kb ||ద గ్రేట్ స్టుపిడిటి|| నా కిప్పుడు జనం కావాలి. పల్లకీలో ఎక్కించి,.ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే బలిసిన భుజాలు లాంటి జనాలు. రెండు మెతుకులు కూడు కోసం, కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు. పొదుగుల నుండి రక్తం పిండుతున్నా ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు. రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు, నాకిప్పుడు జనం కావాలి. బీజమూ లేక, అండమూ రాక కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే నపుంసకుల్లాంటి జనాలు కావాలి. మనుషులమనే మరిచిపోయిన గార్ధబాల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే, సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. నాకిప్పుడు జనం కావాలి. కళ్లుండి చూడని జనాలు, మెదడుండి ఆలోచించని జనాలు, కాళ్లూ చేతులూ వుండి పనిచేయని సోమరి జనాలు. బతుకంటే ఏంటో తెలియని జనాలు, బతకడం చేతకాని జనాలు, నాకిప్పుడు జనం కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. 2 ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! ---------------------------------19/4/2014
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mgP0v8
Posted by Katta
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mgP0v8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి