!!మళ్ళీ అవే!!భీమ్ !! మళ్ళీ అవే గుడెక్కే మెట్ల దగ్గర బళ్ళో కూర్చొనే చోటు దగ్గర కుంటలో దోచిట్లో తీసుకొని తాగే నీళ్ళ దగ్గర ఎప్పుడో నన్ను ప్రశ్నించిన పెదాలు తూ..లంజకొడక మాలో కుర్చోక పొతే అటుపోయే కుర్చోవోచ్చుగా అంటూ పెద్దకులపోళ్ళ పెళ్ళి బంతిలో నన్ను గర్జించిన ఓ పెద్దమనిషిలాంటి ఓ ఆడపిల్ల ఇన్నేళ్ళ తరువాత ఎదురై అడుగుతుంది నువ్వు ఎవరంటు...?నీదే ఈ కులమంటూ...? ఈ ప్రశ్న విన్న ప్రతిసారీ...! కళ్ళలో నీటిసుడులు తిరుగుతున్నాయి ఓదార్చే వాళ్ళుంటే రోజంతైనా ఏడుస్తానేమో నువ్వడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక నా కులన్నాడిగి నువ్వేం చేస్తావ్ ఛీ....!నీదా కులమంటూ వాళ్ళలాగే నువ్వు ఎత్తి పోడుస్తావ్ అయిన మాకది కొత్తకాదే గురుదక్షణగా ఇచ్చిన బొటనవేలులు మీ రామాయణ.,మహాభారతాల్లో రాక్షసులుగా చెప్పుకొనే బానిసలు నీలాంటోళ్ళు దూరంగా పెట్టే నాలాంటోళ్ళు మేమంతా ఒక్కటే ఊరికి దూరంగా వేలివేయబడ్డవాళ్ళం దళితులం..,దరిద్రులం.., అంటులేకపోయిన నీలాంటోళ్ళని ముట్టుకోకుడదని మీ దేవుళ్ళ చేత శపించబడ్డ అంటరానోళ్ళం....!
by Harish Babu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhXbkd
Posted by Katta
by Harish Babu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhXbkd
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి