పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

వుయ్యాల జీవితం గాలిపొరల్లో నా మాటలు, పాటలు, నా దుక్కాలు నా వాగ్దానాలు వుండే వుంటాయి వెలుగుల్లో వుండేవుంటాయి నా కంట్లోని చిత్రాలు, మెరుపులు మరకలు, వానతడి సింగిడీలు మొగులు మీది జారేటి మబ్బులు నేలమీద రాసిన మెరుపుల రాతల్లో నా రుతువులుండే వుంటాయి పారేటి కాలువల్లో పారబోసుకున్న పచ్చివిత్తనాల మొలకనవ్వులు దాచుకునేవుంటాను దున్నిన పొలాల్లో నాగేటిసాల్లళ్ళో నా బతుకమ్మ నన్నెత్తుకుని పాలిచ్చి పాలించే వుంటది ఎన్ని కన్నీళ్ళు గుండెమత్తళ్ళు దుంకినా భరోసా యిచ్చిన మనుషుల మనసుల వేల చేతిస్పర్శలుండే వుంటాయి లేకపోతే... నేనె్ట్లా జీవించివుందును ఎవరో నన్ను ఆత్మీయంగా మోహనం చేయకపోతే ఎవరో నన్ను నా సమస్తదోషాలను ఇగిరించి మిగిలించకపోతే ఎవరో నన్ను నా చిన్ని చిన్ని ఈస్థటిక్స్ ని ఒప్పుకోకపోతే ఎవరో నన్ను నన్నుగానే ప్రేమిస్తూ వుండకపోతే నేనెట్లా సాగుతున్నయాత్ర నయ్యేవాడిని మరుపురాని బాటలెన్ని తిరిగినానో మనసునింపిన తోటలెన్ని గడిపినానో ఆకాశమార్గాన పాఁవురమున్ననా కలలెగిరిపోతున్నా నా ఆకలి తీర్చింది నా మట్టితల్లే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYEoB

Posted by Katta

Patwardhan Mv కవిత

సందర్భం:: ఎవరిది ఇది ??? ................. /////......అన్నా నేనొక జ్వాలా వలయితుణ్ణి దుఃఖితుణ్ణి నా లోపల నా బాధలు నా వెలుపల క్షత జగత్తు ఆక్రోశించిన కరుణా బీభత్సరవాలు నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో సలసల కాగే మానవాశ్రుజలాలు అయినా అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం నా లోపల వినబడుతూ నన్నిలాగ నడిపిస్తూ సృష్టిలోని అర్థం కోసం జన్మలోని సాఫల్యం కోసం జనన మరణాతీతమైన సురభిళ రహస్యం కోసం.......///// ఎవరిదండీ ఈ పద సంగీతం?? 25-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nXWwfY

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || శోధన|| ========================== జీవిత అర్ధం కోసం ప్రతి రోజు భూతద్దం పెట్టి నిఘంటువులో వెతుకుతున్నా నానార్ధాలు తప్ప జీవిత అర్ధం తెలీక అపార్ధాల లోకంలో సంచరిస్తున్నా ! ప్రతి రోజు అద్దం భూతద్ధమై వెక్కిరిస్తుంటే నా ప్రతిబింబం అద్దంలో నుండి తొంగి చూస్తుంది ఈ గూడర్దాల లోకంలో నా రూపం నిత్యం నయవంచనకు లోనవుతూ ... అర్ధం కోసం అన్వేషిస్తే జీవితం పరమార్ధంగా మారింది నిత్య శోధనలో ఎన్నో కఠోర సత్యాలు బాహ్యం గా అర్ధం తెలీక నగ్నంగా వెక్కిరించాయి జీవితంలో నిత్య సంఘర్షణలు ఇంద్రజాలంలా మాయమవుతున్నాయి నీడలు మాత్రం తరుముతున్నాయి నేను మాత్రం పరిగెడుతున్నా నిఘంటువు జీవితమయ్యింది ఎన్నో ఎన్నెన్నో పరమార్ధాల నడుమ జ్ఞాపకాల భూతద్దం పగిలిపోయింది అద్దం లో నీడలు లేవు ప్రతి పేజి ఒక జీవితమే ! ------------------------- మార్చి 25/14

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYC03

Posted by Katta

Prasad PV కవిత

ప్రియమైన ఫేస్ బుక్ మిత్రులకు నా మనవి.. నా పేరుతో కొందరు మిత్రులకు కొన్ని ఇబ్బందికరమైన గ్రూప్ లలో జాయిన్ అవ్వాలని కోరుతూ నేను Invite చేసినట్లు Notifications / Messages వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం నేను కేవలం 5 గ్రూప్ లలో కొనసాగుతున్నాను. అవి " 1. kavi sangamam*కవి సంగమం*(Poetry ), 2. Special group, 3. చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు, 4. ప్రియతమా అందుకో నా గీతం..నీకోసమే" 5. పూల సోయగాలు. ఇందులో "చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు" అనే గ్రూప్ లో నేను 9 మంది Admins లో నేనొక Admin మాత్రమే. ఎవరినైనా నేను Invite చేసిందీ అంటే కేవలం "చీకటి పిలుస్తోంది ... అమావాస్య రాత్రులు" Group లో మాత్రమే. అయితే నా మిత్రులు కొందరికి ఈరోజు కొన్ని అసభ్యకరమైన గ్రూప్ లో నేను Invite చేసినట్టుగా మెస్సేజెస్ వచ్చినట్లు నా ద్రుష్టికి వచ్చింది. FB మిత్రులకు నేను తెలియజేసేదేమిటంటే అలాంటి Messages తో నాకెలాంటి సంబంధం లేదు. అలాగే ఇలాంటి Invitataion messages ఎలా వచ్చాయో నాకూ తెలియడం లేదు. FB మిత్రులు దయచేసి నేనేం చెయ్యాలో నాకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా ప్రమేయం లేకుండా ఇలాంటి Messages తో ఇబ్బంది పడుతున్న నా మిత్రులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలను కోరుతున్నాను. దయచేసి ఈ సమస్యను నేను ఎలా అదిగమించాలో కూడా నా మిత్రులైన మీరు నాకు తెలియజేయాలని కోరుతున్నాను. కృతజ్ఞతలతో...... మీ మిత్రుడు ప్రసాద్ పి.వి.

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYAoX

Posted by Katta

వనజ తాతినేని కవిత

వనజ తాతినేని || స్వప్నలోకం || స్తబ్దత లోను.. అతి నిశ్శబ్ద భావ సంచనల రూపమా.. చేతనతో నన్ను నేను దర్శించుకునేలా చేసే..మాయా దర్పణ సౌధమా .. అనిశ్చిత జీవితాల అంతులేని సందిగ్ధతల క్లిష్ట రూపమా.. జీవనకాసారంలో.. నేడు - రేపు మధ్య సంధిగా నిలిచిన మగతలో.. మరో.. లోకాన్ని.. చూపిన.. నేస్తమా .. అచేతనావస్థలో.. గత స్మృతులను రేపిన.. స్వప్నమా. లౌకిక స్వప్నాలతో.. అలౌకిక ఆనందం మిగిల్చిన .. తేజమా.. కోటి ఊహలతో.. మనోరధంపై..ఊరేగానో కోరికల రెక్కల గట్టుకుని అంబరాన స్వేచ్చా విహంగమై.. విహరించానో.. కలతలెన్నో.. మరిపించావు.. కలవరము కల్గించావు.. నీలో నేను కరగని నాడు.. నేనొక విగత జీవినో..నిశాచరినో.. అందుకే.. అయ్యావు నువ్వే నాలోకం... నాదైన లోకం. స్వప్నలోకం.. స్వప్న సౌధంలో .. నివశిస్తూ అందరు స్వప్న సాకారానికి..ప్రయత్నిస్తూ కొందఱు .. జీవితమంతా స్వాప్నికమై.. సాగుతూ మరి కొందఱు .. స్వప్నం .. బ్రాంతిగా భావించిన ఎందఱో ... ఇందరికి ఉందిక్కడ లిఖించలేని చిరునామా ఓ ... జీవితకాల నమూనా. 25/03/2014.

by వనజ తాతినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVUC5C

Posted by Katta

Srivalli Radhika T కవిత

http://ift.tt/1gVUDq9

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVUDq9

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆహ్వానం జయనామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం 31.3.2014 సోమవారం ఉదయం 10.30 గంటలకు ఖమ్మం మంచికంటీ భవనం వేదికగా నిర్వహించబడును . కవులు, సాహితీ అభిమానులకు సాదర అహ్వానం -- సాహితీ స్రవంతి - ఖమ్మం.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gxMCO1

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljoQaE

Posted by Katta

Chakra Pani Yadav కవిత

ఆటవెలది అమ్మ భాష వదిలి, ఆంగ్లమ్ము నేర్చుట ఆంగ్లమే నిజమిపుడాస్తి యనుట నదిని దాటి తెప్పను తగలెయ్యడమౌను తేనె లొలుకు తెలుగు తీపి నెరుగు

by Chakra Pani Yadav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljf5t2

Posted by Katta

Chi Chi కవిత

_ నిద్రాజనం_ ప్రపంచం పిలిచేదాకా మంచం దిగద్దు పిలిచాక్కూడా దిగద్దు దిగాలనిపించేవరకు మంచమే ప్రపంచం!! అయినా దిగిన తర్వాత మాత్రం ఏముందని? మెలకువతో పడిదొర్లే ప్రపంచమనే ఇంకో మంచం!! నిద్ర మెలకువల మధ్య దూరం మంచమంతుందో , ప్రపంచమంతుందో!! ఎంతుంటే ఏంటి.. మంచముందని నిద్రపోలేం , ప్రపంచముందని మేల్కోలెం రెండూ పిలవ్వు నిజానికి!! కానీ మంచానికి ప్రపంచానికి మధ్య పిలుపుదూరంలో ఏదో ఉంది అసలా పిలుపెందుకుందో పండులోది నిద్ర మెలకువలతో , మంచం ప్రపంచంతో సంబంధంలేకుండా !! అయినా పిలుపుతో మారే ప్రపంచం కోసం మేల్కోవడం కన్నా ప్రపంచమే లేని నిద్రలో మంచం దిగకపోడమే మేలేమో!! ఏందో ఏమో తేలేదాకా మాదీ నిద్రా పోతాయ్!!____(25/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1feohr7

Posted by Katta

Vani Koratamaddi కవిత

//మౌనం// మౌనంగా వున్న మనసు పలుకులు కరువై నిశ్శబ్దరాగాన్ని ఆలపిస్తూ పదాలతో ప్రపంచాన్ని పలుకరిస్తుంది నిట్టూర్పుల గాలులు భరించలేక నిశిలోకి చూస్తూ మనసు తలపులు మూసుకుంటాను నయనాలు కారుస్తున్న జల్లులు చెక్కిళ్ళపై కన్నిటి సముద్రాన్ని తలపిస్తాయి మాటలు పెదాలు దాటలేక భావాలు బయటకు రాలేక.. అక్షరాలై ప్రవహిస్తుంటాయి వాణి కొరటమద్ది 25/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljf2gQ

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/కుదించని సవరణ ---------------------------- 1/కొన్నిసార్లు నాలోకి లోతుగా జారిపోయాక గుండె గోడల పక్కగా ఓ కన్నీటి బిందువొకటి పొడిగా రాలి పడుతుంది నిన్నా నేటికి మధ్యగా 2/అంతరాళంలో కొన్ని నిశ్శబ్ధ అణువులు నీ మౌనంలో బలయ్యాక మిగిలిన శిధిలాల వెనుక దుమ్మును మరోసారి నువ్వుగా దులుపుకుంటూ 3/రెక్కలు మొలవని ఓ పిచ్చుక కళ్ళకింద దాగిన కష్టమేదో నీ మనసులోను ఉన్నట్టు స్రవిస్తాయి నీ పంచేంద్రియాలు ఈరోజు మళ్ళా 4/దివిటీ పట్టుకుని ఎడారి సొరంగాలలో పెనుగులాట తడియారని క్షణం కోసం 5/మంచుకిరీటాలన్నీ నీవే దాచేసుకోవచ్చు కరిగిపోని సంద్రంలో తీయగా 6/ఇంకా నడవాలి కొంత దూరం మళ్ళీ ఇంకొన్నిసార్లు పొడిగా పుప్పొడిగా మారాలి తిలక్ బొమ్మరాజు 25.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljf20o

Posted by Katta

Mounasri Mallik కవిత



by Mounasri Mallik



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEUK

Posted by Katta

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//కొలత// గాలిలో తేమని హైగ్రోమీటర్ తో కొలుస్తారు హృదయంలో తేమను దేనితో కొలుస్తారు చెమర్చిన కళ్లతో తప్ప భూమి కంపిస్తే దాని తీవ్రతను రిక్టార్ స్కేలులో చూస్తారు కవి హృదయకంపనాన్ని దేనిలో చూస్తారు అతని కవిత్వంతో తప్ప

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEUv

Posted by Katta

Santhisri Santhi కవిత



by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEE5

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ప్రేమించటం తప్పు కాదు దానిని ఒప్పించ లేక పోవటం తప్పు నీ వాళ్ళ ఆలోచన నీకు తెలియదా మార్చలేనపుడు వోర్చుకోక తప్పదు నీ ప్రేమ నీకు ముఖ్యం నీ మీద ప్రేమ వాళ్లకు ముఖ్యమే కదా ప్రేమ జీవితాలను నిలపాలి జీవితాలు రాలిపోయే ప్రేమలు ఎందుకు ?? తప్పు ఎవరిదీ కూతురి మీద ప్రేమదా ?? జీవితం బలి తీసుకున్న తన ప్రేమదా ?? ఎవరున్నారు అక్కడ సుఖం గా ?? ఏమి సాధించారు గుండె కోతేగా ?? చస్తే అయ్యో పాపం అనే జనం చావనీకుండా ఆపలేక పోయింది కదా ఎవడి జీవితం వాడిది . బ్రతికి వుంటే చస్తే ప్రతివాడు న్యాయ నిర్నేతే ఎక్కడ వున్నది పెద్దరికం ఎవడి బ్రతుకు వాడు , సమాజం నేడు అయ్యో పాపం అనే దిక్కులేని జనారణ్యం అయింది చూడు మనమంతా ఒక్కటే అని భావిద్దాం మనసు మనసు పంచుకుందా మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం !!పార్ధ!!25mar 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gx8Qj5

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvABrY

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

|ఏమంత తొందర || గులాబీముళ్ళు గుచ్చుకొని రక్తసిక్తమయ్యుంది హస్తం పద్మంకోసం పంకిలంలో జారిపడ్డది పచ్చచొక్కా లింకులకోసం బలమైనలంకెలకోసం బంగపడుతున్నది కొడవలిక్కి నానోట్లో నీవేలు నీకంట్లో నావేలు .....ఎంచక్కా పొత్తయు పొడుచుకొందాం కుదరకుంటే చెప్పు ....కండువాల రంగులు మార్చే ఎజెండాలో పడదాం ఎన్నికలయ్యాక ఎవడెక్కాలో తేల్చుకొందాం......ఏమంత తొందరలేఇప్పుడు ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QaQFVT

Posted by Katta

Meher కవిత

సిద్ధార్థ || రేగడి మన్ను / చీకటి / ఏకాంతం || నేను నడిచే రేగడి మన్నునయ్యా పంతులూ నా జ్ఞాపక కాలం పొయ్యింది రియల్ టైం ఆరిపోయి రీల్ టైం చేజిక్కింది మా ఊరికి చేరుకోలేనిప్పుడు దారి పరాయిదయ్యంది ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ తో అనంతాకాశంలోకి లేచిపొయ్యింది లోపల ఏ జీవీ సందడించకున్నా కాలం కడుపుతో ఉన్నట్టు ఈమె దేహంలో పొలమారుతున్న ముల్లును నేను … రేగుపండు ముల్లును ఈమె చుట్టే పరుచుకున్న పొడిగాలిని తనకోసమే పడిగాపులు పడుతున్న దగ్ధ చినుకుని నారింజ కాసారం … తన తెరపొర … అర కూడా నేనిక్కడ ఎగిరే అఘోరీ పిట్టను - వొంటరి గుట్టను ఏకాంతపు చీకటి రేగడి మన్నును కల రవ్వను కాంతి బొట్టును పదం తెగిన పాదాన్ని నిరామయ మధ్యాహ్నపు పొలిమేరను చిత్ర ఢాకినిని March 24, 2014 http://ift.tt/1jAevCN

by Meher



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4qWYE

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

క్షణాల శాశ్వతత్వం ============ విడిపోయాం ! నిజమే ! మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు ! అదీ నిజమే ! అయితేనేం? మనం స్నేహించిన కాలం లో జీవించాం..గుర్తుందా ? మనం కలిసున్న కాలం ఎంతో కొంత ఉంది కదా ! గంటలో ...రోజులో....నెలలో ... ! నెయ్యంతో పంచుకున్న ఊహలు, ఊసులు పగల బడి నవ్వుకున్న నిమిషాలు... మనసు నలిగినప్పుడు ఓదార్చుకున్న క్షణాలు నేనే నువ్వన్నట్టు, నువ్వే నేనన్నట్టు ఒకరి నొకరు సహానుభూతించిన సందర్భాలు మౌనంగా పక్క పక్కన కూచున్న ఏకాంతాలు నా మనో మందిరంలో అందాల చిత్రాలు అమృతం లాంటి మన సాంగత్యాన్ని గరళం లాంటి నీ నిష్క్రమణాన్ని నా మనసు హంస లా వేరు చేస్తుంది నాటి అద్భుత ఘడియల్ని నెమరేస్తుంది జ్ఞాపకాల పరిమళాల్ని ఆస్వాదిస్తుంది కాల కూటం లాంటి నిర్గమనాన్ని త్యజిస్తుంది చర్విత చర్వణాల పై ఆసక్తి లేదు కా లం చేసిన గాయాలపై అచ్చెరువూ లేదు నిందా, నిష్టూరాలపై అక్కర అసలే లేదు అంతర్లోకంలో ఆ నాటి స్మృతులు నిక్షిప్త నిధులు ఆజన్మాంతం గుండె గదిలో అత్యంత పదిలాలు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSIx

Posted by Katta