/////కార్పొరేట్ పాలిటిక్స్ ///// రాజకీయ పార్టీలు లాభార్జన వ్యాపార సంస్థలు కోట్ల పెట్టుబడిదారులు ఆ సామ్రాజ్య పు సీఈఓలు వృత్తి ప్రావీణ్యాన్ని బట్టి ఉద్యోగులు కంపెనీ మారతారు గెలిచే సత్తా చూపి నాయకులు పార్టీ మారతారు సిద్ధాంతాలూ, మూల సూత్రాలూ పాత కాలం పాటలు దేశ భక్తీ, ప్రజా సేవా అరిగి విరిగిన రికార్డులు గెలుపే లక్ష్యంగా పిల్లి మొగ్గలేసే ప్రోయాక్టివ్ లీడర్లు విన్ విన్ షేర్ ల వాటాలే పార్టీల పొత్తు పొట్లాలు నిజాయితీ పరులు కండువా తీసి టీవీ చూడాల్సిందే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లు కొత్త చరిత్ర రాసుకోవాల్సిందే కుల పెద్దలైతే చాలు బడా నాయకులై పోవచ్చు కుర్రాళ్ళ తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించొచ్చు పెద్ద పెద్ద ముఠాలు పాలనాధి కారానికై బరిలో నిలుస్తాయి గెలిచాక పవర్ ప్రస్థానం లో జట్లు కడతాయి అధికారం దక్కాక ప్రత్యర్ధుల్ని జైలు కంపుతాయి చివరికి ప్రజల్ని ఫూల్స్ చేసి కేసులన్నీ నీటిబుడగ లౌతాయి మాజీ మంత్రుల అవినీతిని కొలిచే మీటర్లు లేవిక్కడ తక్కువ రీడింగ్ చూపిన వాడికి ఠక్కున వోటెయ్యడానికి పార్టీ టికెట్ల పందేరం ఒక నాటి రవికెల పండుగ చందం రెండు పార్టీల నుండీ ఒకరే నామినేషన్ - బేరం కుదిరితే సీట్ ఫైనలై జేషన్ అమ్ముడు పోయిన వార్తా పత్రికల్లో నిష్పాక్షికత నిండు సున్నా అవి పోటీ పడి ప్రజల కయోమయం మరింత పెంచునన్నా.. స్వార్ధ మూర్తుల ఎన్నికల జాతరలో వోటర్లు తప్పిపోయిన పిల్లలు ఉత్తమ నాయకులను ఎన్నటికీ ఎన్నుకోలేని అమాయకపు జీవులు
by Gouri Lakshmi Alluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKH0Qt
Posted by Katta
by Gouri Lakshmi Alluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKH0Qt
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి