గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -6 ----------------------------------------- ఒక సూఫీ సాయంత్రం - - - - - - - - - - - - - - - - - - - - - - - - - అఫ్సర్ ఏమైందో ఆ మాసిన టోపీ ప్యాంటు జేబుల్లోంచి కర్చీఫ్ ముక్క తీసి తలకు చుట్టాను జుట్టు జూలు విదిలించకూడదు సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు ఇంకా తెరుచుకోలేదు ఎదురుచూపులు అసర్ కోసం అజాఁ పిలుపుతో పావురాలు ఆకాశంగూటిలో రెక్కలెగరేశాయి పుట్టింటికి చేరుకున్న ఆనందం వాటికి చాన్నాళ్ళకు అసర్ నమాజ్ అయ్యింది వందేళ్ళ క్రితం కన్నుమూసి ఈ రాళ్ళల్లోంచి మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్న ఆ సూఫీ మునిని కప్పుకున్న చాదర్‌లోంచి ఆయన దేహంలోకి చూశాను నా దేహాన్నంతా వొంపి ఆయనని కళ్ళకి అద్దుకున్నాను దువా చదువుతూ మూతపడిన రెండు కళ్ళూ రెండు నీటిచుక్కలై ఆయన చాదర్‌పైన వాలాయి అవి రెండు పకక్షులై ఎటో టపటపా శబ్దం చేసుకుంటూ వెళ్ళాయి బయటికి రాలేకపోయాను ఆయనలోంచి ఒక పాతకాలపు అరబ్బీ పుస్తకం ఏ కాస్త మోటుగా తాకినా చిరిగిపోతుందేమోనన్నంత భయంగా తెరచినట్టు ఆయన జ్ఞాపకాల్లోకి మెల్లిగా వెళ్ళాను ఈ యాత్రకి అర్ధం ఏమిటి? బయటికి అడగుపెట్టానో లేదో! ఒక పకక్షుల సమూహంలో ఏదో పేలిన శబ్దం అందరూ పారిపోతున్నారు ఎవరూ కనిపించడం లేదు కత్తులు తప్ప ఏమీ వినిపించడం లేదు కొసప్రాణం అరుపులు తప్ప మళ్ళీ లోపలికి పరిగెత్తాను అక్కడా నిశ్శబ్దం ఒక పక్షి మాత్రం నెత్తుటి రెక్కతో దర్గా రాయి మీద ఏదో రాస్తోంది చాదర్‌లోకి ముక్కు దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా వుంది ఎక్కడికి వెళ్ళాలిక? నా లోపల వొక సమాధి తవ్వుకుంటున్నాను (వలి గుజరాతి స్మ ృతికి) (కవి వలి గుజరాతి దర్గాను గుజరాత్ జెనొసైడ్ సమయంలో నేలమట్టం చేశారు) (AZAAN -Poetry on Gujarat Genocide -2002)
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8hG1F
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8hG1F
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి