పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఏప్రిల్ 2014, శనివారం

Sriramoju Haragopal కవిత

గెలుపు బాటపొంటి మైలురాళ్ళు ఎన్ని నడిసినమని తొవ్వతెలువని అడవులల్ల, వాగులల్ల నడిసిన దూరాలెంతని, ఎన్నని నా ముందర కూలిన వనాలైనా, నా వెనక పెరిగే జనాలైనా వాళ్ళు క్యూబాలోనైనా, బ్రెజిల్ లోనైనా వియత్నాంలో గాని, ఇండియాలో గాని తుపాకి దించింది లేదు, దిమాగ్ మారిందిలేదు మియన్మార్ లో గాని,దక్షిణాఫ్రికాలో గాని అమెరికాలోనైనా, యూరోపులోనైనా గొంతెత్తిన నినాదం ధ్వని, అర్థం మారలేదు సాగుతున్న పోరుబాట అలుపెరుగని బావుటా ప్రాణాలెన్నైనా పోనీ, రానీ రేపటిపొద్దు ఎంత అందమైనదో రేపంటేనే ఎంత ఆనందమైనదో వీడ్కోలు చెప్పిన చేతుల్ని మళ్ళీ చూడనేలేదు కన్నీళ్ళు పెట్టుకున్న కళ్ళను తిరిగి చూడలేదు నదులలెక్క నడిసిపోయె కాలంతో నడక మాది వారసులతో అందివచ్చె తెగువరుతువే మాది ఎన్ని కలల మేఘాల్ని పిండినా ఒక నిజం నీరు రాదు ఎన్ని దుఃఖాల వలరులు విసిరినా ఒక సంతోషం వెనక్కిరాదు ఆరని వేదనలో అంతిమగమ్యం ఒక సమసమాజం ఆగని పోరులో మంచిమనుషులలోకం ఒక్కటే నిజం ఎన్నిసార్లెండిపోయినా గరుక మొలకెత్తుతది ఎన్నిసార్లెనకబడ్డా పోరుగెలిచి తీరుతది

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mmih7G

Posted by Katta

Avvari Nagaraju కవిత

||చేపలు|| ఎ.నాగరాజు ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను తునకలుగా కత్తిరించి నీటిలో వదిలినప్పుడు ఒక్కొక్కటీ ఒక్కో చిన్ని చేపగా మారి సన్నని జీరలుగా ఎరుపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా మాలిమితో కూడిన ప్రేమ కదా ఏమి పేరు పెడదాం వీటికీ? అని ఆమె అనుకుంటుంది చుట్టూ ఇసుక తుఫానులాంటి నల్లని పరదాలు కమ్ముకొస్తున్న జాములలో తనతో తాను మాటాడుకుంటున్నంటుగా ఖండితమయి మోడువారిన చిన్ని కొమ్మల్లాంటి తన వేళ్ళను చూసుకుంటూ ఇవి భయం, పాపం, దేవుడు, శాపం, చావు - తను ఇంకెవరితోనో మరో స్త్రీతో, ఒక స్త్రీ మరొక స్త్రీ మాత్రమే చెప్పగలిగినంత లోగొంతుకతో ఒక మంంత్రోచ్చారణలా భాషిస్తూ వాటిని దోసిళ్ళలోనికెత్తుకొని తన ఉమ్మనీటిలో పొదువుకొంటుంది నెత్తుటి ప్రవాహ గతిలో ప్రాణవాయువును కొద్దికొద్దిగా తోడి ఒక్కో గుక్కా పాలులా పట్టిస్తుంది చేపలు పెరుగుతాయి పెరిగి పెరిగి పెరగడమే తమ వ్యాపకమై విలయంలాగా మరణ సదృశమైన మహా ఆక్రమణలాగా అవి పెరుగుతాయి ముందుగావాటిని ఆమె చిన్ని తొట్టిలో ఉంచుతుంది ఆ తరువాత ఒక వాగులో ఆ తరువాత నదిలో అంతకంతకూ పెరుగుతున్న ఆ చేపలు ఏ రోజుకారోజు తమ చోటు ఎక్కడాని అడుగుతూనే ఉంటాయి చివరకు ఒకింత విసుగుతో సన్నగ కంపితమవుతున్న దేహముతో ఆమె అంటుంది కదా ఇదిగో ఆకాశమయి విస్తరించి సముద్రపు లోతులుగా తొణకిసలాడే ఈ దేహపు గూడు ఇక వచ్చి చేరండి - అనాది గాధను నిదురలేపే డగ్గుత్తికతో ఒక స్త్రీ తనలాంటి మరొకరితో వెతుకులాటులో తడబడుతూ మోకరిల్లే శరణు కోరికలాగా పదే పదే భయం, పాపం, దేవుడు, శాపం, చావులను చెప్పడాన్నితొలిసారి విన్నప్పుడు నీ దేహంలో సన్నని ప్రకంపన 19-04-2014

by Avvari Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkGp5n

Posted by Katta

Arun Sagar కవిత

my old poem but new dedication to paidi teresh anna i love you (written in 1999) ఎ స్ట్రీం ఆఫ్ సబ్ కాన్షస్ నెస్ నీ నడకల కింద ఏమే ఏమేమే మీటలు నాటారా ఎవరైనా కాట్ వాక్ లో వయారీ మయూరీ అడుగేశావంటే చాలు రక్తంలో అడ్రినలిన్ పరవళ్లు సొనాలీ బెంద్రేవో అనూఅగర్వాల్ వో ఓ మెరీ లాంగ్ లెగ్గెడ్ లేడీ వాకింగ్ టాల్ లెతిషియా కాస్టా ఆ సెక్సీ పౌట్ ఎవరికోసమే సుస్మితా పొంగిపొరలే అందాలెన్నో పొంగిపొరలే సౌందర్య రాశీ షారొన్ స్టోన్ పమేలా లీలా లోలా సయ్యారే లీసారే శిల్పమూ వస్తువూ కలిపి తాళం వేద్దాం రిధం డివైన్ నిజమేరా అన్నా లౌ బెగా ఐ టూ వాంటూ హావె గాళ్ ఎవిరీవేర్ అన్నియా ఎన్రీకే ఇగ్లేసియాస్ లెట్ ద రిధం టేక్ ఓవర్ బైలామోస్ శిల్పమూ వస్తువూ వళ్లంతయునూ కవిత్వ ప్రవాహము అందం చూడవయా లక్ష్మీనరసయా ప్లీజ్ ఎప్రిసియేట్ దిస్ నిర్మాణపద్ధతి సంబా సల్సా లంబాడా డర్టీ క్రేజీ కాంప్ ఫైరొకటి రాజేద్దాం అరె ఓ లాటినో ఈ రాత్రికి కొంచెం కొమ్ముబూరా ఊదు రికీ మార్టిన్! యస్ సర్ వెంగా బోయ్స్! ప్రెజెంట్ సర్ ఇదరావ్రే ఖలేద్ భయా శివమెత్తు శివమణీ సవాల్ జవాబ్ డోసెడు వివశత్వం ప్రసాదించు బిడ్డూ నీ డ్రంస్ తేరా ఫ్రెండూ శిల్పాశెట్టిని పిలిపిద్దాం యూపీ బీహార్ క్యా సారా జమానా హసీనోం కా దివానా పెరూ నుంచి కాకపోతే పోర్టోరికో నుంచి నైజీరియా టూ జాంబియా ఒక ఈజిప్టు ఒక కంజరి పాలినీసియాలో మోగిన డప్పు మెలనీసియన్ మొద్దుగొంతు మాధుర్యం ఆధునికాదిమ మూడవ ప్రపంచ సంగీత సమ్మిశ్రమధారకు వెల్కం ఇంటూ ది ఓషన్స్ ఆఫ్ ఫాంటసీ ఊర్రూతలుర్రూతలై సాగే జీవనదుల పొడవు కొలిచేందుకు ఎన్నెన్ని పద్య పాదాలయినా చాలవు ఆ కసి కాంత మేని ప్రకంపనలు కొలిస్తే రిక్టరు స్కేలు ఫెళఫెళ ఇరిగిపోద్దొరేయ్ ముగింపు- ఒక వయోలిన్ ఇంటిదగ్గర నోట్ బుక్ మర్చిపోయి వచ్చెను కాంగో డ్రమ్ములో ఎవరో ద్రాక్షసారాయి నిల్వ చేసిరి కీబోర్డును పబ్లిక్ గా ఎలుకలు కొట్టేయుచున్నవి లీడు లేదు బాసు లేదు ఒక గిటారుకు మతి భ్రమించెను గిరగిర తిప్పిపడేసే పాటలు విని దేహము వెర్రెత్తెను దావానలమయ్యెను -అరుణ్ సాగర్

