనంద నిలయం! వ్యధలూ,సౌఖ్యలూ లయ విన్యాసాలై అరుణోదయంలో ఐక్యమౌతున్నాయ్!! దారిద్ర్య,ఖేద దు:ఖాలు సమయగా, వివక్షా రుగ్మతలు తొలగగా... పులకింతుము పుడమి జీవులం- ఉల్లములెల్ల వెల్లువలై ఉప్పొంగగ- అలరారు ఆబాలగోపాలం!!! (2006,కవితామాలిక సంకలనం లో ప్రాచురింపబడింది. 2008,లో మహాకవి'జాషువా'విశిష్ట సేవా పురస్కారం 'సాహితీ శిరోమణి'అనే బిరుదును సంపాదించిపెట్టింది.)

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rprdZx

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ఎండాకాలంలో చెట్లు వర్షాభావం వల్ల కన్నీళ్ళు కార్చడానికి నీ

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tn6NVc

Posted by Katta