by Arun Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lkS3hS

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -6 ----------------------------------------- ఒక సూఫీ సాయంత్రం - - - - - - - - - - - - - - - - - - - - - - - - - అఫ్సర్‌ ఏమైందో ఆ మాసిన టోపీ ప్యాంటు జేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి తలకు చుట్టాను జుట్టు జూలు విదిలించకూడదు సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు ఇంకా తెరుచుకోలేదు ఎదురుచూపులు అసర్‌ కోసం అజాఁ పిలుపుతో పావురాలు ఆకాశంగూటిలో రెక్కలెగరేశాయి పుట్టింటికి చేరుకున్న ఆనందం వాటికి చాన్నాళ్ళకు అసర్‌ నమాజ్‌ అయ్యింది వందేళ్ళ క్రితం కన్నుమూసి ఈ రాళ్ళల్లోంచి మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్న ఆ సూఫీ మునిని కప్పుకున్న చాదర్‌లోంచి ఆయన దేహంలోకి చూశాను నా దేహాన్నంతా వొంపి ఆయనని కళ్ళకి అద్దుకున్నాను దువా చదువుతూ మూతపడిన రెండు కళ్ళూ రెండు నీటిచుక్కలై ఆయన చాదర్‌పైన వాలాయి అవి రెండు పకక్షులై ఎటో టపటపా శబ్దం చేసుకుంటూ వెళ్ళాయి బయటికి రాలేకపోయాను ఆయనలోంచి ఒక పాతకాలపు అరబ్బీ పుస్తకం ఏ కాస్త మోటుగా తాకినా చిరిగిపోతుందేమోనన్నంత భయంగా తెరచినట్టు ఆయన జ్ఞాపకాల్లోకి మెల్లిగా వెళ్ళాను ఈ యాత్రకి అర్ధం ఏమిటి? బయటికి అడగుపెట్టానో లేదో! ఒక పకక్షుల సమూహంలో ఏదో పేలిన శబ్దం అందరూ పారిపోతున్నారు ఎవరూ కనిపించడం లేదు కత్తులు తప్ప ఏమీ వినిపించడం లేదు కొసప్రాణం అరుపులు తప్ప మళ్ళీ లోపలికి పరిగెత్తాను అక్కడా నిశ్శబ్దం ఒక పక్షి మాత్రం నెత్తుటి రెక్కతో దర్గా రాయి మీద ఏదో రాస్తోంది చాదర్‌లోకి ముక్కు దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా వుంది ఎక్కడికి వెళ్ళాలిక? నా లోపల వొక సమాధి తవ్వుకుంటున్నాను (వలి గుజరాతి స్మ ృతికి) (కవి వలి గుజరాతి దర్గాను గుజరాత్‌ జెనొసైడ్‌ సమయంలో నేలమట్టం చేశారు) (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8hG1F

Posted by Katta

Kapila Ramkumar కవిత

An appeal :- Please do not post any thing which is not related to Literature particularly against the rules framed in kavisangamam and kindly co-operate with us.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mlHxLj

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-39 అమ్మా! గోమాత...! అదురుచూపులతో అటూ ఇటూ చూసుకుంటూనో స్థిమితంగా నెమరు వేసుకుంటూనో ఈ రోడ్లమీద పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ లో హాయిగా నడయాడుతుంటావు...!! ఖర్మగాలి ఏ వాహనమో నిన్ను గుద్దితే సపర్యలు చేసేవారెవరిక్కడ నీకు...? నీ యజమానికి నీ పాలు కావాలి శ్రమ కావాలి ...కాని నీ బాగు ఎందుకు..? నాకు తీర్చి బొట్లు పెడతారు పండ్లు ఫలహారాలు పెడతారు అని మాగురించి ఎక్కువ ఊహించుకుంటున్నావేమో మా ఖాతాలో పుణ్యం జమచేసుకోడానికి దోష పరిహారాలకి ఏమో చేస్తుంటాం... ఇంతకి మించి లౌక్యం చెప్పినా నీ కర్ధం కాదులే...!!! ---------------------------------------- 19-4-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hXNpsr

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వలు ....................... గోడలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఐదేళ్ళకోసారి ఇప్పుడంతా అంతర్జాల మహేంద్రజాలం పండితులే పలకల్ని పలుకరిస్తూ వాధూలస 19/04/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4B9jI

Posted by Katta

Satya Srinivas కవిత

అద్దాల మేడలో ఉషోదయం అద్దంలో పున్నమి చంద్రుడు ఇంట్లో సాంబ్రాణి ధూపంలా ఆరుబయట నేను కళ్ళలో అరికాళ్ళు పెట్టుకుని పడుకుంటా ---- చిట్లిన అద్దంలో ఉషోదయం దూరంగా రహదారులెంట ఇసుకలారీల్లో ఆవిరైపోతున్న తడిలా చంద్రుడు ఒక్కో చుక్కా రాల్చుకుంటూ రోడ్లకి టైర్లముద్రల ముగ్గులేస్తూ ప్రాణంలేని గాలిబుట్టల నగరాల వైపు పయనిస్తున్నాడు ఓ ప్రాణం లేని కంటిలో కనుపాపైపోడానికి --------- నేను కిటికి తెరిచినప్పుడు ఆరుబయట పచ్చటి పొదలో నల్లటి పిట్ట కంట్లొ తెల్లటి పాటలా పిల్లకి బువ్వపెడుతూ కూస్తాడు (18-4-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjHoCN

Posted by Katta

Subhash Koti కవిత

కవిత్వం కావాలి, కవిత్వం ********* ******** ******** అసలు కవిత్వం అంత అవసరమా ? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. కవిత్వం రాయడమెందుకు ? చదవడమెందుకు ? అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తుంటాయి మనకు.అయితే దీనికి సమాధానం మనకు ' ఒక్తావియో పాస్ ' మాటల్లో వినండి." సామాజిక న్యాయం లేని సమాజం మంచిసమాజం కానట్లైతె, కవిత్వం లేని సమాజం కలలు లేని ,పదాలు లేని, మరీ ముఖ్యంగా మనిషికీ మనిషికీ మధ్య వంతెన లేని సమాజం.మాట్లాడగలం కాబట్టె మనం ఇతర జంతువుల కంటె భిన్నం. మరి భాష ఉత్కృష్త రూపమే కవిత్వం.ఒకవెళ సమాజం కవిత్వాన్ని నిర్మూలిస్తే, ఆ సమాజం ఆధ్యాత్మికంగా ఆత్మహత్య చేసుకుంటుంది." శ్రీ పుట్టపర్తి నాయాయణాచార్యులు ఒకానొక సాహిత్యగోష్ఠిలొ ఈ విధంగా చెప్పారు " మానవుడు ఆలోచనా శీలి, ఆలోచించటం అనేది మానవుడి స్వభావంలోనే ఇమిడి వుంది. ఆలోచన అనేది లేకుండా మానవునికి అస్తిత్వమే లేదు. ఉండదు.నిత్య ఆలోచనాశీలి అయిన మానవునికి గంభీరమైన ఆనందాన్ని, గొప్ప ఆహ్లాదాన్ని కలిగించేది కవిత్వం అవుతుంది." కాబట్టి కవిత్వం భాష యొక్క ఉత్కృష్ట రూపమే కాకుండా మానవుడికి మానసికానందాన్ని కలుగజేస్తుంది. ( మార్చి-ఎప్రిల్ ,2014 " కవితా !" బుల్లెటిన్ సౌజన్యంతో )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lknE3k

Posted by Katta

ShilaLolitha Poet కవిత

తెగనిముడి ________ నల్ల బుట్టనిండా చితికినశరీరాలు గోధుమ త్రాచులా ఒక దాన్నొకటి అల్లుకున్నాయి గంప కింద గిజగిజ లాడే ప్రాణి లా మృత్యువు చుట్టేసి నప్పుడల్లా దానిఆను పానూ చూద్దామనే ప్రయత్నం రుపమూ శబ్దమూ లేనిదయి కళ్ళు కాళ్ళు లేకపోయినా అమాంతంగా ఎత్తుకెళ్ళి పోయే డేగ ప్రెమలూ పిల్లలూ కుటుంబము కలలు కన్నీళ్ళు జీవితమూ కలబోసిన బతుకు కుండలో నీళ్ళోలుకుతున్న చప్పుడు తన వాళ్ళ వయిపు జీడి పాకంలా సాగే మనసు ఒక నిర్వి కల్ప నిరామయ స్థితిలో చడి చప్పుడు లేకుండా వెళ్లి పోతుంది ఇన్నాళ్ళు ప్రేమించింది శరీరాన్నా? మనసునా? మనసైతే నాతోనే నాలోనే ఉంది కదా? మరి దిగులెందుకిక! శరీరాన్నే ప్రేమించి నట్లయి తే_ బాహ్య కర్షణానాది? శరీరంతో మాట్లాడిన మనసునా మనసును చుట్టుకొన్న శరీరాన్నా? ? దేన్ని ప్రేమంటారు? అసలు పోయింది ఏమిటి? ఉన్నదేమిటి?ఉండీ లేని దేమిటి? నేనా? నువ్వా? ఇంకొకరా ?ఒకరింకొకరా? ఈ ముడి ఎంతకీ వీడడం లేదు

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTTswb

Posted by Katta

Harish Babu కవిత

!!మళ్ళీ అవే!!భీమ్ !! మళ్ళీ అవే గుడెక్కే మెట్ల దగ్గర బళ్ళో కూర్చొనే చోటు దగ్గర కుంటలో దోచిట్లో తీసుకొని తాగే నీళ్ళ దగ్గర ఎప్పుడో నన్ను ప్రశ్నించిన పెదాలు తూ..లంజకొడక మాలో కుర్చోక పొతే అటుపోయే కుర్చోవోచ్చుగా అంటూ పెద్దకులపోళ్ళ పెళ్ళి బంతిలో నన్ను గర్జించిన ఓ పెద్దమనిషిలాంటి ఓ ఆడపిల్ల ఇన్నేళ్ళ తరువాత ఎదురై అడుగుతుంది నువ్వు ఎవరంటు...?నీదే ఈ కులమంటూ...? ఈ ప్రశ్న విన్న ప్రతిసారీ...! కళ్ళలో నీటిసుడులు తిరుగుతున్నాయి ఓదార్చే వాళ్ళుంటే రోజంతైనా ఏడుస్తానేమో నువ్వడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక నా కులన్నాడిగి నువ్వేం చేస్తావ్ ఛీ....!నీదా కులమంటూ వాళ్ళలాగే నువ్వు ఎత్తి పోడుస్తావ్ అయిన మాకది కొత్తకాదే గురుదక్షణగా ఇచ్చిన బొటనవేలులు మీ రామాయణ.,మహాభారతాల్లో రాక్షసులుగా చెప్పుకొనే బానిసలు నీలాంటోళ్ళు దూరంగా పెట్టే నాలాంటోళ్ళు మేమంతా ఒక్కటే ఊరికి దూరంగా వేలివేయబడ్డవాళ్ళం దళితులం..,దరిద్రులం.., అంటులేకపోయిన నీలాంటోళ్ళని ముట్టుకోకుడదని మీ దేవుళ్ళ చేత శపించబడ్డ అంటరానోళ్ళం....!

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhXbkd

Posted by Katta

Prasada Murthy Bandaru కవిత



by Prasada Murthy Bandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PfnPlH

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i48v2a

Posted by Katta

Kapila Ramkumar కవిత

||వడ్డేపల్లి కృష్ణ కవిత - బోర్!|| రోజూ రీజుకూ రాజకీయ వగాదానాలు వినీవిని బోర్‌ కొట్టిందేమో? ఎక్కడ బోర్ కొట్టి చూసినా గుక్కెడు నీ్ళ్ళు రావడంలేదు! నీళ్ళు కానని జనం కన్నుల కన్నీళ్ళు ఆగడంలేదు. [పేజి 141 -వడ్డేపల్లి కవితాసంకలనం)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qYhER7

Posted by Katta

Bandla Madhava Rao కవిత



by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1miYBSf

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

/////కార్పొరేట్ పాలిటిక్స్ ///// రాజకీయ పార్టీలు లాభార్జన వ్యాపార సంస్థలు కోట్ల పెట్టుబడిదారులు ఆ సామ్రాజ్య పు సీఈఓలు వృత్తి ప్రావీణ్యాన్ని బట్టి ఉద్యోగులు కంపెనీ మారతారు గెలిచే సత్తా చూపి నాయకులు పార్టీ మారతారు సిద్ధాంతాలూ, మూల సూత్రాలూ పాత కాలం పాటలు దేశ భక్తీ, ప్రజా సేవా అరిగి విరిగిన రికార్డులు గెలుపే లక్ష్యంగా పిల్లి మొగ్గలేసే ప్రోయాక్టివ్ లీడర్లు విన్ విన్ షేర్ ల వాటాలే పార్టీల పొత్తు పొట్లాలు నిజాయితీ పరులు కండువా తీసి టీవీ చూడాల్సిందే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లు కొత్త చరిత్ర రాసుకోవాల్సిందే కుల పెద్దలైతే చాలు బడా నాయకులై పోవచ్చు కుర్రాళ్ళ తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించొచ్చు పెద్ద పెద్ద ముఠాలు పాలనాధి కారానికై బరిలో నిలుస్తాయి గెలిచాక పవర్ ప్రస్థానం లో జట్లు కడతాయి అధికారం దక్కాక ప్రత్యర్ధుల్ని జైలు కంపుతాయి చివరికి ప్రజల్ని ఫూల్స్ చేసి కేసులన్నీ నీటిబుడగ లౌతాయి మాజీ మంత్రుల అవినీతిని కొలిచే మీటర్లు లేవిక్కడ తక్కువ రీడింగ్ చూపిన వాడికి ఠక్కున వోటెయ్యడానికి పార్టీ టికెట్ల పందేరం ఒక నాటి రవికెల పండుగ చందం రెండు పార్టీల నుండీ ఒకరే నామినేషన్ - బేరం కుదిరితే సీట్ ఫైనలై జేషన్ అమ్ముడు పోయిన వార్తా పత్రికల్లో నిష్పాక్షికత నిండు సున్నా అవి పోటీ పడి ప్రజల కయోమయం మరింత పెంచునన్నా.. స్వార్ధ మూర్తుల ఎన్నికల జాతరలో వోటర్లు తప్పిపోయిన పిల్లలు ఉత్తమ నాయకులను ఎన్నటికీ ఎన్నుకోలేని అమాయకపు జీవులు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKH0Qt

Posted by Katta

Sravanthi Itharaju కవిత

విజ్గ్నులు శ్రీ పుష్యమి సాగర్ గారు చాలా విపులంగా నా పుస్తకము"మనసు తలుపు తెరిస్తే"ని ఎంతో రమయంగానూ, రమణీయంగానూ విశ్లేషించి సమీక్షించారు.శ్రీ సాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుంటున్నాను. ఈ పుస్తక సమీక్ష ద్వారా నేను సమాజానికి పలు మానసిక రుగ్మతల పట్ల కల్పించదలచిన "అవగాహనా యగ్నం" లో పాలుపంచుకున్నందులకు నేను సర్వదా కృతగ్నురాలిని...

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jSLTGq

Posted by Katta

Srinivas Saahi కవిత

శ్రీనివాస్ సాహి,*తాజా వార్త...* ఎలిసిపోయిన నీ తెల్ల టోపీకి చెమట పట్టుకున్న నా ఎర్రబొట్టుకి పచ్చబొట్టసొంటి సాయితా... పెరుగుతున్న బ్రతుకు రేటులో మన విలువ ఎప్పుడూ పది పైసలు పతనమవుతుంటుంది గూడొక్కటే వేరు బ్రతుకు పోరు ఇద్దరి మధ్య బరాబరే! బ్రతుకు రోడ్డు మీద ఎన్ని గతుకులున్నా.. భాయిజాన్! మనిద్దరి జబ్బలు-జబ్బలు రాసుకునే తిరుగుతాయి అప్పుడెప్పుడో చదివిన వార్తల్లోల్లాగా మనమింకెప్పుడూ అమాయకుల్లా మిగిలిపోవద్దు అందుకే.. అక్కడ అధికారం కోసం సన్నద్ధమవుతున్న వాడి మొహం మీద నా అక్షరాలతో నిసురుతున్నా ఒక "థ్పూ..." పాత వార్తనే మళ్ళీ తాజాగా ప్రకటిస్తున్నా.. ఇక్కడ అందరి కలల ప్రపంచమొక్కటే అందరి దేశమొక్కటే "భారతీయులందరం ఒక్కటే" 19/04/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qXQGZV

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ద గ్రేట్ స్టుపిడిటి|| నా కిప్పుడు జనం కావాలి. పల్లకీలో ఎక్కించి,.ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే బలిసిన భుజాలు లాంటి జనాలు. రెండు మెతుకులు కూడు కోసం, కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు. పొదుగుల నుండి రక్తం పిండుతున్నా ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు. రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు, నాకిప్పుడు జనం కావాలి. బీజమూ లేక, అండమూ రాక కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే నపుంసకుల్లాంటి జనాలు కావాలి. మనుషులమనే మరిచిపోయిన గార్ధబాల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే, సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. నాకిప్పుడు జనం కావాలి. కళ్లుండి చూడని జనాలు, మెదడుండి ఆలోచించని జనాలు, కాళ్లూ చేతులూ వుండి పనిచేయని సోమరి జనాలు. బతుకంటే ఏంటో తెలియని జనాలు, బతకడం చేతకాని జనాలు, నాకిప్పుడు జనం కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. 2 ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! ---------------------------------19/4/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mgP0v8

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qXO1j6

Posted by Katta